రాబోయే సిరీస్ ల కోసం టీమ్స్ ను ఎంపిక చేయడానికి, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లకు, ఆసియా గేమ్స్ కు, అలాగే శ్రీలంక టూర్ కు ఇండియా ఏ టీమ్ స్క్వాడ్స్ ను ఖరారు చేయడానికి BCCI సమావేశం అవుతుంది.
India T20I & Asian Games Squads: టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్ ఎంపికకు బీసీసీఐ ముహూర్తం: అందరి ఫోకస్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
బిజీ షెడ్యూల్ కోసం నాలుగు వేర్వేరు టీమ్స్ ను ఎంపిక చేయడానికి శనివారం ముంబైలోని బీసీసీఐ హెడ్‌క్వార్టర్స్ లో సెలెక్షన్ కమిటీ మీటింగ్ జరగనుంది.

- బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రేపు ముఖ్య జట్ల ఎంపిక.
- ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లు, ఆసియా గేమ్స్‌కు జట్లు.
- శ్రేయస్ అయ్యర్ టీ20 కెప్టెన్సీకి అవకాశాలు అధికం.
- యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు.
BCCI Selection Committee Meeting To Pick India T20I And Asian Games : రాబోయే సిరీస్ ల కోసం టీమ్స్ ను అనౌన్స్ చేయడానికి BCCI రెడీ అయింది. శనివారం ముంబైలోని హెడ్‌క్వార్టర్స్ లో మెన్స్ సెలెక్షన్ కమిటీ మీటింగ్ జరగనుందని బోర్డు ప్రెస్ రిలీజ్ లో తెలిపింది. ఈ మీటింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 1 గంటకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొని వివరాలు వెల్లడిస్తారు. ఐర్లాండ్ తో జూన్ లో జరిగే రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్, జూలైలో ఇంగ్లాండ్ తో జరిగే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ తో పాటు జపాన్ లో జరగబోయే ఆసియా గేమ్స్ 2026, శ్రీలంక టూర్ కు వెళ్లే ఇండియా ఏ టీమ్ స్క్వాడ్స్ ను ఈ మీటింగ్ లో ఫైనల్ చేస్తారు. ಜపాన్ లోని ఐచీ ప్రిఫెక్చర్ లో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఆసియా గేమ్స్ క్రికెట్ మ్యాచ్ లు టీ20 ఫార్మాట్ లో జరగనున్నాయి.
లీడర్ గా శ్రేయస్ అయ్యర్ కు ఛాన్స్!
సెలెక్షన్ కమిటీ మీటింగ్ లో అందరి ఫోకస్ టీ20 కెప్టెన్సీ మార్పుపైనే ఉంది. సోర్సెస్ ప్రకారం సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్ గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సూర్యకుమార్ కెప్టెన్ గా సక్సెస్ అయినప్పటికీ రీసెంట్ గా బ్యాటింగ్ లో ఫెయిల్ అవ్వడం అతడికి మైనస్ గా మారింది. అదే టైమ్ లో శ్రేయస్ అయ్యర్ అటు బ్యాటర్ గా, ఇటు కెప్టెన్ గా ఐపీఎల్ లో ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సాలిడ్ ట్రాక్ రికార్డ్ వల్లే సూర్యను తప్పించి శ్రేయస్ కు లీడర్ షిప్ ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.
వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ..?
ఈ స్క్వాడ్స్ అనౌన్స్‌మెంట్ లో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పేరు హాట్ టాపిక్ గా మారింది. తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ యంగ్ ప్లేయర్ కు ఇండియా టీమ్ లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2026 లో ఏకంగా 776 రన్స్ స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ అసాధారణమైన ఫామ్ తో నేషనల్ టీమ్ డెబ్యూ కోసం వైభవ్ స్ట్రాంగ్ కేస్ బిల్డ్ చేశాడు. ఆసియా గేమ్స్ లేదా ఐర్లాండ్ టూర్ కు అతడిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
లంక టూర్ కోసం ఇండియా ఏ టీమ్ ఎంపిక..
వీటితో పాటు శ్రీలంకలో జరగబోయే రెండు మల్టీ డే మ్యాచ్ ల కోసం ఇండియా ఏ టీమ్ ను కూడా సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. డొమెస్టిక్ క్రికెట్ లో రాణించిన యంగ్ ప్లేయర్స్ కు ఈ టూర్ లో ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీనిపై చీఫ్ సెలెక్టర్ క్లారిటీ ఇస్తాడు. నాలుగు వేర్వేరు టూర్ల కోసం ఒకే రోజు టీమ్స్ ను ఎంపిక చేస్తుండటంతో క్రికెట్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Frequently Asked Questions
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఎందుకు సమావేశం కానుంది?
టీ20 కెప్టెన్సీలో మార్పులుంటాయని వార్తలు వస్తున్నాయి, దాని గురించి చెప్పండి?
సోర్సెస్ ప్రకారం, సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కొత్త టీ20 కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ లో శ్రేయస్ అటు బ్యాటర్ గా, ఇటు కెప్టెన్ గా మంచి ప్రదర్శన కనబరిచాడు.
వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకత ఏమిటి?
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో 776 రన్స్ స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అతని అసాధారణమైన ఫామ్ కారణంగా, ఆసియా గేమ్స్ లేదా ఐర్లాండ్ టూర్ కు ఇండియా టీమ్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.
ట్రెండింగ్ వార్తలు



















