Australian Club Cricket: క్రికెట్‌లో ఎవరైనా బౌలర్‌ హ్యాట్రిక్‌ తీస్తేనే అబ్బురపడతాం. వరుసగా నాలుగు వికెట్లు తీసిన లసిత్‌ మలింగను చూసి ఆశ్చర్యపోయాం. కానీ ఒక బౌలర్‌.. ఒకే ఓవరల్‌ ఆరు వికెట్లు తీస్తే అమ్మో అనుకుంటున్నారా.. కానీ ఆస్ట్రేలియా  క్లబ్‌ క్రికెట్‌లో ఈ అరుదైన రికార్డు నమోదైంది. గోల్డ్‌కోస్ట్‌ ప్రీమియర్‌ లీగ్‌ డివిజన్‌–3 పోటీల్లో ఒక బౌలర్‌ ఓవర్‌లోని ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొటి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇక ఓటమి ఖాయం అనుకున్న సమయంలో ఆ బౌలర్‌ ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు పడగొట్టి జట్టును నమ్మశక్యం కాని విజయాన్ని అందించాడు.


 చివరి ఓవర్లో విజయానికి అయిదు పరుగులు కావాలి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేసే జట్టు సునాయసంగా విజయం సాధిస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ అలా జరిగితే అది క్రికెట్‌ ఎందుకవుతుంది. అదే ఇక్కడా జరిగింది. అప్పుడే బౌలర్‌ అద్భుతం చేశాడు. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఈ సంచలనంతో 4 పరుగుల తేడాతో బౌలింగ్‌ చేసే జట్టు చరిత్ర నమ్మలేని విజయాన్ని నమోదు చేసింది. గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్ 3 పోటీల్లో ఈ అద్భుతం జరిగింది. ఈ అద్భుతాన్ని బ్యాటింగ్ చేసే జట్టు నమ్మలేకపోయింది. గారెత్‌ వేసిన చివరి ఓవర్‌లో ఔటైన వారిలో మొదటి నలుగురు బ్యాటర్లు మాత్రం క్యాచ్‌ ఔట్‌ కాగా.. మిగతా ఇద్దరు క్లీన్‌బౌల్డ్ అయ్యారు. 


సర్ఫర్స్ ప్యారడైజ్‌ జట్టుపై ముద్గీరాబా నెరంగ్ అండ్‌ డిస్ట్రిక్ట్స్ టీమ్‌ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. 40 ఓవర్లలో 178 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్‌ జట్టు 39 ఓవర్లకు 174/4 స్కోరుతో నిలిచింది. ఆరు బంతుల్లో ఐదు పరుగులు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ముద్గీరాబా నెరంగ్ కెప్టెన్ గారెత్‌ మోర్గాన్ రంగంలోకి దిగాడు. చివరి ఓవర్‌లో బాల్ పట్టి ఒక్క పరుగూ ఇవ్వకుండా ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి ఎవరూ ఊహించనివిధంగా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ దెబ్బతో సర్ఫర్స్ ప్యారడైజ్‌ జట్టు ఆలౌట్‌ కాగా.. ముద్గీరాబా నెరంగ్ జట్టు నాలుగు రన్స్‌ తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో ఔటైన వారిలో మొదటి నలుగురు బ్యాటర్లు మాత్రం క్యాచ్‌ ఔట్‌ కాగా.. మిగతా ఇద్దరు క్లీన్‌బౌల్డ్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో గారెత్ ఏడు ఓవర్లు వేసి 7/16 గణాంకాలు నమోదు చేశాడు. ఈ క్రమంలో ప్రొఫెషనల్‌ క్రికెట్లో ఒక ఓవర్లో అయిదు వికెట్లు తీసిన అభిమన్యు మిథున్‌ (భారత్‌, 2019), వాగ్నర్‌ (న్యూజిలాండ్‌, 2011), అమీన్‌ (బంగ్లాదేశ్‌, 2013)లను గారెత్‌ అధిగమించాడు. 


2011లో వెల్లింగ్టన్‌పై ఒటాగో తరఫున న్యూజిలాండ్‌కు చెందిన నీల్ వాగ్నర్, 2013లో అభానీ లిమిటెడ్‌పై యూసీబీ- బీసీబీ XI తరఫున బంగ్లాదేశ్ అల్ అమీన్ హోస్సేన్ ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీశారు. మరోవైపు భారత్‌ విషయానికొస్తే.. కర్ణాటక తరఫున 2019లో అభిమన్యు మిథున్‌ అనే ప్లేయర్ హరియాణా జట్టుపై ఈ ఘనత సాధించాడు.