India vs Australia: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఈ సిరీస్‌లోని మూడవ వన్డే ఇంటర్నేషనల్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను కేవలం 236 పరుగులకే భారత్ పరిమితం చేయగలిగింది. మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 6 మంది బౌలర్లను ఉపయోగించాడు, ఇందులో అందరూ వికెట్లు తీసుకున్నారు. హర్షిత్ రాణా భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. హర్షిత్ ఆస్ట్రేలియా తరఫున 4 వికెట్లు పడగొట్టాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను 236 పరుగులకే పరిమితం చేశారు. ఇందులో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టగా. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ ఇంకా 237 పరుగులు చేయాలి.
పెర్త్‌లో, ఆ తర్వాత అడిలైడ్‌లో ఓడిపోయిన తర్వాత టీమిండియా సిరీస్‌ను పోగొట్టుకుంది. కానీ సిడ్నీలో జరుగుతున్న ఆఖరి వన్డేలో విజయం సాధించి క్లీన్ స్వీప్ కాకుండా చూడాలని ఆడుతోంది. సిరీస్‌పై ప్రభావం చూపకపోయినా ఈ మ్యాచ్ గెలవడం భారత్‌కు ముఖ్యం. అందుకే రెండు మార్పులతో ఈ మ్యాచ్‌లో ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే, వచ్చే వారం ప్రారంభమయ్యే T20 సిరీస్‌లోకి వెళ్లే ముందు భారత్‌కు అవసరమైన ఆత్మవిశ్వాసం లభిస్తుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు మంచి ఆరంభమే దొరికింది. కాని దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. మిచెల్ మార్ష్ , ట్రావిస్ హెడ్‌తో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. వాళ్ల జోరు చూస్తే కచ్చితంగా స్కోర్ బోర్డులో మంచి స్కోరు కనిపిస్తుందని అంతా అనుకున్‌నారు.
అయితే, స్కోరు 60/0 నుంచి 88/2కి మారింది, ఆ తర్వాత ఆస్ట్రేలియా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో ఫెయిల్ అయ్యింది. యువ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హర్షిత్ రాణా ఈరోజు 8.4 ఓవర్లలో 39/4 గణాంకాలను నమోదు చేసి ఆకట్టుకున్నాడు. అడిలైడ్ మ్యాచ్‌లో కూడా అతను రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇవాళ్టి ఆట మాత్రం అదుర్స్ అనిపించాడు.
సిరీస్‌లో తన మొదటి మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్ యాదవ్ కూడా సిడ్నీలో చాలా బాగా రాణించాడు, 10 ఓవర్లు బౌలింగ్ చేసి, 50 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ తీసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 7 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 7.43 ఎకానమీతో రాణించాడు. అయితే, ఈరోజు అతను నాథన్ ఎల్లిస్ వికెట్ కూడా తీసుకున్నాడు.
సిరాజ్‌కు చిక్కిన ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియా కెప్టెన్ మిచ్ మార్ష్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ ఘనమైన ఆరంభాన్ని అందించారు, కానీ మిడిల్ ఆర్డర్‌పై భారత బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు. ట్రావిస్ హెడ్ మరోసారి మహమ్మద్ సిరాజ్ చేతిలో తన వికెట్‌ను కోల్పోయాడు. సిరాజ్ భారత్‌తో జరిగిన 19 ఇన్నింగ్స్‌లలో ఎనిమిది సార్లు హెడ్‌ను అవుట్ చేశాడు.
హర్షిత్ రాణా 4 వికెట్లు తీశారు
సిడ్నీ వన్డేలో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ భారత్‌కు మంచి వికెట్లు అందించారు. వాషింగ్టన్ సుందర్ మాథ్యూ షార్ట్, మాట్ రెన్షాలను అవుట్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. హర్షిత్ రాణా బులెట్స్ లాంటి బంతులు ఇన్నింగ్స్ రన్ రేట్‌ను నియంత్రించింది, నలుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లను అవుట్ చేశాడు. కెప్టెన్ మిచ్ మార్ష్‌ను 41 పరుగులకు అవుట్ చేయడం ద్వారా అక్షర్ పటేల్ భారత్‌కు కీలకమైన వికెట్ అందించాడు. కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ కూడా ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.
మిచ్ మార్ష్, ట్రావిస్ హెడ్ జంట కేవలం తొమ్మిది ఓవర్లలో 57 పరుగులు చేసింది. అయితే, ఆస్ట్రేలియా 61 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత నుంచి ఆస్ట్రేలియా వికెట్లు పడిపోతూనే ఉన్నాయి, ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో మూడోది. ఆస్ట్రేలియా 2-0తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. భారత్ ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది, కానీ టీమ్ ఇండియా దానిని విజయంతో ముగించాలని చూస్తోంది.