Yamuna pushkaralu 2026: ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఓసారి పుష్కరాలొస్తాయ్. ఈ ఏడాది (2026)లో యమునా నదికి పుష్కరాలు జరుగనున్నాయి
గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు యమునానదికి పుష్కరాలొస్తాయ్..
పుష్కర తేదీలు ప్రారంభం - 2026 జూన్ 2 మంగళవారం..ఈ రోజుని ఆది పుష్కరాలు అంటారు..మొదటి రోజు స్నానమాచరిస్తే అత్యంత పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం
2026 జూన్ 13 శుక్రవారం పుష్కరాలు ముగింపు.. ఈ రోజు అంత్య పుష్కరాలు అంటారు..మొదటి రోజు స్నానం ఎంత పుణ్యఫలమో అంత్య పుష్కరాల్లో స్నానం ఆచరించడం కూడా అంతే పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం
జూన్ 2 నుంచి జూన్ 13 వరకూ మొత్తం 12 రోజులు యమునా నదికి పుష్కరాలు జరుగుతాయి జూన్ 1 సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట 30 నిముషాలకు యమునా నదిలో పుష్కరుడు ప్రవేశిస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం జూన్ 2 నుంచి అరుణోదయం మొదలవుతుంది.
పుష్కర స్నాన ముహూర్తం
పుష్కర స్నానం చేయాలి అనుకుంటే ప్రతి రోజూ బ్రహ్మముహూర్తంలో వేకువజామునే నాలుగున్నర నుంచి 6 గంటల వరకూ స్నానం ఆచరించాలి ఆదిపుష్కరం జూన్ 2న సూర్యోదయానికి ముందే నాలుగున్నర గంటలకు ఘాట్ కి చేరుకోవాలి.. అంత్య పుష్కరం రోజు కూడా ఇదే సమయానికి పుష్క స్నానం ఆచరించాలి తూర్పు లేదా ఉత్తర దిక్కు దిశగా తిరిగి పేరు, గోత్రం చెప్పుకుని మూడుసార్లు మునగాలి.. యమునా అష్టకం, యమునా స్తోత్రం చదవడం అత్యంత పుణ్యఫలం.. ప్రధాన ఘాట్లు వివరాలు
ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ లో పుష్కరాలు జరుగుతాయి..
విశ్రామ్ ఘాట్ , మధుర: శ్రీ కృష్ణుడు, కంసుడిని హతమార్చి విశ్రమించిన స్థలం ఇది కేశీ ఘాట్, బృందావనం: శ్రీ కృష్ణుడు కేశి రాక్షసుడిని చంపిన చోటు..ఇక్కడ సాయంత్రం సమయంలో యమునా ఆరతి కన్నుల పండువగా ఉంటుంది త్రివేణి సంగమం , ప్రయాగ్ రాజ్
గంగా,యమునా, సరస్వతి సంగమ ప్రదేశం అత్యంత శక్తివంతమైన పుష్కర స్నాన ప్రదేశం
డాక్ పత్తర్ ఘాట్, హర్యానా: ఇక్కడ నీరు అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది, వృద్ధులు -కుటుంబాలతో కలసి వెళ్లేవారికి ఇది అనువైన ప్రదేశం యమనోత్రి , ఉత్తరాఖండ్: యమునానది మూలం ఇక్కడే...శారీరకంగా సమర్థులుగా ఉన్నవారు ఇక్కడ ట్రెక్కింగ్ చేసి పుష్కర స్నానం చేయొచ్చు
నిగంబోధ్ ఘాట్, ఢిల్లీ: ఢిల్లీలో సౌకర్యవంతమైన ఘాట్ ఇది..స్థానికులు ఇక్కడ పుష్కర స్నానం చేయొచ్చు
ఇంకా మధురలో బెంగాలీ ఘాట్, ఆగ్రా లో ఘాట్ లలోనూ పుష్కరస్నానం చేయొచ్చు ఆది పుష్కరం, అంత్య పుష్కరం రోజు అత్యంత రద్దీ ఉంటుంది.. అందుకే మధ్యలో తక్కువ రద్దీ ఉన్న సమయంలో పుష్కర స్నానం చేయడం ఉత్తమం. పుష్కర స్నానం, పితృ తర్పణం, పిండ ప్రదానం చేసి..యమునా ఆరతి దర్శించుకోవచ్చు. యుమునా పుష్కరాల కోసం ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్లు, బస్సులు, టూర్ ప్యాకేజీలు అందులుబాటులో ఉన్నాయి. వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి..ముందస్తు ఏర్పాట్లు చేసుకునే పుష్కరాలకు వెళ్లడం మంచిది. హోటల్ రూమ్స్ ముందుగా బుక్ చేసుకోవాలి, వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నందున సౌకర్యవంతంగా ఉన్న దుస్తులు తీసుకెళ్లండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
