Rains In Hyderabad: భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్మి ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. కర్మన్ ఘాట్, చంపాపేట్, ఎల్బీనగర్, మూసాపేట, కూకట్పల్లి, మాధాపూర్, ఎల్బీనగర్, మియాపూర్, దిల్ షుఖ్ నగర్, చంపాపేట్, నాగోల్ లో వర్షం కురుస్తోంది. అలాగే చైతన్యపురి,సైదాబాద్, సంతోష్ నగర్, మలక్ పేట్ పరిసర ప్రాంతాల్లోనూ వాన పడుతోంది. అలాగే, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, ఫిలింనగర్, మణికొండ, షేక్ పేట్, గచ్చిబౌలి,  కూకట్పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, కుత్బుల్లాపూర్‌, చింతల్, షాపూర్ నగర్, గాజులరామారాం, సూరారం, బాచుపల్లి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. జీహెచ్ఎంసీ - డీఆర్ఎఫ్ సహాయం కోసం 040 - 21111111 కు లేదా 9000113667కు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. హైదరాబాద్ లో రాబోయే 2 గంటలు, రాత్రి వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.






ఉప్పల్ మ్యాచ్ జరిగేనా.?


నగరంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గురువారం నాటి ఉప్పల్ మ్యాచ్ కు వాన గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.  ఉప్పల్ లోనూ మబ్బులు కమ్మేయడంతో మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, గురువారం రాత్రి 7 గంటలకు ఉప్పల్  స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, మ్యాచ్ రద్దైనా హైదరాబాద్ కు పెద్ద నష్టం ఏమీ ఉండదు. అయితే, ఒకవేళ మ్యాచ్ జరిగి గెలిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా నాకౌట్ కు వెళ్లిపోతుంది. కాగా, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యింది. కాగా, ఉప్పల్ లో మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్ బుక్ చేసుకున్న అభిమానులు నిరాశ చెందుతున్నారు.