అన్వేషించండి

Hindu Mythology : హిందూ పురాణాల్లో ఉగ్రరూపం, శక్తివంతమైన 10 మంది దేవతలు!

కాళీ, భైరవి, దుర్గ, నారసింహుడు సహా హిందూ పురాణాల్లో ఉగ్రరూప దేవతలున్నారు. వీరిరూపం అత్యంత భయంకరంగా ఉంటుంది కానీ దుష్టశిక్షణ, సృష్టి, స్థితి, లయకారులుగా అపారమైన శక్తికి ప్రతీకలు..

Most Powerful Goddess in Hinduism: హిందూ పురాణాల్లో ఉగ్రరూప దేవతలు లేదా అత్యంత భయంకరమైన దేవతలు గురించి తెలుసుకుందాం.. వీరంతా భయంకర రూపాలు ధరించి, దుష్ట శక్తులను, అధర్మాన్ని నాశనం చేస్తారు. వారి రూపాలు భయపెట్టేవే అయినా భక్తులను రక్షించడం, ధర్మ స్థాపన కోసం ఆ రూపాలు ధరించారు. వివిధ పురాణాలు, దేవీ మహత్యం వంటి గ్రంథాల్లో ఉన్న సమాచారం ఆధారంగా ఓ పది మంది ఉగ్రరూప దేవతల గురించి తెలుసుకుందాం..
 
కాళీ

హిందూ పురాణాల్లో అత్యంత భయంకరమైన దేవత కాళీ. నల్లని రంగు, పుర్రెల హారం, కాల స్వరూపం, ఇల్యూజన్ ను నాశనం చేసి పునరుద్ధరణకు దారి చూపుతుంది. భక్తులకు తల్లిలా రక్షణ ఇస్తుంది కాళీ..
 
కాల భైరవ

పరమేశ్వరుడి ఉగ్రరూపం కాలభైరవుడు. కాలానికి అధిపతి శివయ్య. కుక్క వాహనం, చేతిలో కపాలం, ఖడ్గం, బ్రహ్మ ఐదో తలను నరికేసి అహంకారాన్ని నాశనం చేసిన రూపం ఇది. అడ్డంకులు తొలగించి , కర్మ బంధాలనుంచి విముక్తి కలిగించే రూపం. కాలభైరవుడు భయంకరంగా కనిపిస్తాడు కానీ భక్తులకు రక్షకుడు

నారసింహుడు

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నాల్గవ అవతారం నారసింహుడు. ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి హిరణ్యకశిపుడిని సంహరించేందుకు ఈ రూపాన్ని ధరించాడు విష్ణువు. ఉదయం రాత్రి కాని సంధ్యాసమయంలో ఆయుధాలు ఉపయోగించకుండా గోళ్లతో రాక్షస సంహారం చేశాడు. భయంకర గర్జన, రక్తం కారుతున్న నాలుక, ఆ రూపం చూసి దేవతలే వణికిపోయారు.. ప్రహ్లాదుడు శాంతింపచేశాడు. ఈ రూపం ధర్మ రక్షణకు ఉదారహణ.
 
రుద్రుడు

శివుడి ఉగ్రరూపమే రుద్రుడు. ధ్యానంలో ఉండే శివయ్య మూడో కన్ను తెరిస్తే కనిపించే ఉగ్రరూపం ఇది. మూడో కన్ను తెరిచి కామదేవుడిని బూడిద చేశాడు. అజ్ఞానం, కామాన్ని నాశనం చేసి మోక్షాన్ని ప్రసాదించే దేవుడు. ఈ రూపం విధ్వంసం అంటారు కానీ పునర్నిర్మాణం కూడా అని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు.
 
