Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ పతకాల జోరు కనబరుస్తోంది. 100 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్.. ఆ వైపు రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఆర్చరీ విభాగంలో భారత క్రీడాకారులు స్వర్ణం సాధించారు. ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లో జ్యోతి వెన్నమ్, ఓజాస్ డియోటాలే ఫైనల్ లో 159-158 తో కొరియా జోడీని ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. 


35 కిలోమీటర్ల వాక్ రేస్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లో మంజు రాణి, రామ్ బాబు కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. హాంకాంగ్ జట్టును ఓడించి కాంస్యాన్ని సాధించారు. 


11వ రోజు అనగా అక్టోబర్ 4వ తేదీన భారత్ ఆశలు పెట్టుకున్న బల్లెం వీరుడు నీరజ్ చోప్రా స్వర్ణం కోసం పోటీ పడనున్నాడు. జావెలిన్ త్రో వరల్డ్, ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా నుంచి అందరూ స్వర్ణం ఆశిస్తున్నారు. దీంతో పాటు 3 వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లో స్వర్ణం సాధించిన అవినాష్ సాబ్లే కూడా బరిలోకి దిగనున్నాడు. ఇప్పుడు 5000 మీటర్ల పోటీలో పాల్గొననున్నాడు. దీంతో పాటు పీవీ సింధు కూడా పోటీ పడనుంది. లోవ్లినా బాక్సింగ్ లో బంగారు పతకం కోసం పోటీ పడనుంది. 


సౌరవ్ ఘోషల్ తన 8వ ఆసియా క్రీడల పతకాన్ని సాధించడానికి పురుషుల సింగిల్స్ స్క్వాష్ లో ఫైనల్ చేరుకోవడానికి పోటీ పడనున్నాడు. ఇప్పటికే కాంస్యం ఖాయమైన విషయం తెలిసిందే.


ఆసియ క్రీడల్లో 11వ రోజు(అక్టోబర్ 4) భారత్ షెడ్యూల్:


4.30am: రేస్ వాక్ మిక్స్‌డ్ టీమ్ - మంజురాణి, రామ్ బాబూ
4.30pm: పురుషుల హైజంప్ ఫైనల్ - సందేశ్ జెస్సీ, సర్వేష్ కుషారే
4.35pm: పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ - నీరజ్ చోప్రా, కిషోర్ కుమార్ జెనా
4.40pm: మహిళల ట్రిపుల్ జంప్ ఫైనల్ - షీనా నెల్లికల్ వర్కీ
4.55pm: మహిళల 800 మీటర్ల ఫైనల్ - హర్మిలన్ బైన్స్, కేఎం చందా
5.10pm: పురుషుల 5000 మీటర్ల ఫైనల్ - అవినాష్ సాబుల్, గుల్వీర్ సింగ్
5.45pm: మహిళల 4x400 మీటర్ల ఫైనల్ 
6.05pm: పురుషుల 4x400 మీటర్ల ఫైనల్ 


కబడ్డీ
6.00am: పురుషుల టీమ్ గ్రూప్ A మ్యాచ్ - భారత్ vs థాయ్‌లాండ్
1.30pm: మహిళల టీమ్ గ్రూప్ A మ్యాచ్ - భారత్ vs థాయ్‌లాండ్


ఆర్చరీ
6.10am: కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్ - భారత్ vs మలేషియా
11.50am:రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్


గుర్రపు స్వారీ
6.30am: జంపింగ్ ఇండివిజువల్, టీమ్ క్వాలిఫైయర్ రౌండ్ 1
12.30pm: జంపింగ్ ఇండివిజువల్ క్వాలిఫైయర్ రౌండ్ 2, టీమ్ ఫైనల్ రౌండ్


బ్రిడ్జ్
6.30am: పురుషుల టీమ్ సెమీ ఫైనల్ సెషన్ 4, 5, 6


రెజ్లింగ్
7.30am: పురుషుల గ్రీకో రోమన్ 67 కేజీ 1/8 ఫైనల్
7.30am: పురుషుల గ్రీకో రోమన్ 87 కేజీ 1/8 ఫైనల్ 
7.30am: పురుషుల గ్రీకో రోమన్ 60 కేజీ 1/8 ఫైనల్
7.30am: పురుషుల గ్రీకో రోమన్ 77 కేజీ 1/4 ఫైనల్


బ్యాడ్మింటన్
7.30am: మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16
7.50am: పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16
8.10am: మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16
8.30am: మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16
9.10am: పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్
10.10am: పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16
10.30am: మహిళ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16


వాలీబాల్
8.00am: మహిళల క్లాసిఫికేషన్ పూల్ G 


స్పోర్ట్ క్లైంబింగ్
9.05am: మహిళల స్పీడ్ రిలే క్వాలిఫికేషన్


స్క్వాష్
9:30am: మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్
10:30am: మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్
3:30pm: పురుషుల సింగిల్స్ సెమీఫైనల్


డైవింగ్
10:30am: పురుషుల 10మీ ప్లాట్‌ఫారమ్ ప్రిలిమినరీ - 


బాక్సింగ్
11:30am: మహిళల 57 కేజీల సెమీఫైనల్ 


1:15pm: మహిళల 75 కేజీల ఫైనల్ 


చదరంగం
12:30pm: పురుషులు, మహిళల టీమ్ రౌండ్ 6


హాకీ
1:30pm: పురుషుల సెమీఫైనల్ - భారతదేశం vs దక్షిణ కొరియా