ICC Revokes Ban Imposed On Sri Lanka Cricket: శ్రీలంక క్రికెట్‌‌ బోర్డు(sri lanka cricket board)కు భారీ ఊరట దక్కింది. ఆ దేశ బోర్డుపై విధించిన సస్పెన్షన్‌‌ను ఐసీసీ(ICC) ఎత్తి వేసింది. రెండు నెలల నుంచి లంక బోర్డు పరిస్థితులను నిశితంగా పరిశీలించిన ఇంటర్నేషనల్‌‌ బాడీ రాజకీయ జోక్యం లేదని నిర్ధారించుకుంది. గతేడాది సస్పెన్షన్‌‌ వేటు వేయడంతో అండర్‌‌–19 వరల్డ్‌‌ కప్‌‌ ఆతిథ్య హక్కులను లంక కోల్పోయింది. ఈ క్రమంలో 2026 టీ20 వరల్డ్‌‌ కప్‌‌ హక్కులు కూడా చేజారుతాయనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు సస్పెన్షన్‌‌ తొలగిపోవడంతో లంక బోర్డు యథాతథంగా అంతర్జాతీయ షెడ్యూల్‌ను మొదలుపెట్టనుంది.


అసలు ఏం జరిగిందంటే..?
 అంతర్జాతీయ క్రికెట్ మండలి(International Cricket Council) ఐసీసీ(ICC) బోర్డు గత ఏడాది నవంబరు 10న శ్రీలంక క్రికెట్‌ బోర్డు(sri lanka cricket board) సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఒక సభ్య దేశంగా శ్రీలంక క్రికెట్ బోర్డు తమ బాధ్యతలను ఉల్లంఘిస్తోందని ఐసీసీ బోర్డు (ICC )ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు తమ వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించడం సాధ్యం కాదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డ్ శ్రీలంక క్రికెట్ ICC సభ్యత్వాన్ని తక్షణమే సస్పెండ్ చేసింది. శ్రీలంకలో క్రికెట్ అడ్మినిస్ట్రేషన్, కంట్రోలింగ్ అంతా ప్రభుత్వ జోక్యం ఉంది. సస్పెన్షన్ నిబంధనలను ఐసీసీ బోర్డు తగిన సమయంలో నిర్ణయిస్తుంది’’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.


ప్రభుత్వం జోక్యం లేకుండా శ్రీలంకలో క్రికెట్ నిర్వహణ, క్రికెట్ నియంత్రణ బాధ్యతలను నిర్వర్తించడంలో క్రికెట్ బోర్డు విఫలమైందని ఐసీసీ ఆరోపించింది. ఇప్పటికే వరల్డ్ కప్(World Cup 2023) లో శ్రీలంక జట్టు నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే శ్రీలంక క్రికెట్‌ బోర్డును ఐసీసీ రద్దు చేసింది. ప్రపంచ కప్‌లో శ్రీలంక 9 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో ఏడు మ్యాచుల్లో శ్రీలంక ఓడిపోయింది.


వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శన
భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో  పేలవ ప్రదర్శన కారణంగా శ్రీలంక బోర్డులో, శ్రీలంకలో గందరగోళం ఏర్పడింది. దీంతో శ్రీలంక క్రికెట్ గవర్నింగ్ బాడీని రద్దు చేస్తూ శ్రీలంక పార్లమెంట్ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీనికి అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా పూర్తి మద్దతు లభించింది. శ్రీలంక క్రికెట్ జట్టు శుక్రవారం ఉదయం భారత్ నుంచి తిరిగి వెళ్లింది. బెంగళూరులో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండింటిని మాత్రమే గెలవగలిగింది. దీంతో ఇది ఇప్పటివరకు వారి అత్యంత పేలవ ప్రదర్శన అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే భారత్‌పై శ్రీలంక జట్టు 56 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింగ్ శ్రీలంక క్రికెట్ బాడీని తొలగించి, క్రికెట్ బోర్డును నడపడానికి ఏడుగురు సభ్యుల మధ్యంతర కమిటీకి మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అర్జున రణతుంగను చీఫ్ గా నియమించారు. అయితే, కోర్టులో అప్పీల్ తర్వాత, షమ్మీ సిల్వా నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ బోర్డు  తిరిగి నియమించారు.