భారత పర్యటనను ఆస్ట్రేలియా ఓటమితో ముగించింది. నామామాత్రమైన అయిదో టీ ట్వంటీలోనూ పరాజయం పాలైంది. ఆసిస్‌ ఓటమితో అయిదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను 4-1తో యువ భారత్‌ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 160  పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా  154 పరుగులకే పరిమితమైంది. ఇప్పటికే అయిదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది.



 ఈ మ్యాచ్‌లో మరోసారి టాస్‌ గెలిచిన కంగారులు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, రుతురాజ్ గైక్వాడ్‌ పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. నాలుగు ఓవర్లలో 33 పరుగులు జోడించారు. కానీ 15 బంతుల్లో 1 ఫోరు, రెండు సిక్సర్లతో 21 పరుగులు చేసి యశస్వి జైస్వాల్‌ అవుటయ్యాడు. అదే 33 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి రుతురాజ్‌ గైక్వాడ్‌ వెనుదిరిగాడు. ఆ తర్వాత అయిదు పరుగులు చేసి సూర్యకుమార్‌ యాదవ్, ఆరు పరుగులు చేసి ఫినిషర్‌ రింకూసింగ్‌ వెనుదిరగడంతో 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్‌ కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది. కానీ శ్రేయస్స్‌ అయ్యర్‌ టీమిండియాను ఆదుకున్నాడు. సమయోచితంగా బ్యాటింగ్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. శ్రేయస్ అయ్యర్ 37 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 53 పరుగుల చేసి రాణించాడు. జితేశ్‌ శర్మ 16 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సుతో 24 పరుగులు చేశాడు. అక్షర్‌ పటేల్‌ 21 బంతుల్లో 31 పరుగులు చేశాడు. వీరిద్దరూ పర్వాలేదనిపించడంతో టీమిండియా 160 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు ఆశించిన మేర రాణించకపోవడంతో ఆస్ట్రేలియా ముందు టీమిండియా పర్వాలేదనిపించే లక్ష్యాన్ని 
ఉంచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హార్డీ ఒకటి, బెహ్రాన్‌డ్రాఫ్‌ 2, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ రెండు, నాథన్‌ ఎలిస్‌  ఒకటి, సంఘా ఒక వికెట్‌ తీశారు. 



 అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. లక్ష్య చేధనలో కంగారులకు మంచి ఆరంభం దక్కలేదు. 22 పరుగుల వద్ద కంగారులు తొలి వికెట్‌ కోల్పోయారు. నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేసిన జాన్‌ ఫిలిప్పీ అవుట్‌ అయ్యాడు. కానీ ట్రావిస్‌ హెడ్‌ మరోసారి ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. 18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 28 పరుగులు చేసిన ట్రావిస్‌ హెడ్‌ అవుటయ్యాడు. దీంతో 47 పరుగుల వద్ద కంగారులు రెండో వికెట్‌ కోల్పోయారు. కానీ మెక్‌ డార్మెట్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా కంగారులను విజయం వైపు నడిపించాడు. 36 బంతుల్లో అయిదు ఫోర్లతో 54 పరుగులు చేసి డార్మెట్‌ అవుటయ్యాడు. హార్డీ కూడా ఆరు పరుగులు చేసి అవుట్వవడంతో  102 పరుగులకు కంగారులు నాలుగు వికెట్లు కోల్పోయారు.



 కానీ టిమ్‌ డేవిడ్‌ 17, షార్ట్‌ 16 పరుగులతో పర్వాలేదనిపించడంతో ఆస్ట్రేలియా విజయం దిశగా పయనించింది. కానీ టిమ్‌ డేవిడ్‌, షార్ట్‌, బెహ్రాన్‌డ్రాఫ్‌ వరుసగా అవుట్‌ అవ్వడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. 129 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోవడంతో భారత్‌ మళ్లీ రేసులోకి వచ్చింది. కానీ చివరి 11 బంతుల్లో 16 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ క్రీజులో ఉండడంతో ఆస్ట్రేలియా గెలుపుపై ధీమాగానే ఉంది. కానీ వేడ్‌ను అర్ష్‌దీప్‌ సింగ్‌ అవుట్‌ చేసి కంగారుల ఆశలపై నీళ్లు చల్లాడు. గత మ్యాచ్‌లో రెండు ఓవర్లు 41 పరుగులను కాపాడుకోలేకపోయిన భారత బౌలర్లు ఈసారి మాత్రం 17 పరుగులను కాపాడుకున్నారు.