Ekalavya Death: ఏకలవ్యుడు.. మహాభారతం మొత్తం చదివినా లేకున్నా...పురాణాలపై ఆసక్తి ఉండేవారు, పౌరాణిక సినిమాలు చూసేవారు ఈ పేరు వినిఉంటారు. చిన్నప్పటి నుంచి ధనుర్విద్యలో ఆసక్తి కలిగిన ఏకలవ్యుడు గురువు ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ పొందాలనుకున్నాడు. కానీ ద్రోణాచార్యుడు తాను రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పిస్తానని చెప్పి నిరాకరించారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా..ద్రోణుడినే గురువుగా భావించి తన విగ్రహం పెట్టుకుని ధనుర్విద్య నేర్చుకున్నాడు. ఏకలవ్యుడి అపారమైన సాధన, ఏకాగ్రత వల్ల అసాధారణమైన ధనుర్విద్యాపారంగుతుడిగా నిలిచాడు. ఓసారి ద్రోణుడు..కౌరవ-పాండులను తీసుకుని అడవికి వెళ్లగా అక్కడ ఓ కుక్కపై ఏకలవ్యుడు ప్రయోగించిన బాణాలను చూసి నివ్వెరపోయారు ద్రోణాచార్యులు. అయితే తనను గురువుగా పెట్టుకుని అభ్యాసం చేసినందుకు గురదక్షిణ సమర్పించాలని కోరారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కుడిచేయి బొటనవేలు తీసి గురుదక్షిణగా సమర్పించాడు ఏకలవ్యుడు. 

Continues below advertisement

 మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుంది..ఎలా వెళ్లాలి..అక్కడ చూసేందుకు ఏమున్నాయ్?

ఈ కథ చాలామందికి తెలుసు...మరి ఆ తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు?

Continues below advertisement

మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడా?

ఏకలవ్యుడు.. పాండవులు - కౌరవులు ఎవరివైపు?

ఏకలవ్యుడు ఎప్పుడు, ఎవరి చేతిలో మరణించాడు?

ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడుంది....

అసలు విషయం ఏంటంటే ఏకలవ్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనలేదు..ఎందుకంటే మహాభారత యుద్ధానికి ముందే ఏకలవ్యుడు మరణించాడు. 

  ద్రోణుడికి తన బొటనవేలు గురుదక్షిణగా ఇచ్చిన తర్వాత కూడా ఏకలవ్యుడు పుట్టుదలతో అభ్యాసం కొనసాగించాడు. ఆ తర్వాత కొంతకాలానికి మగధ రాజ్యాధినేత అయిన జరాసంధుడికి మిత్రుడు అయ్యాడు. జరాసంధుడు శ్రీ కృష్ణుడికి శత్రువు.   యాదవులకు - జరాసంధుడి సైన్యానికి మధ్య జరిగిన యుద్ధంలో ఏకలవ్యుడు జరాసంధుడికి అండగా నిలిచి శ్రీ కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. తన అసాధారణ యుద్ధ నైపుణ్యాన్ని చూసిన శ్రీ కృష్ణుడు భవిష్యత్ లో ధర్మ విరుద్ధంగా పాండవులకు వ్యతిరేకంగా నిలబడతాడని గ్రహించి.. ఏకలవ్యుడిని సంహరించాడు కృష్ణుడు. ఈ సంఘటన ఉద్యోగపర్వం/ ద్రోణపర్వంలో ఉంది

కురుక్షేత్ర యుద్ధం సమయంలో కృష్ణుడు అర్జునుడితో ఓ సందర్భంలో ఇలా చెప్పాడు. ఓ అర్జునా..నీ మేలు కోరి నేను ముందుగానే జరాసంధుడు, శిశుపాలుడు, ఏకలవ్యుడిని అంతం చేశాను. ఏకలవ్యుడు జీవించి ఉంటే కౌరవుల పక్షాన యుద్ధం చేసేవాడు. బొటలవేలు లేకపోయినా యుద్ధంలో ఏకలవ్యుడు అజేయుడిగా నిలిచేవాడు, తనని జయించడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదని చెప్పాడు. అయితే ఏకలవ్యుడి కుమారుడు యుద్ధంలో పాల్గొనకపోయినా తన కుమారుడు కేతుమాన్ కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాటం చేసి భీముడి చేతిలో మరణించాడు. 

ఏకలవ్యుడు విలువిద్యా ప్రదర్శనలో అర్జునుడి కన్నా గొప్పవాడు..యుద్ధ సమయంలో అధర్మం వైపు నిలబడతాడు అనే ఉద్దేశంతోనే శ్రీ కృష్ణుడు యుద్ధానికి ముందే అంతం చేశాడని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు

Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

దేవుళ్ల ఫొటోల్లో ఒళ్లంతా బంగారమే! వాళ్లకు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయ్? మనకు ఎప్పటి నుంచి అలవాటైంది?