BCCI Reveals Reason Behind Skipping Presentation Ceremony: మహిళల ఆసియా కప్ 2026 విజేతగా నిలిచినప్పటికీ ట్రోఫీ ప్రదానోత్సవానికి దూరంగా ఉండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా పూర్తి వివరాలను వెల్లడించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్పును బహూకరిస్తే భారత మహిళల జట్టు ఆ వేడుకకు హాజరుకాదని తాము ముందే స్పష్టంగా తెలియజేశామని పేర్కొన్నారు. తాజాగా దీనిపై మాట్లాడిన సైకియా, "మేము ఏసీసీతో సంప్రదింపులు జరిపాం. పురుషుల క్రికెట్ జట్టు విషయంలో జరిగిన పద్ధతిలోనే ట్రోఫీ ప్రదానం కొనసాగితే మేము హాజరుకాబోమని ఏసీసీ చైర్మన్‌కు నేను వ్యక్తిగతంగా ముందే సమాచారం ఇచ్చాను. వారు తమ మొండి వైఖరిని మార్చుకోకపోవడంతో మాకు వేరే మార్గం లేకుండా పోయింది. ఈ వేడుకకు దూరంగా ఉండటం ద్వారా పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు మేం ఘనమైన నివాళి అర్పించాం" అని వివరించారు.

Continues below advertisement

Read Also: Samson Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టడం వ్యూహాత్మక తప్పిదమా..? సంజూ శాంసన్ ఫెయిల్యూర్‌తో మొదలైన రగడ!! 

సాంప్రదాయాలు పాటించని నఖ్వీ.. ప్రత్యామ్నాయ ప్రతిపాదన తిరస్కరణగతంలో ఉన్న సంప్రదాయాలను మొహ్సిన్ నఖ్వీ కాలరాస్తున్నాడని సైకియా ఆరోపించారు. "ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గతంలో ఏసీసీలో ఉన్నప్పుడు, విజేతగా నిలిచిన జట్టుకు చెందిన ఆఫీస్ బేరర్ ట్రోఫీని అందజేయడం ఆనవాయితీగా ఉండేది. కానీ గతేడాది నుంచి ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. మేము ఏసీసీకి ఒక మంచి ప్రత్యామ్నాయాన్ని కూడా సూచించాం. ఏసీసీ ప్రెసిడెంట్ లేదా డిప్యూటీ చైర్మన్ ఖలీద్ సాహెబ్‌తోనైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరాం. ఒకవేళ ఖలీద్ సాహెబ్ ట్రోఫీని ఇచ్చి ఉంటే మా జట్టు కచ్చితంగా వేదికపైకి వచ్చేది. పహల్గామ్ ఘటన తర్వాత ఏ దేశంతో అయితే మనకు స్నేహపూర్వక సంబంధాలు లేవో, ఆ దేశ అంతర్గత మంత్రిగా ఉన్న వ్యక్తి చేతుల నుంచి ట్రోఫీని అందుకోకూడదనేది మా దృఢమైన వైఖరి. మా ప్రతిపాదనను వారు అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని తెలిపారు.

Continues below advertisement

Read Also: Trophy Celebrations Viral Video: పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు

త్వరలోనే ఇండియాకు రెండు ట్రోఫీలు.. అభిమానులకు భరోసాట్రోఫీ వివాదంపై భారత అభిమానులకు సైకియా పూర్తి భరోసా ఇచ్చారు. దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉండిపోయిన పురుషుల ఆసియా కప్, ఇప్పుడు మహిళల ఆసియా కప్ రెండూ అతి త్వరలోనే మన దేశానికి చేరుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. మహిళల జట్టు 2025లో తొలిసారి 50 ఓవర్ల వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో బలమైన జట్టును నిర్మిస్తున్నామని, రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా క్రీడలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఆసియా క్రీడల్లో స్వర్ణమే లక్ష్యం.. బోర్డు బలమైన సంకల్పంరాబోయే ఆసియా క్రీడలు 2026లో పురుషుల, మహిళల విభాగాల్లో స్వర్ణ పతకాలను గెలవడమే లక్ష్యంగా తాము వ్యూహాలను రచిస్తున్నామని, అంతర్జాతీయ వేదికలపై భారత జట్లు అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తాయని బోర్డు వ‌ర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి.