Harmanpreet Kaur and Jemimah Rodrigues Tears :ఆస్ట్రేలియాపై రికార్డు ఛేదన తర్వాత భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న హర్మన్‌ప్రీత్, జెమీమా
ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక విజయం నమోదు చేసిన భారత మహిళా క్రికెటర్లు భావోద్వేగానికి గురయ్యారు. తరతరాలు చెప్పుకునే విజయాన్ని అందించిన తర్వాత హర్మన్‌ప్రీత్, జెమీమా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.

Harmanpreet Kaur and Jemimah Rodrigues Tears : భారత మహిళా క్రికెట్ చరిత్రలో అక్టోబర్ 30, 2025 రోజు ఒక సువర్ణాక్షరాలతో రాయదగిన రోజుగా మారిపోయింది. మెగా ఈవెంట్‌లో విజయం సాధించాలనే దశాబ్దాల కలను నిజం చేసుకునే దిశగా, ఐసీసీ మహిళా ప్రపంచకప్ సెమీఫైనల్‌లో అసాధారణమైన పోరాటం కనబరిచిన భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా విజయవంతమైన జట్టును మట్టికరిపించింది. ఈ విజయం కేవలం గెలుపు మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల నిరీక్షణ, పట్టుదల, అనూహ్యమైన ధైర్యానికి నిదర్శనంగా మారుతోంది.
భారత జట్టు సెమీఫైనల్‌లో అసాధ్యమనుకున్న 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, ప్రత్యర్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఛేదనల్లో ది బెస్ట్‌గా నిలిచింది. ఈ అద్భుతమైన గెలుపు తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) స్టార్ బ్యాటర్ , సెంచరీ క్వీన్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) భావోద్వేగంతో పెట్టుకున్న కన్నీళ్లు చాలా భారతీయుల కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి.
📽️ Raw reactions after an ecstatic win 🥹
— BCCI Women (@BCCIWomen) October 31, 2025
The #WomenInBlue celebrate a monumental victory and a record-breaking chase in Navi Mumbai 🥳
Get your #CWC25 tickets 🎟️ now: https://t.co/vGzkkgwXt4 #TeamIndia | #INDvAUS pic.twitter.com/MSV9AMX4K1
అనూహ్య లక్ష్యం.. ఆరంభంలోనే సవాళ్లు
టోర్నమెంట్‌లో అత్యంత పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (Phoebe Litchfield) అద్భుతమైన 117 పరుగులు చేయడంతో, ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. 338 పరుగుల ఛేదన అనేది మహిళల వన్డే క్రికెట్‌లో ఒక సవాలుగా మారింది.
లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే ఒడిదుడుకులను ఎదుర్కొంది. షఫాలీ వర్మ (Shafali Verma), స్మృతి మంధాన (Smriti Mandhana) త్వరత్వరగా వెనుదిరిగినప్పటికీ, జట్టు పరుగులు చేసే వేగాన్ని మాత్రం తగ్గించలేదు. టార్గెట్‌ను ఛేదించాలనే ఉద్దేశం టీమ్‌లో బలంగా కనిపించింది.
కంచుకోటను బద్దలు కొట్టిన జెమీమా-హర్మన్‌ప్రీత్
భారత ఛేదనకు అసలైన బలం, నిలకడ మూడవ వికెట్‌కు లభించింది. జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ ఇద్దరూ క్రీజులో నిలదొక్కుకుని, ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ జోడీ మూడో వికెట్‌కు ఏకంగా 167 పరుగులు జోడించింది. భారత్‌ను విజయం దిశగా నిడిపించింది. హర్మన్‌ప్రీత్ 89 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ ఆస్ట్రేలియా బౌలర్లకు దొరకకుండా, చిరుతలా పరుగుల వేట కొనసాగించింది.
జెమీమా రోడ్రిగ్స్ ఏకంగా 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో ఉండి భారత్‌ను విజయ తీరాలకు చేర్చింది. లక్ష్యం వైపు భారత్ దూసుకుపోతున్న సమయంలో, హర్మన్‌ప్రీత్ కౌర్ వికెట్ కోల్పోవడం ఆస్ట్రేలియాకు బలాన్ని ఇచ్చింది. అప్పుడు భారత్ శిబిరంలో కూడా కంగారు మొదలైంది. అయినప్పటికీ, జెమీమా తన లక్ష్యాన్ని పూర్తి చేయాలనే కసితో బంతిని బలంగా బాదుతూ కనిపించింది. చివరకు ఐదు వికెట్లు మిగిలి ఉండగానే భారత్‌ను గెలిపించింది.
