కోల్‌కతాలోని క్షుద్రశక్తులు, తాంత్రిక పద్ధతులకు ప్రసిద్ధి చెందిన 3 రహస్య ప్రదేశాలు!
Kolkata: పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజతో పాటు, కోల్‌కతాకు తాంత్రిక పద్ధతుల చరిత్ర కూడా ఉంది. కోల్‌కతాలో మూడు ప్రదేశాలు ఉన్నాయని, అక్కడ జరిగే తాంత్రిక పద్ధతులకు సాటి లేవని ఒక మతపరమైన నమ్మకం ఉంది.

West Bengal : కోల్‌కతా సహా పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆలయాలు తాంత్రిక ఆచారాలకు, శక్తి ఆరాధనకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రధాన తాంత్రిక ఆలయాలు అయితే కాళీఘాట్ కాళీ ఆలయం, దక్షిణేశ్వర్ కాళీ ఆలయం, హుగ్లీ హంసేశ్వరి సహా పలు ఆలయాలున్నాయి. ఇక్కడ తరచూ తాంత్రిక పూజలు, బలులు, విశేష ఆచారాలు జరుగుతాయని స్థానికులు చెబుతారు

తారాపీఠ్ ఆలయం
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో ఉన్న తారాపీఠ్ ఆలయం, దేశంలోని అత్యంత రహస్యమైన , శక్తివంతమైన సిద్ధ పీఠాలలో ఒకటి. కాళీమాత ఉగ్రరూపం అయిన తారాదేవి ఆరాధనకు ప్రధాన కేంద్రం. ఇక్కడ సతీదేవి కంటిపాప పడిందని చెబుతారు. శ్మశాన వాటికకు సమీపంలో ఉండే ఈ ఆలయం సీపంలో తంత్రసాధన జరుగుతుందని చెబుతారు. ఈ ఆలయంలో వామాచారం పద్ధతిలో పూజలు చేస్తారు. ఇక్కడ తారాదేవి రెండు చేతుల్లో పాములు, ఒడిలో శివుడితో దర్శనమిస్తుంది. 13వ శతాబ్ధపు లయం తెల్లటి రంగులో బెంగాలీ శైలిలో ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం ఐదున్నర నుంచి రాత్రి 8 గంటలవరకు ఆలయం తెరిచి ఉంటుంది. కోల్ కతా నుంచి రైలు ద్వారా తారాపీఠ్ రోడ్ స్టేషన్ వరకూ లదా బస్సు కారులో వెళ్లొచ్చు. సెప్టెంబర్ నుంచి మార్చి మధ్య సందర్శనకు అనుకూలం

నిమ్తలా ఘాట్
కోల్‌కతాలోని నిమ్తలా ఘాట్ దహన సంస్కారాలకు కూడా ప్రసిద్ధి చెందింది. కాశీలో మణికర్ణిక ఘాట్ లాగే, ఈ ప్రదేశం కూడా అంత్యక్రియలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు రెండింటికీ ప్రసిద్ధి చెందింది. స్థానిక నమ్మకాల ప్రకారం, రాత్రిపూట ఇక్కడి వాతావరణం నిర్మానుష్యంగా మారుతుంది . కొంతమంది అసాధారణ శబ్దాలు విన్నామని చెబతారు. అయితే దీనికి ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేవు. 1827 నుంచి ఇది ఉనికిలో ఉంది. ఇక్కడ దహనం జరిగితే ఆత్మ మోక్షాన్ని పొందుతుందని నమ్మకం. రవీంద్రనాథ్ ఠాగూర్, దేవేంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర ఛటోపాధ్యాయ వంటి ప్రముఖుల అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి. ఈ ఘాట్ సమీపంలో ఉన్న భూత్ నాథ్ ఆలయం ప్రసిద్ధి. 2010లో ప్రభుత్వం ఈ శ్మశానవాటికను అభివృద్ధి చేసింది. ఇక్కడ ఎలక్ట్రికల్ దహనం చేసే ఏర్పాట్లు కూడా చేసింది.

కాళీఘాట్ కాళీ ఆలయం
కోల్‌కతాలోని కాళీఘాట్ కాళీ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటిగా, అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. సతీదేవి కాలి బొటన వేలు పడిందని చెబుతారు. అందుకే ఇది శక్తి ఆరాధనకు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడి పూజా పద్ధతులు తాంత్రిక సంప్రదాయాలను కూడా ప్రతిబింబిస్తాయి, అయినప్పటికీ సాధారణ భక్తులకు ఇది భక్తి, గౌరవాలకు ఒక ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది. ఇది శక్తిపీఠం కావడంతో దేశంలో అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగుతోంది. కోల్‌కతా అనే పేరు కూడా కాళీ ఘాట్ నుంచే వచ్చిందని చెబుతారు

హుగ్లీ నది ఒడ్డున ఉన్న దక్షిణేశ్వర్ కాళీ ఆలయం భవతారిణి కాళీ రూపానికి ప్రసిద్ధి. రామకృష్ణ పరమహంస ఇక్కడ అమ్మవారిని పూజించారు.

తంతానియా కాళీబారీ ఆలయంలో అమ్మవారిని సిద్ధేశ్వరిగా పూజిస్తారు. తాంత్రిక ఆచారాల ప్రకారం ఇక్కడ రొయ్యల నైవేద్యం సమర్పిసతారు.
కోల్‌కతా సమీపం బాన్స్ బేరియాలో ఉన్న హంసేశ్వరి ఆలయం 13 శిఖరాలతో మానవ శరీర నిర్మాణ శాస్త్రం ఆధారంగా నిర్మితమైన తాంత్రిక ఆలయం
ఇక తాంత్రిక పూజలు, చేతబడుల విషయానికొస్తే మతపరంగా వీటిని ప్రతికూల ధోరణులతో ముడిపెడతారు. చేతబడి చేయడం వల్ల ఓ వ్యక్తి మానసికంగా ప్రభావితం అవుతాడని,భయం, భ్రమలు లేదా ప్రతికూల ఆలోచనలు లోనవుతాడని అంటారు. వీటికి కూడా శాస్త్రీయంగా ఆధారాలు లేవు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















