Hardik Pandya Tattoo: వాలెంటైన్స్ డే సందర్భంగా టాటూ.. ప్రియురాలికి హార్ధిక్ పాండ్యా మరిచిపోలేని జ్ఞాపకం
Valentines Day 2026: వాలెంటైన్స్ డే సందర్భంగా హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహికా శర్మకు ఒక ప్రత్యేక బహుమతిని ఇచ్చాడు. తన మెడపై M అనే అక్షరాన్ని టాటూగా వేయించుకున్నాడు.

కొలంబో: ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో హైవోల్టేజ్ ఉన్నప్పటికీ భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మకు ఈ వాలెంటైన్స్ డేని మరింత ప్రత్యేకంగా మార్చారు. తన గర్ల్‌ఫ్రెండ్ పేరులోని మొదటి అక్షరం ‘M’ని తన మెడ వెనుక భాగంలో పాండ్యా టాటూ వేయించుకున్నాడు. ఈ టాటూను 'Aliens Tattoo'లో సెలబ్రిటీ టాటూ ఆర్టిస్ట్ సన్నీ భానుశాలి, లీడ్ ఆర్టిస్ట్ తుషార్ మరానే రూపొందించారు. హార్దిక్ ఎం అక్షరంతో కొత్త టాటూ మహికా శర్మపై తన ప్రేమను వ్యక్తం చేస్తోంది. ఈ వాలెంటైన్స్ డే ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
టీమ్ సమాచారం ప్రకారం, హార్దిక్ పాండ్యా మొదట మహికా కోసం కేవలం ఒక చిన్న టాటూ వేయించుకోవాలని అనుకున్నాడు. కానీ వారు తమ రిలేషన్, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ ఐడియా పెద్దదిగా మారింది. చివరికి వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా మారింది. టాటూలో మీరు గమనిస్తే.. 2 చిరుతపులులు (Leopards) ఉన్నాయి. మొదటి చిరుతపులి చాలా పవర్‌ఫుల్, నేచురల్‌గా కనిపిస్తుంది. ఇది హార్దిక్ పాండ్యా బలాన్ని, శ్రమను సూచిస్తుంది. రెండో చిరుతపులి లైన్ ఆర్ట్‌లో రూపొందించారు. ఇది మొదటి చిరుత చుట్టూ తిరుగుతున్నట్లు ఉంటుంది. తన గాళ్‌ఫ్రెండ్ మహికా పేరులోని మొదటి అక్షరం ‘M’ స్పష్టంగా కనిపిస్తుంది.
టాటూ వెనుక కథ వివరించిన సన్నీ భానుశాలి
హార్దిక్ మొదట కేవలం మహికా పేరులోని మొదటి అక్షరాన్ని మాత్రమే టాటూ వేయించుకోవాలని భావించాడని సన్నీ భానుశాలి తెలిపారు. కానీ మాట్లాడుతున్న సమయంలో వారి బంధంలోని ఒక స్పెషల్ స్టోరీ బయటకు వచ్చింది. వారు ఒకరికొకరు బలాన్ని అందించే పార్ట్‌నర్స్ కావాలని భావించారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అర్థవంతంగా చూపించడానికి చిరుతపులి (Leopard) టాటూ సరైన చిహ్నంగా మారింది.
View this post on Instagram
ఈ టాటూ కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదు. కొన్ని టాటూలు కేవలం అడిగితే, లేక ఎవరైనా సూచిస్తే వేసుకుంటారు. కానీ కొన్ని వాటంతట అవే రూపుదిద్దుకుంటాయి. హార్దిక్ ఈ టాటూ నమ్మకంతో పాటు భావోద్వేగంతో తయారైంది. టాటూ ఏదైనా రియల్ స్టోరీని ప్రతిబింబించినప్పుడు, అది కేవలం రంగుగా మాత్రం మిగిలిపోదు. వారికి, ప్రియమైన వ్యక్తికి అది ఒక జ్ఞాపకంగా మారుతుంది.
హార్దిక్- మహికా రిలేషన్..
హార్దిక్ పాండ్యా గత ఏడాది 2025లో మహికా శర్మతో తన రిలేషన్ పై స్పందించాడు. ప్రస్తుతం వీరు ప్రేమలో మునిగి తేలుతున్నారు. గతంలో హార్దిక్ పాండ్యా విదేశీ మోడల్, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ మే 2020లో ఇంట్లోనే సాధారణంగా వివాహం చేసుకోగా, ఫిబ్రవరి 2023లో రాజస్థాన్‌లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఏడాదిన్నరలోనే కథ ముగిసింది. అభిప్రాయభేదాలు రావడంతో జూలై 2024లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరికి కుమారుడు అగస్త్య ఉండగా.. బాలుడి బాధ్యతలను ఇద్దరూ చూసుకుంటున్నారు.





















