Suryakumar Yadav:
ఇండియన్ క్రికెట్లో ఆధునిక షాట్లు ఆడటంలో సూర్య కుమార్ యాదవ్‌ను మించిన బ్యాటర్ లేనేలేడు! చిత్ర విచిత్రమైన పోజుల్లో అతడు బ్యాటింగ్ చేస్తుంటాడు. ప్రత్యర్థి బౌలర్ ఆఫ్‌సైడ్ ఎక్కడో బంతి వేసినా జరిగి మరీ లెగ్‌సైడ్ సిక్సర్ బాదేయగలడు. అందుకే అతడిని ముద్దుగా టీమ్‌ఇండియా 'మిస్టర్ 360'గా పిలుచుకుంటారు.
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దొరికిన విరామాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబయిలో గల్లీ క్రికెట్ ఆడాడు. అభిమానుల డిమాండ్ మేరకు 'సుప్లా' షాట్ సైతం ఆడేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.
ముంబయి ఇండియన్స్ వన్ ఫ్యామిలీ అనే ట్విటర్ హ్యాండిల్‌లో సూర్య కుమార్ సుప్లా షాట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశారు. 'ముంబయిలో గల్లీ క్రికెట్ ఆడుతున్న సూర్యా భాయ్' అని కామెంట్ పెట్టారు. ఇందుకు మిస్టర్ 360 సైతం స్పందించాడు. 'నా సోదరుల డిమాండ్ మేరకు సుప్లా షాట్ ఆడాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు వందల సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. సోమవారానికే 1200 లైకులు, 22,000 వ్యూస్ లభించాయి.
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రెండేళ్లకు సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపికయ్యాడు. టీ20ల్లో అతడి ప్రతాపం తెలిసిందే. 2022 ఏడాదిలోనే 1000కి పైగా పరుగులు సాధించాడు. దాంతో టెస్టు జట్టులోకి వచ్చేశాడు. నాగ్‌పుర్‌లో జరిగిన తొలి టెస్టులో అరంగేట్రం చేశాడు. అయితే అంచనాల మేరకు రాణించలేదు. కేవలం 8 పరుగులకే ఔటయ్యాడు. అయితే 30 ఏళ్ల తర్వాత మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించడం గమనార్హం.
విరామం దొరికినప్పుడల్లా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన సతీమణితో కలిసి ఆలయాలు సందర్శిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడిని దర్శించి పూజలు చేశాడు. ఈ మధ్యే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించి ఆశీర్వాదాలు పొందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో సూర్యకుమార్ ఆట కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పట్లాగే మెరుపులు మెరిపించాలని ఆశిస్తున్నారు. వచ్చే సీజన్లో ముంబయి ఇండియన్స్ తన తొలి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతున్న సంగతి తెలిసిందే.
IPL 2023లో ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ల షెడ్యూల్
2 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎన్. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
8 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, వాంఖడే స్టేడియం ముంబై
11 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ
16 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs కోల్కతా నైట్ రైడర్స్, వాంఖడే స్టేడియం, ముంబై
18 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
22 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్, వాంఖడే స్టేడియం, ముంబై
25 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
30 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్, వాంఖడే స్టేడియం, ముంబై
3 మే 2023 - ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్, PCA స్టేడియం, మొహాలి
6 మే 2023 - ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
9 మే 2023 - ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వాంఖడే స్టేడియం, ముంబై
12 మే 2023 - ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్, వాంఖడే స్టేడియం, ముంబై
16 మే 2023 - ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జాయింట్స్, ఎకానా స్టేడియం, లక్నో
21 మే 2023 - ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, వాంఖడే స్టేడియం, ముంబై