Ajaya Babu Wins Silver In CWG 2026:  ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో తండ్రి మెడల్ సాధించిన 16 ఏళ్ల తర్వాత, వల్లూరి అజయ్ బాబు గ్లాస్గో వేదికగా సోమవారం నైట్ జరిగిన మెన్స్ 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ లో డ్రామాటిక్ సిల్వర్ మెడల్ గెలుచుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లోని కొండవెలగాడ విలేజ్ కి చెందిన 21 ఏళ్ల అజయ్ బాబు టోటల్ గా 330 కేజీలు (149 కేజీల స్నాచ్ + 181 కేజీల క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి జస్ట్ 1 కేజీ తేడాతో గోల్డ్ మెడల్ మిస్ అయ్యాడు. మలేషియాకి చెందిన ఎర్రీ హిదాయత్ ముహమ్మద్ గోల్డ్ గెలవగా, ఇంగ్లాండ్ కి చెందిన క్రిస్ ముర్రే బ్రాంజ్ మెడల్ సాధించాడు. అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 2010 ఢిల్లీ గేమ్స్ లో 56 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలుచుకోగా, కొడుకు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి సిల్వర్ మెడల్ సాధించాడు.

Continues below advertisement

Continues below advertisement

మైండ్ బ్లోయింగ్ ఫైనల్ మ్యాచ్.. నిమిషాల్లో మారిన కామన్వెల్త్ రికార్డ్స్ఫైనల్ మ్యాచ్ లో స్నాచ్ విభాగంలో అజయ్ బాబు 145 కేజీలు ఈజీగా లిఫ్ట్ చేసి, నెక్స్ట్ అటెంప్ట్ లో 149 కేజీలు ఎత్తి నయా కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్ లో మలేషియా అథ్లెట్ ముహమ్మద్ 181 కేజీలు ఎత్తగా, అజయ్ బాబు కూడా 181 కేజీలు ఎత్తి 330 కేజీల టోటల్ తో గేమ్స్ రికార్డ్ రీ-క్రియేట్ చేశాడు. అయితే ముహమ్మద్ తన లాస్ట్ అటెంప్ట్ లో 184 కేజీలు లిఫ్ట్ చేసి 331 కేజీల టోటల్ తో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2025 అహ్మదాబాద్ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ లో 335 కేజీలు ఎత్తి గోల్డ్ గెలిచిన అజయ్ బాబు, తన సక్సెస్ గ్రాఫ్ ను గ్లాస్గో లోనూ కంటిన్యూ చేశాడు.

ఒకే రోజు 6 మెడల్స్ తుఫాన్.. రికార్డుల వేటలో ఇండియా స్టార్స్సోమవారం  సింగిల్ డే లోనే ఇండియా అథ్లెట్లు ఏకంగా 6 మెడల్స్ సాధించి సూపర్ పర్ఫార్మన్స్ చూపించారు. ఉమెన్స్ షాట్‌పుట్ F57 ఫైనల్ లో షర్మిలా ధంకర్ పారా అథ్లెటిక్స్ లో ఇండియాకు హిస్టారిక్ ఫస్ట్ గోల్డ్ మెడల్ అందించింది. వెయిట్‌లిఫ్టింగ్ లో జ్ఞానేశ్వరి యాదవ్, వల్లూరి అజయ్ బాబులతో పాటు మెన్స్ హైజంప్ లో సర్వేష్ కుషారే సిల్వర్ మెడల్స్ సాధించగా, బైండియారాణి దేవి, శిల్పా షైలా బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. దీంతో ఇండియా ఓవర్‌ఆల్ మెడల్స్ టాలీ 10 కి చేరింది.

మీరాబాయి చాను హ్యాట్రిక్ గోల్డ్ మ్యాజిక్.. వెయిట్‌లిఫ్టింగ్ లో 6 మెడల్స్ ధమాకాఇండియా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఉమెన్స్ 48 కేజీల కేటగిరీలో టోటల్ 190 కేజీలు (85 కేజీల స్నాచ్ + 105 కేజీల క్లీన్ అండ్ జెర్క్) లిఫ్ట్ చేసి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పటివరకు గ్లాస్గో గేమ్స్ లో ఇండియాకి వెయిట్‌లిఫ్టింగ్ విభాగం నుంచి 6 మెడల్స్ రావడం విశేషం.

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో ఇండియా మెడల్ విన్నర్స్ కంప్లీట్ లిస్ట్గోల్డ్ మెడల్స్:

మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్ ఉమెన్స్ 48 కేజీలు) - 190 కేజీల టోటల్ తో గేమ్స్ రికార్డ్.

షర్మిలా ధంకర్ (పారా అథ్లెటిక్స్ ఉమెన్స్ షాట్‌పుట్ F57) - హిస్టారిక్ ఫస్ట్ గోల్డ్.

సిల్వర్ మెడల్స్:

చానంబమ్ రిషికాంత సింగ్ (వెయిట్‌లిఫ్టింగ్ మెన్స్ 60 కేజీలు) - స్నాచ్ లో 121 కేజీల గేమ్స్ రికార్డ్.

ముత్తుపాండి రాజా (వెయిట్‌లిఫ్టింగ్ మెన్స్ 65 కేజీలు) - 286 కేజీల టోటల్ లిఫ్ట్.

జ్ఞానేశ్వరి యాదవ్ (వెయిట్‌లిఫ్టింగ్ ఉమెన్స్ 53 కేజీలు) - 199 కేజీల టోటల్ తో సిల్వర్.

వల్లూరి అజయ్ బాబు (వెయిట్‌లిఫ్టింగ్ మెన్స్ 79 కేజీలు) - 330 కేజీల టోటల్ తో సిల్వర్.

సర్వేష్ కుషారే (అథ్లెటిక్స్ మెన్స్ హైజంప్) - మెన్స్ హైజంప్ లో ఫస్ట్ సిల్వర్ మెడల్.

బ్రాంజ్ మెడల్స్:

ఝాండు కుమార్ (పారా పవర్ లిఫ్టింగ్ మెన్స్ హెవీవైట్) - 190 కేజీల లిఫ్ట్ తో ఫస్ట్ మెడల్.

బైండియారాణి దేవి (వెయిట్‌లిఫ్టింగ్ ఉమెన్స్ 58 కేజీలు) - 199 కేజీల టోటల్ లిఫ్ట్.

శిల్పా షైలా (పారా అథ్లెటిక్స్ ఉమెన్స్ షాట్‌పుట్ F57) - ఇండియన్ అపీల్ తర్వాత దక్కిన బ్రాంజ్ మెడల్.