ఛిన్న మస్త

దశ మహావిద్యలలో ఓ రూపం ఛిన్న మస్త. అమ్మవారు స్వయంగా తన తలను తాను కత్తిరించుకుని ఓ చేత్తో  పట్టుకోవడమే కాదు .. రక్తం తాగుతూ భయంకరంగా కనిపిస్తుంది. స్వయం త్యాగం, శక్తి ప్రవహాం, కామం నియంత్రణను సూచిస్తుంది. ఈ రూపం అత్యంత భయంకరంగా ఉంటుంది కానీ భక్తులకు అంతే శక్తిని అందిస్తుంది

ధూమావతి

ఛిన్న మస్త లానే ధూమావతి కూడా దశ మహావిద్యల్లో ఒకరు. ఈమెది వితంతు రూపం..పొగతో నిండిన రూపం ఇది. యుద్దాలు, కరవు, విధ్వంసాన్ని సూచిస్తుంది కానీ జ్ఞానం, వైరాగ్యాన్ని ఇస్తుంది
 
చాముండేశ్వరి

దేవీ మహత్యంలో మహిషాసురుడిని చంపిన ఉగ్రరూపం చాముండేశ్వరి. భయంకరమైన ముఖం, పుర్రెల హారంతో శత్రు సంహారం చేస్తూ దర్శనమిస్తుంది చాముండేశ్వరి. దుర్గాదేవి భయంకరమైన అంశం.. శత్రుసంహారం చేసి భక్తులకు అండగా నిలిచే రూపం ఇది
 
యమ ధర్మరాజు

యమధర్మరాజు...ఈ పేరు వింటేనే భయపడతారు. ఎర్రటి కళ్లు, పదునైన పళ్లు, పాశంతో ఆత్మలను లాగే ఈయన వాహనం ఎద్దు. కర్మల ఆధారంగా తీర్పులు ఇస్తూ న్యాయం, సమతుల్యతను సూచిస్తాడు. రూపం భయాన్ని కలిగిస్తుంది కానీ ధర్మాన్ని ఆచరించడంలో ఈయన తర్వాతే ఎవరైనా..
 
దుర్గా దేవి

శక్తి స్వరూపిణి , చేతుల నిండా ఆయుధాలు ధరించి సింహంపై దర్శనమిచ్చి మహిషాసురిడిని సంహరించే రూపం ఇది. దుష్ట శక్తులపై విజయాన్ని సాధించే  భయంకర రూపం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో పూజలందిస్తారు. నిత్యం దుర్గాదేవిని స్మరించేవారికి కష్టాలు ఉండవని భక్తుల విశ్వాసం
 
వరాహ రూపం

శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఇదొకటి. పంది రూపం.. హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని రక్షించిన రూపం ఇది. భారీ శరీరం, పదునైన దంతాలతో బలం, ధైర్యాన్ని సూచించే రూపం ఇది. ఈ రూపం దేవతలకు కూడా భయంకరంగా కనిపించినా..భక్తులకు మేలు చేయడమే దానివెనుకున్న ఉద్దేశం

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణలో మహిమాన్విత నారసింహ క్షేత్రాలివే!
తెలంగాణలో మహిమాన్విత నారసింహ క్షేత్రాలివే!
Narasimha Swamy Temples In AP : సింహాచలం నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు
సింహాచలం నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు
Simhachalam Chandanotsavam 2026: వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజ రూపం ఎలా ఉంటుందో తెలుసా..చందనోత్సవం ఎందుకు చేస్తారు!
వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజ రూపం ఎలా ఉంటుందో తెలుసా..చందనోత్సవం ఎందుకు చేస్తారు!
Simhachalam Chandanotsavam 2026 : సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం! నిజరూప దర్శన సమయం, టికెట్ల వివరాలు ఇవిగో!
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం! నిజరూప దర్శన సమయం, టికెట్ల వివరాలు ఇవిగో!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Meta Layoffs 2026: మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
IPL 2026: CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్
CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్ Viral Video
US Iran War Updates: హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
Shruti Haasan: ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
Love Failure: అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Suzuki Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
Koratala Siva: దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
Embed widget