2003 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై సచిన్ టెండూల్కర్ తాను నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పారు.
IND vs PAK : శివరాత్రి రోజు పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే శివతాండవమే! గుర్తుందా సెంచూరియన్‌లో ఊచకోత !
IND vs PAK : భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే ఒకరకమైన ఎమోషన్. అలాంటిది వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఆడుతుంటే ఆ వైబ్ మామూలుగా ఉండదు. అదే శివరాత్రి రోజు ఆడితే ఇంకా బీపీ మెషిన్‌లు పగిలిపోతాయి.

IND vs PAK : క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోరు అంటే అది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు. అదొక ఎమోషన్. దశాబ్దాలు గడుస్తున్నా, ఫార్మాట్లు మారుతున్నా ఈ రెండు దేశాల మధ్య క్రీడావైరం, మైదానంలో కనిపించే ఉత్కంఠ ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా శివరాత్రి పర్వదినానికి , భారత్- ప్రపంచకప్‌పోరుకు ఉన్న సంబంధం క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. 2003 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ చేసిన శివతాండవం నేటికీ అభిమానుల గుండెల్లో సజీవంగా ఉంది. ఇప్పుడు మళ్లీ అటువంటి ఉత్కంఠభరితమైన పరిస్థితుల మధ్య కొలంబో వేదికగా దాయాదులు పోరుకు సిద్ధమయ్యాయి.
2003 హై టెన్షన్ మ్యాచ్ క్రికెట్ బడిలో ఒక పాఠం
చరిత్రను ఒకసారి గమనిస్తే 2003 ప్రపంచకప్ కంటే ముందు భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు చాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. 2001లో భారత్ పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిపోయాయి. అప్పటి భారత్ జట్టు కూడా వరుస ఓటములతో సతమతమవుతోంది. విండీస్, న్యూజిలాండ్ జట్ల చేతిలో పరాజయాలు, దక్షిణాఫ్రికా లోకల్ టీంతో ఓటమి వంటి పరిణామాలు భారత్ అభిమానుల్లో తీవ్ర బాధను మిగిల్చాయి. ఒక దశలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కరే స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి అభిమానులను సంయమనం పాటించాలని కోరాల్సి వచ్చింది. మరోవైపు పాక్ పేసర్ షోయబ్ అక్టర్ భారత్ టాప్ ఆర్డర్‌ను పేకమేడలా కూల్చేనంటూ సవాల్ చేశాడు. ఈ ఒత్తిడి ఎంతలా ఉందంటే, ఆ మ్యాచ్ కోసం తాను నిద్రలేని రాత్రులు గడిపినట్టు సచిన్ చాలా సందర్భాల్లో చెప్పారు.
సెంచూరియన్‌లో సచిన్ శివతాండవం
2003 మార్చి 1న మహా శివరాత్రి కావడంతో, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. వీధులన్నీ అప్రకటిత కర్ఫ్యూ విధించినట్టు మారాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, సయ్యద్ అన్వర్ చేసిన 101 పరుగులతో 27 పరుగులు చేసింది. వకార్ యూనిస్, వసీం అక్రమ్, షోయబ్‌అక్తర్ వంటి భీకర పేస్ దళం ఉన్న పాకిస్తాన్ ఆ లక్ష్యాన్ని కాపాడుకుంటామని ధీమాగా ఉంది.
లక్ష్య ఛేదనకు దిగిన సచిన్ టెండూల్కర్ ఆరంభం నుంచే శివతాండవం చేశాడు. అక్తర్ వేసిన రెండో ఓవర్‌లోనే థర్డ్ మ్యాన్ మీదుగా కొట్టిన ఐకానికి సిక్సర్ మ్యాచ్‌టోన్‌ను సెట్ చేసింది. కేవలం 32 బంతుల్లోనే తన 50 పూర్తి చేసుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. సచిన్ విధ్వంసంతో బిత్తరపోయిన అక్తర్ బౌలింగ్ వేయడానికి వణికిపోయాడు. ఇదే స్పీడ్‌తో సచిన్ 75 బంతుల్లో 98 పరుగులు చేసి అక్తర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అప్పటికే భారత్ విజయం ఖాయమైపోయింది. టాప్‌ఆర్డర్‌ను కూలుస్తానంటూ భీరాలు పలికిన అక్తర్ స్పెల్‌లో భారత్ 72 పరుగుల రాబట్టింది. తర్వాత వచ్చిన ద్రవిడ, యువరాజ్ సింగ్ మిగతా పని పూర్తి చేసి భారత్‌ను గెలిపించారు.
