అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాల్గో టెస్టులో లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 75 బంతుల్లో 94 పరుగులు చేశాడు. మరోవైపు స్టీవ్ స్మిత్ ఆచితూచి ఆడుతున్నాడు. అతను 27 బంతుల్లో 17 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు.
కీలకమైన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకు ఆస్ట్రేలియా మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఆడింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ... భారత్ బౌలర్లను చాలా దీటుగా ఎదుర్కొన్నారు. 61 పరుగుల వద్ద భారత్‌కు తొలివికెట్ ట్రావిస్ హెడ్ రూపంలో దొరికింది.
ట్రావిస్ హెడ్‌ను రవిచంద్రన్ అశ్విన్ బోల్తా కొట్టించాడు. 16వ ఓవర్ తొలి బంతికే జడేజా క్యాచ్ పట్టి హెడ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అతను 44 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
తర్వాత మార్నస్ లబుషేన్‌ను మహ్మద్ షమీ బోల్తా కొట్టించి బౌల్డ్ చేశాడు. దీంతో 72 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 4 పరుగులకే మార్నస్ లబుషేన్ ఔటయ్యాడు. లంచ్ విరామానికి క్రీజ్‌లో ఖవాజా 27 పరుగులతో స్టీవ్ స్మిత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌బౌలర్లలో షమి, అశ్విన్ చేరో వికెట్ తీసుకున్నారు.
అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ ఫ్లాట్ గా ఉండే అవకాశం ఉందన్న అంచనాతో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ రోజే ఎలాంటి టర్న్ ఉండబోదని ఆ జట్టు విశ్వసించింది. అనుకున్నట్టుగానే వికెట్ల కోసం బౌలర్లు శ్రమించాల్సి వస్తోంది. ఎందుకంటే లాస్ట్ మూడు టెస్టులు చూశాం. కనీసం మూడురోజులు కూడా ఆడలేదు. సో ఈ సారి కొంచెం ఐదు రోజుల మ్యాచ్ జరిగేలానే క్యూరేటర్ పిచ్ ప్లాన్ చేశారని అర్థమవుతోంది. డే బై డే పిచ్ మీద స్క్రాచెస్ వస్తాయి కాబట్టి స్పిన్నర్లకు అడ్వాంటేజ్ కావచ్చు. కానీ ఫస్ట్ డే మాత్రం బ్యాట్స్మన్ కు అనుకూలంగా ఉన్నట్టే కనిపిస్తోంది.
ఈ మ్యాచ్‌లో అనుకున్నట్టుగానే టీమిండియా సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చి షమిని బరిలో దింపింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టులో టీమ్ఇండియా ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. భారత వెటరన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షమీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించడం జట్టుకు ప్రయోజనం చేకూరింది. ఓ వికెట్‌ను షమీ తీసుకున్నాడు.
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ హాజరయ్యారు. టీమిండియా టెస్టు క్యాప్‌ను రోహిత్ శర్మకు ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు. అదే సమయంలో స్టీవ్ స్మిత్ కు టీమ్ క్యాప్‌ను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఇచ్చారు. భారత్, ఆస్ట్రేలియాల స్నేహం 4 ఏళ్లు పూర్తి చేసుకుంది.