Ashmita Claims Maiden Korea Title:  ఇండియన్ షట్లర్ అశ్మిత చాలిహా తన బ్యాడ్మింటన్ కేరియర్ లో గోల్డెన్ పేజీని లిఖించింది. కొరియా మాస్టర్స్ సూపర్ 300 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లో చైనాకు చెందిన హాన్ క్వాన్‌జీపై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్ విక్టరీ సాధించి ఫస్ట్ బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ ను సొంతం చేసుకుంది. గువాహాటికి చెందిన 26 ఏళ్ల అశ్మిత ఫస్ట్ సెట్ లో వెనుకబడినా, 53 నిమిషాల పాటు సాగిన ఫైనల్ లో 14-21, 21-14, 21-14 స్కోర్‌తో అద్భుత పోరాటపటాలీ ప్రదర్శించి చైనా ప్లేయర్ ను చిత్తు చేసింది.

Continues below advertisement

Continues below advertisement

ఫస్ట్ గేమ్‌లో స్లో స్టార్ట్.. సెకండ్ గేమ్‌లో సంచలన రీ-ఎంట్రీఫస్ట్ గేమ్‌లో అశ్మిత తన రిథమ్ కంటిన్యూ చేయడంలో ఇబ్బంది పడటంతో చైనా షట్లర్ హాన్ 21-14 తో గేమ్‌ను కైవసం చేసుకుంది. దాంతో అశ్మితపై ప్రెజర్ పెరిగింది. అయితే సెకండ్ గేమ్‌లో అశ్మిత అటాకింగ్ గేమ్ తో విరుచుకుపడింది. అటాకింగ్ షాట్లతో చైనా ప్లేయర్ ని డిఫెన్స్ లో పడేసి 21-14 తో సెకండ్ గేమ్ గెలిచి మ్యాచ్ ను డిసైడర్ గేమ్‌కి తీసుకెళ్లింది.

డిసైడర్ గేమ్‌లో నరాలతెగే ఉత్కంఠ.. అశ్మిత అగ్రెసివ్ గేమ్ఫైనల్ గేమ్‌లో ఉత్కంఠ పీక్స్‌కి చేరింది. ఒకానొక స్టేజ్ లో 9-11 తో వెనుకబడినప్పటికీ అశ్మిత ఏమాత్రం కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వలేదు. క్రూషియల్ పాయింట్లు సాధిస్తూ అగ్రెసివ్ అప్రోచ్‌తో 21-14 తో గేమ్‌ను ముగించి తన కేరియర్‌లోనే బిగ్గెస్ట్ టైటిల్‌ను ముద్దాడింది.

ఇంజ్యూరీ బ్రేక్ తర్వాత సంచలనం.. ఐదో ఇండియన్ ఉమెన్ గా రికార్డుఈ ఇయర్ ఆరంభంలో కుడి మోకాలికి మెనిస్కస్ టియర్ గాయం కావడం వల్ల అశ్మిత మూడు నెలల పాటు ఆటకు దూరమైంది. ఇంజ్యూరీ నుంచి కోలుకుని రీ-ఎంట్రీ ఇచ్చాక ఈ బిగ్ టైటిల్ సాధించడం విశేషం. కొరియా మాస్టర్స్ విక్టరీతో బిడబ్ల్యూఎఫ్ సూపర్‌ 300 లేదా అంతకంటే ఎక్కువ లెవెల్ టైటిల్ గెలిచిన ఐదో ఇండియన్ ఉమెన్ షట్లర్ గా అశ్మిత రికార్డు సృష్టించింది. సైనా నెహ్వాల్, పివి సింధు, దేవికా సిహాగ్, తన్వి శర్మల సరసన అశ్మిత చేరింది.  తాజా విజయంతో బ్యాడ్మింటన్ రంగంలో తనదైన ముద్ర వేసిన అశ్మిత.. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖారలకు చేరుకుంటుందని భారత బ్యాడ్మింటన్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.