#OnThisDay in 2003, a World Cup classic from Sachin Tendulkar against Pakistan in Centurion 🤩pic.twitter.com/ZGHgt4PULD
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2022
ఐస్‌క్రీమ్ తిని కూల్ అయిన సచిన్, కొట్టుకునే వరకు వెళ్లిన హర్భజన్ యూసఫ్
ఆ మ్యాచ్ సమయంలో మైదానంలోనే కాకుండా డ్రెస్‌సింగ్ రూమ్‌లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కెప్టెన్‌గా ఉన్న గంగూలీ టెన్షన్ పడుతుంటే, సచిన్ మాత్రం ఐస్‌క్రీమ్ తింటూ కూల్‌గా కనిపించాడు. పాటలు వింటూ ఒంటరిగా కూర్చున్నాడు. అదే సమయంలో భోజన విరామం టైంలో హర్భజన సింగ్, పాక్ ఆటగాడు మహమ్మద్ యూసఫ్ మధ్య వార్ నడిచింది. వారిద్దరు ఫోర్కులతో దాడి చేసుకునే వరక వెళ్లారు.
ప్రస్తుతం టీమ్ ఇండియా పరిస్థితి!
ప్రస్తుతం క్రికెట్‌లో చూస్తే టీ 20 ప్రపంచకప్ కోసం భారత్ గట్టిగానే ప్రిపేర్ అయ్యింది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. 2024 ప్రపంచక్ తర్వాత భారత్ ఆడిన మ్యాచ్‌లలో 14సార్లు 200 పైగా స్కోర్లు చేశారు.
ఇప్పుడు మ్యాచ్ జరిగే కొలంబో మైదానం స్పిన్నర్లకు స్వర్గాధామంగా ఉండబోతోంది. గతంలో శ్రీలంక సిరీస్‌లో భారత్ బ్యాటర్లు స్పిన్ ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. నమీబియా బౌలర్ ఎరాస్మస్ వంటి మిస్టరీ స్పిన్నర్ల ధాటికి భారత్ రన్ రేట్, వికెట్లు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో కూడా ఉమర్ తారీక్ రూపంలో ఒక మిస్టరీ స్పిన్నర్ ముప్పు పొంచి ఉంది.
2003 తరహాలోనే ఇప్పుడు కూడా భారత్, పాక్ మధ్య అదే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆటగాళ్లు కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం మానేశారు. ఆసియా కప్‌లో విజయం సాధించినా, ట్రోఫీని పీసీబీ ఛైర్మన్ నఖ్వీ తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. వీటికి తోడు బంగ్లాదేశ్ ప్రపంచకప్ వివాదంలో పాక్ జోక్యం చేసుకోవడం, భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించి వెనక్కి తగ్గడం వంటి పరిణామాలు మ్యాచ్ హీట్ పెంచేస్తున్నాయి.
అందుకే మళ్లీ శివరాత్రి రోజున జరిగే మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వన్డే ఫార్మాట్‌కు T20 ఫార్మాట్‌కు చాలా తేడా ఉంది. వన్డే ఫార్మాట్‌లో ఒకసారి ట్రాక్ ఎక్కితే గతి తప్పే పరిస్థితి ఉండదు. కానీ టీ 20లో మాత్రం బంతి బంతికీ మ్యాచ్ గతి మారిపోతుంది.
Frequently Asked Questions
2003 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై సచిన్ టెండూల్కర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు?
2003 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి?
2003 ప్రపంచకప్‌కి ముందు, 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. భారత్ వరుస ఓటములతో సతమతమవుతోంది.
2003 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్‌పై ఎన్ని పరుగులు చేశారు?
2003 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ 75 బంతుల్లో 98 పరుగులు చేశారు. అందులో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
2003 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగింది?
2003 మ్యాచ్ సందర్భంగా, భోజన విరామ సమయంలో హర్భజన్ సింగ్, మహమ్మద్ యూసఫ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సచిన్ మాత్రం ఐస్ క్రీమ్ తింటూ ప్రశాంతంగా కనిపించాడు.




















