Ind vs Pak: టీ20 వరల్డ్ కప్‌లో Abhishek sharma పేరు మీద చెత్త రికార్డు..
Abhishek Sharma Stats vs Pakistan: 2026 T20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ డకౌట్ అయ్యాడు. దాంతో అతడి పేరిట ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది.

India vs pakistan T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మ పేరు మీద ఒక చెత్త రికార్డు నమోదైంది. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కనీసం ఖాతా తెరవలేకపోయాడు. తన మొదటి రెండు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుట్ అయిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ చేరాడు. తన మొదటి రెండు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఖాతా తెరవలేకపోయిన ప్రపంచంలో మూడవ, రెండవ భారత క్రికెటర్‌గా అభిషేక్ నిలిచాడు .
తన మొదటి రెండు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఒక్క పరుగు సైతం చేయని ప్రపంచంలో మూడవ బ్యాటర్ అభిషేక్ శర్మ. ఆయన కంటే ముందు భారత్‌కు చెందిన ఆశిష్ నెహ్రా, బంగ్లాదేశ్‌కు చెందిన ఇమ్రుల్ కయేస్ విషయంలో ఇలా జరిగింది. ఆశిష్ నెహ్రా, ఇమ్రుల్ కయేస్ తమ టీ20 వరల్డ్ కప్ కెరీర్‌లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. ఇప్పటివరకు అభిషేక్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఇటీవల అమెరికాతో జరిగిన మ్యాచులో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
Most Golden Ducks in T20 World Cup BY INDIAN (min 2+ Golden Ducks)!
— CricTalks (@TheCricTalk_) February 15, 2026
2: Abhishek Sharma (2 inns)
2: Shivam Dubey (10 inns)
2: Ravindra Jadeja (14 inns)
2: Gautam Gambhir (20 inns)
2: Virat Kohli (33 inns)#AbhishekSharma #T20WorldCup#INDvsPAK #T20WorldCup2026 #INDvPak pic.twitter.com/GfpBUgoLuo
అభిషేక్ శర్మ తన మొదటి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను అమెరికా (USA)తో ఆడాడు. అందులో ఎదుర్కొన్న మొదటి బంతికే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. అనంతరం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టులోకి వచ్చినప్పటికీ, ఇక్కడ 4 బంతులు ఎదుర్కొని సున్నా పరుగులకే మళ్లీ అవుట్ అయ్యాడు. దాంతో టీ20 వరల్డ్ కప్‌లో డాషింగ్ ఓపెనర్ ఫెయిల్యూర్ పరంపర కొనసాగుతోంది.
అభిషేక్ శర్మ వర్సెస్ పాకిస్థాన్
పాకిస్థాన్‌తో ఆడిన మొదటి 2 టీ20 మ్యాచ్‌లలో అభిషేక్ 52.50 అద్భుతమైన సగటుతో 105 పరుగులు చేశాడు. కానీ ఇప్పుడు 4 ఇన్నింగ్స్‌ల తర్వాత పాక్ జట్టుపై అతడి ఖాతాలో 110 పరుగులు ఉన్నాయి. పాకిస్థాన్‌పై సగటు ఇప్పుడు 27.5కి పడిపోయింది. గత 5 టీ20 ఇన్నింగ్స్‌లలో అభిషేక్ శర్మ కేవలం 98 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మూడుసార్లు ఖాతా తెరవకుండానే (డక్ అవుట్) వెనుదిరిగాడు.
టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన సూర్య సేన
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ జట్టును చిత్తు చేసిన సూర్యకుమార్ సేన, ఈ టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. అదే సమయంలో, ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని పాకిస్థాన్‌కు భారత్ తొలి పరాభవాన్ని రుచి చూపించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్, ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) మెరుపు ఇన్నింగ్స్ తో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 18 ఓవర్లలోనే కేవలం 114 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. కీపర్ ఉస్మాన్ ఖాన్ చేసిన 44 పరుగులే పాక్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు. ఆ జట్టులో సగానికి పైగా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. చివర్లో షాహీన్ అఫ్రిదీ (23 నాటౌట్) కాసేపు పోరాడినా, అది కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే సరిపోయింది. ఈ విజయంతో భారత అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.





















