అన్వేషించండి

Dhyanalinga : ఇషా యోగ సెంటర్‌లోని ధ్యానలింగానికి అభిషేకం చేసిన పాలు ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Isha Foundation: ఇషా యోగ సెంటర్‌లోని ధ్యానలింగానికి (Dhyanalinga) అభిషేకం చేసిన పాలన్నీ ఏం చేస్తారో తెలుసా? ఇదిగో పూర్తి వివరాలు ఇక్కడున్నాయి..వీడియోతో సహా..

Dhyanalinga :  కోయంబత్తూర్ లో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం సద్గురు జగ్గి వాసుదేవ్ స్థాపించిన ఇషా ఫౌండేషన్. ఈ సెంటర్ లక్షలాది భక్తులు, సాధకులు, పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ధ్యానలింగం - ఇది ఓ ప్రత్యేకమైన శక్తి స్వరూపం. ఇది గ్రానైట్ రాయితో తయారైంది. ఏడు చక్రాల శక్తులను కలిగి ఉండే ధ్యాన సాధన స్థలం ఇది అని నమ్ముతారు భక్తులు. ఇక్కడ ఎలాంటి పూజలు, మంత్రాలు, ప్రత్యేక ఆచారాలు అవసరం లేదు కేవలం నిశ్శబ్ధంగా కూర్చుని ధ్యానం చేయడం ద్వారా మానవుడు తన ఆధ్యాత్మిక స్థాయిని పెంచుకోవచ్చని విశ్వాసం. 

ధ్యానలింగం రూపకల్పనలో శాస్త్రీయత, మిస్టికల్ అంశాలు కలసి ఉన్నాయి. ఇది బ్లాక్ గ్రానైట్ స్టోన్ తో నిర్మించారు. ఇది శక్తిని గ్రహించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ద్వారా ఏడు చక్రాల శక్తులు ఇందులో ఇమిడి ఉంటాయని, అందుకే దీని శక్తి శాశ్వతం అని నమ్మకం. ధ్యానలింగం పోరస్ నేచర్ కలిగి ఉండడం వల్ల అభిషేకం సమయంలో పోసిన ద్రవ్యాలు కొంతభాగం శోషించుకుంటాయి..ఇక మిగిలిన అభిషేక ద్రవ్యాలు సేకరిస్తారు. 

ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో అభిషేకం ప్రక్రియ భక్తులకు ఓ ప్రత్యేక అనుభవం. నెలలో ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ధ్యానలింగంపై భక్తులు నేరుగా అభిషేకం చేసే అవకాశం ఉంటుంది. ఇది పవిత్రమైన ఆచారం. పూర్ణిమ, అమావాస్య అనేవి మనిషి శరీరంలో శక్తి ఉద్దీపనలకు అనుకూలమైనవి. ఈషా సెంటర్లో ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ పాలాభిషేకం చేస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 వరకు జలాభిషేకం చేస్తారు
 
ఈ అభిషేకం సమయంలో భారీగా భక్తులు తరలివచ్చి ధ్యానలింగంపై పాలు పోస్తారు. మరి ఈ పాలన్నీ ఏమవుతాయి? 

ధ్యానలింగంపై అభిషేకం చేసిన పాలన్నీ సేకరిస్తారు. పోరస్ గ్రానైట్ రాయి కాబట్టి కొన్ని పాలు శోషించుకుంటుంది. మిగిలిన పాలు వ్యర్థం కాకుండా సేకరించి ఫిల్టర్ చేస్తారు. ఆ తర్వాత ఈ పాలను పూర్తిగా మరిగించి ప్యూరిఫై చేసి పాయసం తయారు చేస్తారు. అలా తయారైన స్వీట్ ను ట్రక్కుల్లో తీసుకెళ్లి సమీప గ్రామాల్లో ప్రసాదం అని పంచిపెడతారు
 
ఈ విధానం వల్ల భక్తి ఆచారాలను కొనసాగించడమే కాదు..వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం జరుగుతుంది. ఒక్క బొట్టు పాలు కూడా వృధా అవకుండా చూసుకుంటారు. 

