BCCI In Talks Over Extending Ajit Agarkar Contract: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం కొనసాగింపుపై రాబోయే 48 గంటల్లో స్పష్టత రానుంది. 2023 జూలై 4న చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో టీమ్ ఇండియా 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం, రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలకడం కూడా ఇతడి హయాంలోనే జరిగాయి. నిజానికి అగార్కర్ కాంట్రాక్ట్ 2026 జూన్‌తోనే ముగియాల్సి ఉన్నప్పటికీ, బీసీసీఐ అతడికి మూడు నెలల పొడిగింపు ఇచ్చింది. అక్టోబర్ 4తో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో, మరో ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగించే అంశంపై వచ్చే రెండు రోజుల్లో బీసీసీఐ కీలక భేటీ నిర్వహించనుంది.

Continues below advertisement

Read Also: Asia Cup 2026 Trophy Row Erupts: ఛాంపియన్‌గా నిలిచినా వేదికపైకి రాని భారత్.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ నిరాకరణ, ఆసియా కప్‌లో మరోసారి వివాదం

బోర్డుతో కోల్డ్ వార్.. కీలక రివ్యూ మీటింగ్‌కు అగార్కర్ డుమ్మాగత రెండు నెలలుగా బీసీసీఐ పెద్దలు, సెలెక్షన్ కమిటీ మధ్య అంతర్గతంగా విభేదాలు నడుస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 3న జరిగిన బోర్డు పెర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్‌కు అగార్కర్ హాజరుకాకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అయితే కాంట్రాక్ట్ పొడిగింపుపై ఇరు వర్గాలు సానుకూలంగానే ఉన్నాయని, మిగిలి ఉన్న కొన్ని చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నాయని సమాచారం. ప్రస్తుతం అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వెస్టిండీస్ సిరీస్ కోసం నిర్వహించే సెలెక్షన్ మీటింగే అతడికి చివరిది అయ్యే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం.

Continues below advertisement

Read Also: Asia Cup Winner Team India: తిరుగులేని టీమిండియా.. లంక‌ను చిత్తు చేసి, ఎనిమిదోసారి ఆసియాక‌ప్ కైవ‌సం.. స‌త్తా చాటిన షెఫాలీ, స్మృతి, శ్రీచ‌ర‌ణి, దీప్తి 

వెస్టిండీస్ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్.. రాహుల్‌కు కీలక బాధ్యతసెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో స్వదేశంలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు తొలి వన్డేను తిరువనంతపురంలో ఆడనుంది. తర్వాతి రెండు మ్యాచ్‌లు గువహాటి (సెప్టెంబర్ 30), ముల్లన్‌పూర్ (అక్టోబర్ 3) వేదికలుగా జరుగుతాయి. అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20 ముగిసిన మరుసటి రోజైన సెప్టెంబర్ 16న ఈ సిరీస్‌తో పాటు ఇరానీ కప్ కోసం భారత జట్లను ప్రకటించనున్నారు.

సెలెక్షన్ భేటీపై దృష్టి.. తుది నిర్ణయానికి రంగం సిద్ధంఈ నెల 16న జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశానికి అజిత్ అగార్కర్ హాజరుకానున్నాడు. విండీస్ సిరీస్ జట్టును ఎంపిక చేయడంతో పాటు, అతడి కాంట్రాక్ట్ భవితవ్యంపై బీసీసీఐ తీసుకోబోయే నిర్ణయంపై క్రీడా వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఒకవేళ అగార్కర్ కు ఉద్వాసన పలికితే, తర్వాత ఎవరు అతని పగ్గాలు చేపట్టనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.