Vastu Tips:మంచంపై కూర్చుని పనిచేయడం వాస్తు దోషాలు, అనారోగ్యాలను తెస్తుంది. రాహువు ప్రభావం పురోగతికి ఆటంకం కలిగించి, మానసిక ఒత్తిడిని పెంచుతుందని చెబుతారు వాస్తునిపుణులు. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ వచ్చినప్పటి నుంచీ ఇంటి నుంచి పనిచేసేవారిసంఖ్య పెరిగింది. షిప్టుల్లో పనిచేయాల్సి రావడంతో వేకువజామునుంచి అర్థరాత్రి వరకూ ఏ సమయంలో అయినా పనిచేయాల్సి వస్తుంది. అందుకే చాలామంది ఆఫీస్ స్టైల్లో కుర్చీ, టేబుల్ అనికాకుండా.. మంచంపైనే రిలాక్స్ గా కూర్చుని వర్క్ చేస్తున్నారు. కానీ వాస్తు శాస్త్రం , జ్యోతిష్యం ప్రకారం ఈ అలవాటు మీ విజయాన్ని అడ్డుకోవడమే కాకుండా, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు.
జ్యోతిష్య , వాస్తు దోషాలు (రాహు-కేతువుల ప్రభావాలు)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శాంతి ఆనందానికి ప్రతీకలైన శుక్రుడు , చంద్రుడితో పడకకు సంబంధం ఉంది. కార్యాలయ పనికి బుధుడు (తెలివి) శని (క్రమశిక్షణ) ప్రేరణగా నిలుస్తాయి .
రాహువు ప్రతికూల ప్రభావం
మంచం రాహు కేతువుల నివాసంగా పరిగణిస్తారు. మురికిగా లేదా అస్తవ్యస్తంగా ఉన్న మంచం మీద పనిచేయడం రాహువు ప్రతికూల ప్రభావాన్ని పెంచుతుంది, ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని బలహీనపరిచి, గందరగోళాన్ని సృష్టిస్తుంది.
కేతువు , మానసిక పరధ్యానాలు
పడకపై పనిచేయడం అనేది పనికీ, విశ్రాంతికీ మధ్య ఉన్న గీతను చెరిపివేస్తుంది. కేతువు ప్రభావం ఏకాగ్రత లోపానికి సంబంధం తెగిపోయిన భావనకు దారితీయవచ్చు.
కెరీర్, పురోగతికి ఆటంకాలు
మీరు మంచం మీద పని చేసినప్పుడు, శక్తి సమతుల్యతకు భంగం కలుగుతుంది, ఇది మీ పురోగతిని నేరుగా ప్రభావితం చేస్తుంది:
క్రమశిక్షణ లోపం
మంచం విశ్రాంతి కోసం, దానిపై పని చేయడం సోమరితనాన్ని పెంచుతుంది.. పని నాణ్యత పడిపోతుంది.
ఆర్థిక నష్టం
వాస్తు ప్రకారం, మంచం మీద కూర్చుని పనిచేయడం లేదా తినడం 'ఆశీర్వాదాలను' దూరం చేస్తుంది .. అప్పు పెరిగే అవకాశం ఉంది.
సంబంధాలలో చేదు
రాహువు దోషం కారణంగా, కార్యాలయంలో సహోద్యోగులు లేదా పై అధికారితో అపార్థాలు తలెత్తవచ్చు, ఇది మీ పదోన్నతికి ఆటంకంగా మారుతుంది.
ఎక్కువసేపు మంచం మీద కూర్చుని పనిచేయడం శారీరకంగా , మానసికంగా హానికరం. వెన్నెముకకు సరైన ఆధారం లభించదు, దీనివల్ల నడుము నొప్పి, డిస్క్ జారడం , మెడ పట్టేయడం జరగవచ్చు.
మెదడు మంచాన్ని తన కార్యస్థలంగా భావించడం మొదలుపెట్టినప్పుడు, అది విశ్రాంతి తీసుకోలేదు. దీనివల్ల నిద్రలేమి , మానసిక ఒత్తిడి పెరుగుతాయి.
మీరు ఇంటి నుంచి పని చేస్తుంటే, ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మీ శక్తిని, ఉత్పాదకతను పెంచుకోవచ్చు
మంచానికి దూరంగా ఒక ప్రత్యేక బల్ల , కుర్చీని ఎంచుకోండి. వీలైతే మీ బెంచ్ ను ఇంటి ఉత్తరం లేదా తూర్పు మూలలో ఉంచండి. ఈ దిశలు సానుకూలతకు , కొత్త అవకాశాలకు ఉత్తమమైనవిగా పరిగణిస్తారు రాహువు ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, మీ కార్యాలయంలో పాత కాగితాలు లేదా చెత్త పేరుకుపోకుండా చూసుకోండి. ఆ ప్రదేశాన్ని ప్రతిరోజూ శుభ్రం చేయండి.
పని చేసే ప్రదేశంలో సానుకూల శక్తిని నిలుపుకోవడానికి కర్పూరం వెలిగించండి లేదంటే అగరబత్తి అయినా వెలిగించండి. ఇది వాతావరణాన్ని శుద్ధి చేసి ఏకాగ్రతను పెంచుతుంది.
పని చేస్తున్నప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపుకు తిరిగి కూర్చోండి.
