Trolling On KL Rahul: నిన్న హాంకాంగ్ తో మ్యాచ్ పూర్తైన దగ్గర నుంచి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ చేసే ట్రోల్ ఒకటే. అవన్నీ ఒకరి గురించే. అదేంటంటే.... ఆరెంజ్ క్యాప్ ఉందని చెప్తే తప్ప ఆడవా అన్నా అని అంటూ. నిజమే.... హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ చాలా డిజప్పాయింట్ చేసింది. ఆ పర్ఫార్మెన్స్ కు ఆరెంజ్ క్యాప్ కు ఏంటి లింక్ అనుకుంటున్నారా...


ఐపీఎల్ సీజన్ లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ కు ఇచ్చేది ఆరెంజ్ క్యాప్. గత నాలుగేళ్లల్లో ప్రతి సీజన్ లోనూ రాహుల్ మంచి ఫాం కనబరుస్తూ ప్రతిసారీ ఈ క్యాప్ కోసం టాప్ కంటెండర్ గా నిలిచాడు. 2020 లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు కూడా. సో ఆ కాంటెక్స్ట్ లో ఆరెంజ్ క్యాప్ ఉందని చెప్తే తప్ప ఇండియాకు సరిగ్గా ఆడవా అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.


అసలు కొన్ని నెలలుగా.... టీమిండియా జపిస్తున్న మంత్రం ఏంటి...? ఇంటెంట్, అటాకింగ్, అగ్రెసివ్ క్రికెట్. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో.... వీలైనంత స్వేచ్ఛగా ఆడుతూ అపోజిషన్ పై ప్రెషర్ పెట్టాలన్నది టీమిండియా సిద్ధాంతం. ఇన్నాళ్లూ అదే ఫాలో అవుతూ వచ్చింది. కానీ నిన్న మ్యాచ్ లో రాహుల్ చేసింది... దానికి కంప్లీట్ అపోజిట్. పిచ్ కాస్త ట్రిక్కీగా, టూ పేస్డ్ నేచర్ తో ఉంది. కాదనలేం. కానీ.... మరీ 39 బంతులు ఆడి కేవలం 36 పరుగులే చేసే అంత టఫ్ పిచ్ కూడా కాదు. అందుకే రాహుల్ మీద విమర్శలు వస్తున్నాయి.


సాధారణంగా స్లోగా స్టార్ట్ చేస్తే ఆఖరి ఓవర్లలో స్ట్రైక్ రేట్ కవర్ చేయాలన్నది టీం టాక్టిగ్‌గా ఉంటుంది. కానీ నిన్న రాహుల్ విషయంలో అలా జరగలేదు. ఎక్కువ బాల్స్ ఆడేశాడు. చివర్లో దాన్ని కవర్ కూడా చేయలేకపోయాడు. నిజానికి నిన్న రాహుల్ బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పుకోవాలంటే అసలు కాన్ఫిడెన్స్ లేనట్టే కనిపించాడు. టీంలో పర్మినెంట్ ప్లేస్ కోసమో లేక ఫాం అందుకోవడం కోసమో ఆడుతున్నట్టు కనిపించాడు. దానికి కారణం కూడా లేకపోలేదు.


గత కొన్నాళ్లుగా గాయం వల్లనో, ఇతర కారణాల వల్లనో రాహుల్ కన్సిస్టెంట్ గా క్రికెట్ ఆడిందే లేదు. ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చాడు కాబట్టి.... తన ప్లేస్ గురించి ఆలోచిస్తూ ఎక్కువ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. మన టీం టాప్ ఆర్డర్ చూస్తే రోహిత్, రాహుల్, కోహ్లీ.... ముగ్గురూ ఫుల్ ఫ్లెడ్జ్ డ్ అటాకింగ్ బ్యాటర్స్ కాదు. కాస్త టైం తీసుకుని కుదురుకున్న తర్వాత జోరు పెంచే రకం.


ఇప్పుడు రాహుల్ ఇంత దారుణంగా ఆడుతుండటంతో.... మరో 2 నెలల్లో జరగబోయే వరల్డ్ కప్ ముందు టీమిండియాపై ప్రెషర్ పెంచుతున్నట్టు అవుతోంది. ఏషియా కప్ తర్వాత ఇండియా.... ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సిరీసులు ఆడుతోంది. ఇంకో 3-4 మ్యాచెస్ రాహుల్ ఇలానే ఆట కొనసాగిస్తే.... అతని స్థానంలో రిషబ్ పంత్ ఓపెనింగ్ కు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అలా చేస్తే రోహిత్ తో కలిసి లెఫ్ట్-రైట్ కాంబినేషన్ వర్కవుట్ అవడమే కాక.... ఓపెనింగ్ లో పంత్ లాంటి అటాకర్ ఉండటం టీంకు చాలా బెనిఫిట్ అవుతుంది. రాహుల్... ఇకనైనా ఇన్ సెక్యూర్డ్ గా కాకుండా.... ఫ్రీగా ఆడాల్సిన అవసరముంది. లేకపోతే ఏషియా కప్ తర్వాత జట్టులో చోటు కూడా కోల్పోతాడని విశ్లేషకులు అంటున్నారు.