అన్వేషించండి

Baroda Cricket Team: బరోడా బీస్ట్ మోడ్.. టీ20ల్లో వరల్డ్ రికార్డు స్కోరు

World Record In T20 cricket ; దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా పరుగుల వరద పారించింది. సిక్కింతో జరిగిన మ్యాచ్ లో 349/5 చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసింది. 

Baroda Cricket Team VS Sikkim In T20 cricket news: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ లో బరోడా జట్టు రికార్డు బద్దలు కొట్టింది. సిక్కింతో గురువారం జరిగిన మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. దీంతో జింబాబ్వే జట్టు గతంలో కెన్యాలోని నైరోబీలో జాంబియాపై నమోదు చేసిన 344/4 స్కోరు కనుమరుగైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సిక్కిం ఓవర్లనీ ఆడి ఏడు వికెట్లు 86 పరుగులు చేసి 263 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

సిక్సర్లతో పంజా..
పసికూన అయిన సిక్కింపై బరోడా దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఆది నుంచి ఎడాపెడా సిక్సర్లు బాదింది. దీంతో ఒక ఇన్నింగ్సలో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 37 సిక్సర్లు బాదిన బరోడా బ్యాటర్లు.. జింబాబ్వే పేరిటే ఉన్న అత్యధిక సిక్సర్ల (27) రికార్డును బద్దలు కొట్టారు. 

Also Read: ఈ ఏడాది కూడా టెన్నిస్‌దే రూలింగ్- సంపాదన అంతా వాళ్ళదే

పానియా విధ్వంసక సెంచరీ..
ఈ మయాచ్ లో భానూ పానియా విధ్వంసక సెంచరీ (51 బంతుల్లో 134)తో సత్తాచా టాడు. 262.75 స్ట్రైక్ రేటుతో తను పరుగులు సాధించాడు. వైట్ బాల్ క్రికెట్లో ఇప్పటివరకు 39 ఇన్నింగ్స్ ఆడిన పానియాకు.. ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ చేసినా పానియా.. 15 సిక్సర్లు, 5 ఫోర్లతో శివాలెత్తాడు. 

అంతకుముందు ఓపెనర్లు శశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజపుత్ భారీ ఇన్నింగ్స్ కు పునాది వేశారు. వాళ్లిద్దరి భాగస్వామ్యంలో 19 బంతుల్లోనే బరోడా స్కోరు ఆఫ్ సెంచరీ దాటింది. ఓవరాల్ గా తొలి వికెట్ కు వీరిద్దరూ 92 పరుగులు జోడించారు..

శివాలిక్, విష్ణు శివతాండవం..
మిడిలార్డర్ లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ శివాలిక్ శర్మ, విష్ణు సోలంకి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. 17 బంతుల్లోనే 55 పరుగులు శివాలిక్ చేయగా.. 16 బంతుల్లోనే 50 పరుగుల మార్కును విష్ణు అందుకున్నాడు. 17వ ఓవర్లో విష్ణు అవుటయ్యాక తర్వాత బ్యాటర్లు కూడా రెచ్చిపోవడంతో బరోడా భారీ స్కోరు సాధించింది. టీమిండియా విధ్వంసక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో ఆడనప్పటికీ బరోడా ఇంత భారీ స్కోరు చేయడం విశేషం. పరుగుల నియంత్రణ కోసం ఏడుగురు బౌలర్లను ప్రయోగించిన సిక్కింకి ఏది కలిసి రాలేదు. నలుగురు బౌలర్లు 20కి పైగా ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నారు. 

సిక్కిం టపాటపా..
స్కోరు బోర్డుపై శిఖరం లాంటి స్కోరును చూసి సిక్కిం బ్యాటర్లు బేజారయ్యారు. ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా వాళ్లు ఆడలేదు. దీంతో 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 86 పరుగులకు మాత్రమే పరిమితమై 263 రన్స్ తో ఓడిపోయారు. ఆ జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే 15 పరుగుల మార్కును చేరుకున్నారు. ఇక బరోడా బౌలర్లలో క్రునాల్ పాండ్య, నినాద్ రత్వా మహేశ్ పిథియా కలిసి సిక్కిం పతానాన్ని శాసించారు. సగం జట్టును వీరే పెవిలియన్ కి పంపించారు. ఇక 263 పరుగుల విజయం.. టీ20 చరిత్రలో నాలుగో అత్యధిక విజయం (పరుగుల పరంగా) కావడం విశేషం. మొత్తం ఈ సీజన్ లో సత్తా చాటుతున్న బరోడా.. టోర్నీలోనూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికి ఆడిన ఏడు గేమ్ ల్లో ఆరింటిలో విజయం సాధించడం విశేషం. 

Also Read: తగ్గేదే లే..!! సిక్సర్లతో హోరెత్తించిన 13 ఏళ్ల IPL చిచ్చరపిడుగు సూర్యవంశీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Pawan On Bangladesh: బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Pawan On Bangladesh: బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
Sr NTR @ 75 Years: ఎన్టీఆర్ తొలి సినిమా ‘మన దేశం’కు 75 ఏళ్లు... సంచలన నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ నిర్మాతలు
ఎన్టీఆర్ తొలి సినిమా ‘మన దేశం’కు 75 ఏళ్లు... సంచలన నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ నిర్మాతలు
Kanguva OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూర్య 'కంగువ' - స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూర్య 'కంగువ' - స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Embed widget