వింబుల్డన్‌కు ఈ సంవత్సరం కొత్త విజేత వచ్చాడు. లెజెండరీ ప్లేయర్ నోవాక్ జకోవిచ్‌తో జరిగిన ఫైనల్లో స్పెయిన్‌కు కార్లోస్ అల్కరాజ్ ఐదు సెట్ల పాటు పోరాడి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 1-6, 7-6(8/6), 6-1, 3-6, 6-4తో ప్రపంచ రెండో ర్యాంకర్ జొకోవిచ్‌ను ఓడించాడు. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ పరాభవానికి జకోవిచ్‌పై అల్కరాజ్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది.
రెండు నెలల క్రితం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్‌ను నోవాక్ జకోవిచ్ ఓడించాడు. ఆ తర్వాత ఫైనల్లో కూడా పాల్ రడ్‌పై విజయం సాధించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
వింబుల్డన్ ఫైనల్‌లో వరల్డ్ నంబర్ వన్ అల్కరాజ్, నంబర్ టూ నోవాక్ జకోవిచ్‌ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. తొలి సెట్‌ను అద్భుతంగా ప్రారంభించిన జకోవిచ్ 6-1తో అల్కరాజ్‌పై విజయం సాధించాడు. రెండో సెట్‌లో అల్కరాజ్ బలంగా కమ్‌బ్యాక్ ఇచ్చాడు.
కార్లోస్ అల్కరాజ్ రెండో సెట్‌లో 7-6తో జకోవిచ్‌ను ఓడించాడు. మూడో సెట్‌లో జకోవిచ్ చాలా అలసిపోయినట్లు కనిపించాడు. దీన్ని అల్కరాజ్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ సెట్‌ను 6-1 తేడాతో గెలుచుకున్నాడు.
కానీ జకోవిచ్ నాలుగో సెట్‌లో ఎక్సలెంట్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. 6-3తో ఈ సెట్‌ను జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. అయితే మ్యాచ్‌ను డిసైడ్ చేసే ఐదో సెట్‌లో అల్కరాజ్ పుంజుకున్నాడు. 6-4తో సెట్‌తో పాటు, మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇది అల్కరాజ్‌కు రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2022లో యూఎస్ ఓపెన్‌ను కూడా అల్కరాజ్ గెలుచుకున్నాడు. అదే అతని కెరీర్‌లో మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్.