Fastest century: T20 ప్రపంచ కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే.. రైనా స్థానం ఎంతంటే..
Fastest century in T20 World Cup | టీ20 ప్రపంచ కప్ లో శ్రీలంక ఓపెనర్ పతుమ్ నిస్సాంక ఆస్ట్రేలియాపై 52 బంతుల్లో సెంచరీ చేసి జట్టును గెలిపించాడు.

T20 ప్రపంచ కప్ 2026లో తొలి సెంచరీ శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక చేశాడు. ఆస్ట్రేలియాతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో నిస్సాంక కేవలం 52 బంతుల్లోనే 100 పరుగులు చేసి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ బలమైన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ వల్ల శ్రీలంక 18 ఓవర్లలోనే 182 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించింది.
నిస్సాంక ఇన్నింగ్స్ T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలలో ఒకటిగా నిలిచింది. ఇంతకు ముందు కూడా టీ20 ప్రపంచ కప్‌లో చాలా మంది బ్యాట్స్ మెన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడుతూ సెంచరీలు సాధించి తమ జట్లకు విజయాలు అందించారు.
అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు
T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డు వెస్టిండీస్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అతనడు 2016 లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. గేల్ ఆ మ్యాచ్ లో 48 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి.
T20 ప్రపంచ కప్ లో మొదటి సెంచరీ వీరుడు
2007లో జరిగిన మొదటి T20 ప్రపంచ కప్ లో క్రిస్ గేల్ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 50 బంతుల్లో సెంచరీ చేశాడు. గేల్ ఆ మ్యాచ్ లో 117 పరుగులు చేసి T20 ప్రపంచ కప్ చరిత్రలో తొలి సెంచరీ సాధించిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు.
బ్రెండన్ మెక్కల్లమ్ కూడా సత్తా
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ 2012లో జరిగిన T20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో 51 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో 123 రన్స్ చేసి కివీస్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ఆటగాళ్లు ఫాస్టెస్ట్ సెంచరీలు
పాకిస్తాన్ కు చెందిన బ్యాటర్ అహ్మద్ షెహజాద్ 2014 లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 58 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన బ్యాట్స్ మన్ రోలీ రూసో కూడా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 59 బంతుల్లో సెంచరీ సాధించాడు.
భారత మాజీ బ్యాటర్ సురేష్ రైనా 2010 లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 59 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
T20 ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే..
క్రిస్ గేల్, వెస్టిండీస్ - 47 బంతులు vs ఇంగ్లాండ్ (2016, ముంబై)
క్రిస్ గేల్, వెస్టిండీస్ - 50 బంతులు vs దక్షిణాఫ్రికా (2007, జోహన్నెస్ బర్గ్)
బ్రెండన్ మెకల్లమ్, న్యూజిలాండ్ - 51 బంతులు vs బంగ్లాదేశ్ (2012, పల్లెకెలే)
పతుమ్ నిస్సాంక, శ్రీలంక - 52 బంతులు vs ఆస్ట్రేలియా (2026, పల్లెకెలే)
అహ్మద్ షెహజాద్, పాకిస్తాన్ - 58 బంతులు vs బంగ్లాదేశ్ (2014, మీర్ పూర్)
రైలీ రూసో, దక్షిణాఫ్రికా - 52 బంతులు vs బంగ్లాదేశ్ (2022, సిడ్నీ)
సురేష్ రైనా, భారత్ - 59 బంతులు vs దక్షిణాఫ్రికా (2010, గ్రోస్ ఐలెట్)





