రికార్డుల సునామీ ఆస్ట్రేలియా ఆధిపత్యానికి తెర
భారత మహిళా జట్టు సాధించిన ఈ విజయం అనేక అంతర్జాతీయ రికార్డులను తిరగరాసింది. ఈ గెలుపు ఆస్ట్రేలియా జట్టు ప్రపంచకప్‌లో కొనసాగించిన 15 మ్యాచ్‌ల వరుస విజయాల పరంపరకు తెరదించింది. ఇది ప్రపంచకప్‌లలో ఏ జట్టుకైనా అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.
కొత్తగా నెలకొల్పిన రికార్డులు:
1. 300+ ఛేదన తొలిసారి: వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ (పురుషులది లేదా మహిళలది) చరిత్రలో 300 పరుగుల కంటే ఎక్కువ స్కోరును విజయవంతంగా ఛేదించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు అత్యధిక ఛేదన పురుషుల ప్రపంచకప్ 2015 సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ 298 పరుగులను సౌత్ ఆఫ్రికాపై ఛేదించడం.
Jemimah Rodrigues and Harmanpreet Kaur in tears after the win. 🥹🇮🇳 pic.twitter.com/q5FT1RVx74
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2025
2. మహిళల వన్డేలలో అత్యధిక ఛేదన: భారత మహిళా జట్టు సాధించిన 339 పరుగుల ఛేదన, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ఛేదనగా నమోదైంది. ఆసక్తికరంగా, ఈ రికార్డును భారత్ ఆస్ట్రేలియా నుంచే కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లోనే ఇంతకుముందు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్‌పై ఆస్ట్రేలియా 331 పరుగులను ఛేదించి రికార్డు సృష్టించింది.
3. రెండో అత్యధిక స్కోరు: భారత్ చేసిన 341/5 స్కోరు, మహిళల వన్డే ఛేదనలో రెండో అత్యధిక స్కోరు. ఢిల్లీలో అదే ఆస్ట్రేలియా జట్టుపై భారత్ చేసిన 369 పరుగుల స్కోరు అత్యధికంగా ఉంది.
4. నాకౌట్‌లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్: జెమీమా రోడ్రిగ్స్ ప్రపంచకప్ నాకౌట్ ఛేదనలో సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచింది. 2022 ఫైనల్‌లో నాట్-సైవర్ బ్రంట్ 148* పరుగులు చేసిన తర్వాత ఈ ఘనత సాధించింది జెమీమా.
ఇంతకుముందు మహిళల వన్డే ప్రపంచకప్‌లలో భారత్ ఎప్పుడూ 200 కంటే ఎక్కువ స్కోరును ఛేదించలేదు. కానీ ఈ సారి రికార్డును బద్దలు కొట్టడానికి ఇంతకంటే మంచి రోజు లేదనే చెప్పాలి.
భావోద్వేగాలు ఆపుకోలేకపోయిన ప్లేయర్లు
భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన విజయం సాధించిన తరువాత, క్రీడాకారిణులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయారు. హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటి ధారలు ఆపుకోలేకపోయింది. అద్భుతమైన సెంచరీ సాధించిన జెమీమా రోడ్రిగ్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
𝗪𝗮𝗹𝗸𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝘁𝗮𝗹𝗸, 𝗳𝘁. 𝗝𝗲𝗺𝗶𝗺𝗮𝗵 𝗥𝗼𝗱𝗿𝗶𝗴𝘂𝗲𝘀 😎
— BCCI Women (@BCCIWomen) October 31, 2025
She said Navi Mumbai is #TeamIndia's home and proved it with an innings of a lifetime to seal a spot in the #Final. 🔥
Get your #CWC25 tickets 🎟️ now: https://t.co/vGzkkgwpDw #WomenInBlue | #INDvAUS |… pic.twitter.com/Hcfa9e0Yi5
మూడవసారి ఫైనల్, తొలి టైటిల్ వేట
ఈ చారిత్రక విజయం ఫలితంగా, భారత్ మూడవసారి ఐసీసీ మహిళా ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. గతంలో భారత మహిళా జట్టు 2005,2017లో ఫైనల్స్‌కు చేరుకుని రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాలని వారు కలలు కంటున్నారు. సెమీఫైనల్స్ జరిగిన వేదికలోనే, నవంబర్ 2వ తేదీన జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఎదుర్కోనుంది.
ఈ విజయం భారత క్రికెట్‌కు ఒక కొత్త శకానికి నాంది పలికింది. జెమీమా, హర్మన్‌ప్రీత్ వంటి క్రీడాకారిణులు చూపించిన పట్టుదల, ఆత్మవిశ్వాసం యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తాయి. ఇదంతా ఒక గొప్ప కలల పయనానికి నిదర్శనం. ఆ కల పూర్తి కావాలంటే, కేవలం ఇంకొక్క అడుగు దూరంలో ఉంది – అదే నవంబర్ 2న జరగబోయే ఫైనల్ పోరాటం. భారత మహిళా జట్టు ఈసారి కప్‌ను సాధించి, దేశానికి తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.




















