ఫరీద్‌కోట్‌కు చెందిన సిఫత్ కౌర్ సమ్రా ఆసియా క్రీడల్లో పంజాబ్‌కే కాకుండా యావత్ దేశానికే కీర్తిని తెచ్చిపెట్టింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఇండివిడ్యువల్ ఇవెంట్‌లో సిఫత్ కౌర్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకం గెల్చుకుంది. టీమ్ విభాగంలో రజతం సాధించింది. 469.6 స్కోరుతో ప్రపంచ రికార్డు నమోదు చేసి దేశానికి బంగారు పతకం అందించింది 22 ఏళ్ల సిఫత్ కౌర్ సమ్రా. దీంతో భారత్ కు ఇప్పటిదాకా స్వర్థ పతకాల సంఖ్య ఐదుకు చేరింది.
పంజాబ్ మంత్రి అభినందనలు
ఆమె స్వర్ణం సాధించడం పట్ల పంజాబ్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ అభినందనలు తెలిపారు. ఫరీద్‌కోట్‌కు చెందిన సిఫత్ కౌర్ సమ్రా ఈరోజు ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం, రజత పతకాన్ని సాధించడం మన పంజాబ్‌కు గర్వకారణమని మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
స్కీట్ మెన్స్ టీమ్ విభాగంలో భారత జట్టుకు బ్రాంజ్
భారత పురుష షూటర్ల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించింది. గుర్జోత్, అనంత్‌జీత్, అంగాడ్విర్ స్కీట్ మెన్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో భారత మహిళా షూటర్ ఆషీ చోక్సీ బ్రాంజ్ సాధించింది.
బంగారు పతకాలు వీరికే
25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు మనూ బాకర్, రిథం సంగ్వాన్, ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో మరో పసిడి చేరింది. దీంతో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరింది. ప్రస్తుతం నాలుగు బంగారు పతకాలు, ఐదు వెండి, ఏడు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.