ఈ కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూస్తే పాల సేకరణ, శుద్ధి ప్రక్రియ, ప్రసాదం పంపిణి ఎలా జరుగుతుందో చూడొచ్చు


ఇలా చేయడం వల్ల భక్తి ఆచారాలను కొనసాగిస్తూనే వనరులు సమర్థవంతంగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే..పౌర్ణమి, అమావాస్య రోజు భక్తులు ధ్యానలింగం ముందు క్యూ కట్టి పాలు పోస్తారు. ఆ చుట్టూ ఉండే డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా పాలు సేకరిస్తారు. ఫిల్టరింగ్ ప్రక్రియలో భాగంగా ఏదైనా అపరిశుభ్రత ఉంటే తొలగిపోతుంది. ఆ తర్వాత ఈ పాలను హైజీనిక్ పద్దతుల్లో మరిగిస్తారు..దీనివల్ల బ్యాక్టీరియా నాశనం అవుతుంది. ఆ తర్వాత స్వీట్ మేకింగ్ ప్రక్రియలో బెల్ల, చక్కెర వేసి పాయసం తయారు చేస్తారు. ఈ పాయసాన్ని సమీపంలో ఉన్న ట్రైబల్ విలేజెస్ కి తీసుకెళ్లి పంచిపెడతాపరు. దీనివెనుకున్న ఉద్దేశం ఏంటంటే.. సమీపంలో ఉన్న ట్రైబల్ విలేజెస్ లో చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పాయసం రూపంలో ఉన్న పాలను తరచూ అందించడం వల్ల వారికి పోషకాహారం అందించినట్టు అవుతుంది.ఈ విధానం ద్వారా భక్తుల భావోద్వేగాలను గౌరవిస్తూనే సమాజ సేవ చేస్తున్నట్టవుతోంది. 
 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!
Chaitra Navratri 2026 : 72 ఏళ్ల తర్వాత అమావాస్య, ఉగాది, చైత్ర నవరాత్రి ప్రారంభం అన్నీ ఒకే రోజు! శుభ సమయం, నియమాలు తెలుసుకోండి!
72 ఏళ్ల తర్వాత అమావాస్య, ఉగాది, చైత్ర నవరాత్రి ప్రారంభం అన్నీ ఒకే రోజు! శుభ సమయం, నియమాలు తెలుసుకోండి!
Guru Margi 2026: మార్చి 11న ఈ 5 రాశుల అదృష్టం తలుపు తడుతుంది! కెరీర్, సంపదలో భారీ మార్పులు!
మార్చి 11న ఈ 5 రాశుల అదృష్టం తలుపు తడుతుంది! కెరీర్, సంపదలో భారీ మార్పులు!
మార్చి 13 నుంచి 40 రోజులు బలహీనంగా శని! కానీ..ఈ 4 రాశులకు ప్రయోజనం!
మార్చి 13 నుంచి 40 రోజులు బలహీనంగా శని! కానీ..ఈ 4 రాశులకు ప్రయోజనం!
Advertisement

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
Pradeep Ranganathan: టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
US Israel Iran War:
"ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Honda Dio 125 కొనబోతున్నారా? స్టాండర్డ్, X ఎడిషన్, DLX వేరియంట్ల ధరలు, ఫీచర్లు పూర్తి వివరాలు
హోండా డియో 125 స్కూటర్‌ వేరియంట్లు, ధరలు ఇవే - ఏ మోడల్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
సైకిల్ తొక్కుతున్నప్పుడు గొడుగు పట్టుకుంటే ఫైన్ కట్టాల్సిందే ఇక్కడ!
సైకిల్ తొక్కుతున్నప్పుడు గొడుగు పట్టుకుంటే ఫైన్ కట్టాల్సిందే ఇక్కడ!
Embed widget