అన్వేషించండి

Abhishek Sharma : టీ20 ప్రపంచ కప్‌లో టీం ఇండియాకు బిగ్‌షాక్! పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు అభిషేక్ శర్మ దూరం? 

Abhishek Sharma : అభిషేక్ శర్మకు సంబంధించి హెల్త్ అప్‌డేట్‌పై సూర్యకుమార్ యాదవ్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడకపోవచ్చని చెప్పాడు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Abhishek Sharma : T20 ప్రపంచ కప్ 2026 భారత్ తన రెండో మ్యాచ్ ఆడుతోంది. మొదటి మ్యాచ్‌లో అమెరికాపై విజయం సాధించింది. ఇప్పుడు రెండో మ్యాచ్ నమీబియాతో తలపడుతోంది. మొదటి మ్యాచ్‌లో తొలి బంతికే అవుట్ అయిన అభిషేక్ శర్మ ఆరోగ్యం ఇప్పుడు టీమిండియాను టెన్షన్ పెడుతోంది. అభిషేక్ కడుపు సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. 

ఇప్పుడు, నమీబియాతో జరిగే రెండో మ్యాచ్ కోసం అభిషేక్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కలేదు. మ్యాచ్‌కు ముందు టాస్ సందర్భంగా, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చాడు. సూర్య అప్‌డేట్ అభిమానులకు నిజంగా షాక్‌కి గురి చేసింది. పాకిస్తాన్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు అభిషేక్ కూడా దూరంగా ఉండవచ్చని అతను చెప్పడం ఆందోళనకలిగిస్తోంది.  

సూర్యకుమార్ యాదవ్ ఏమన్నారు?

టాస్ తర్వాత అభిషేక్ ఆరోగ్యం గురించి అడిగిన ప్రశ్నకు సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, "అభిషేక్ ఇంకా బాగా లేదు. అతను ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరమవుతాడు" అని అన్నారు.

సూర్య ప్రకటన స్పష్టంగా అర్థం ఏమిటంటే, నమీబియా తర్వాత, పాకిస్తాన్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు కూడా అభిషేక్ దూరమవవచ్చు. భారత్‌, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15 ఆదివారం శ్రీలంకలోని కొలంబోలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు అభిషేక్ తిరిగి వస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. టోర్నమెంట్‌లో భారత్‌ ప్రధాన ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ. అతని స్థానంలో ఓపెనింగ్ వస్తున్న సంజూ శాంసన్ ఫామ్‌లో లేడు. ఆయన ధాటిగా ఆడటానికి పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. 

అయితే, అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ విఫలమయ్యాడు. ఖాతా తెరవకుండానే మొదటి బంతికే ఔటయ్యాడు. అయినప్పటికీ, పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ ఉండటం టీమ్ ఇండియాకు పెద్ద ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ సూర్య చెప్పినదే నిజమైతే కచ్చితంగా భారత్‌కు మానసికంగా దెబ్బ తగిలినట్టే. 

2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై అభిషేక్ విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు పాకిస్తాన్‌పైనే కాకుండా ఆ వరల్డ్‌కప్‌ మొత్తంలో  అభిషేక్ ధాటిగా ఆడటం భారత్‌కు చాలా అవసరం.  

Frequently Asked Questions

అభిషేక్ శర్మ ఆరోగ్య పరిస్థితి ఏమిటి?

అభిషేక్ శర్మ కడుపు సమస్యతో బాధపడుతున్నాడు. అతను ఆసుపత్రిలో చేరారు మరియు ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.

నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ ఎందుకు ఆడలేదు?

అభిషేక్ శర్మ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల నమీబియాతో జరిగే రెండో మ్యాచ్‌లో అతనికి ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కలేదు.

పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కి అభిషేక్ అందుబాటులో ఉంటాడా?

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకారం, అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరమవుతాడు. కాబట్టి, పాకిస్థాన్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉండకపోవచ్చు.

అభిషేక్ స్థానంలో ఆడుతున్న సంజూ శాంసన్ ఫామ్ ఎలా ఉంది?

అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ విఫలమయ్యాడు. అతని స్థానంలో ఓపెనింగ్ చేస్తున్న సంజూ శాంసన్ కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs England Semifinals: వర్షం వల్ల సెమీఫైనల్ రద్దయితే టీమిండియా ఎలిమినేట్ అవుతుందా? ICC రూల్స్ ఇవే
వర్షం వల్ల సెమీఫైనల్ రద్దయితే టీమిండియా ఎలిమినేట్ అవుతుందా? ICC రూల్స్ ఇవే
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
Pakistan Cricket Board: T20 ప్రపంచ కప్ 2026లో ఎగ్జిట్ అయిన పాకిస్తాన్ ప్లేయర్లకు షాక్! ఆటగాళ్లకు ఫైన్ వేసిన పీసీబీ!
T20 ప్రపంచ కప్ 2026లో ఎగ్జిట్ అయిన పాకిస్తాన్ ప్లేయర్లకు షాక్! ఆటగాళ్లకు ఫైన్ వేసిన పీసీబీ!
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget