Vastu Tips: ప్లాస్టిక్ మన జీవితంలో భాగంగా మారిపోయింది. ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని అంతా అనుకుంటారు కానీ...నిత్యజీవితంలో తెలియకుండానే చాలా ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తుంటాం. వాటిలో ఒకటి ఏసీ రిమోట్, టీవీ రిమోట్ కి కవర్లతో ప్యాక్ చేయడం...
చాలా ఇళ్లలో టీవీలు, ఏసీలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల రిమోట్‌లపై ప్లాస్టిక్ కవర్లు లేదా కవర్లు వేసి ఉంచడం మీరు చూసి ఉంటారు. ఈ అలవాటు చాలామందికి ఉంటుంది. దాదాపు అన్ని ఇళ్లలో రిమోట్స్ కి తప్పనిసరిగా కవర్లు ఉంటాయి.
రిమోట్‌ను సురక్షితంగా ఉంచడానికి ప్లాస్టిక్ కవర్ వేయడం సరైనదేనా?
ఈ విషయంలో వాస్తు శాస్త్రం - జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారు?
వాస్తు ప్రకారం రిమోట్‌పై కవర్ వేయడం మంచిదా లేదా చెడ్డదా?
వాస్తు నిపుణులు , జ్యోతిష్యుడు అనీష్ వ్యాస్ ప్రకారం... పాత సంప్రదాయాలను అనుసరించి, ఇంట్లో కప్పి ఉంచిన లేదా దాచిన వస్తువులు ఆర్థిక శక్తికి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి, చాలా వస్తువులపై కవర్లు లేదా కవర్లు వేయడం మానుకోవాలి. ఇది సానుకూల శక్తి ధన ప్రవాహాన్ని నిరోధించినట్లుగా పరిగణిస్తారు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు ప్రధానంగా రాహువుతో ముడిపడి ఉంటాయి. అందుకే ఈ వస్తువులపై ప్లాస్టిక్ పొర (కవర్) వేయడం రాహువు ప్రభావాన్ని పెంచుతుందని నమ్ముతారు. ఒకరి జాతకంలో రాహువు ఇప్పటికే అశుభంగా ఉంటే, అటువంటి అనవసరమైన ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని సలహా ఇస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
కొన్ని నమ్మకాల ప్రకారం, ప్లాస్టిక్ వస్తువులు అగ్ని ..శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. ఇంట్లో ఎక్కువ ప్లాస్టిక్ ఉంచకూడదని సలహా ఇస్తారు. అందువల్ల పండితుల అభిప్రాయం ప్రకారం రిమోట్‌పై కవర్ వేయడం శక్తి సమతుల్యతకు కొద్దిగా ఆటంకం కలిగిస్తుంది. వాస్తు శాస్త్రంలో ప్లాస్టిక్, ఇనుము లేదా అల్యూమినియం వంటి వస్తువులను శుభంగా పరిగణించరు.
నిపుణులు ఏమంటున్నారు?
సాధారణంగా మధ్యతరగతి వారు మాత్రమే ఇలా చేస్తారని అంతా అనుకుంటారు..కానీ ఇది నిజం కాదు. దాదాపు ప్రతి ఒక్కరూ రిమోట్‌ను దుమ్ము, ధూళి, నీరు, తేమ లేదా జిడ్డు నుంచి సురక్షితంగా ఉంచేందుకు ప్లాస్టిక్ కవర్ దానికి ఉంచేస్తారు. మీరు రిమోట్‌పై ప్లాస్టిక్ కవర్ వేసినప్పుడు, అది రిమోట్‌ను రక్షించదు..మరింత త్వరగా రిమోట్ ను పాడుచేసతుంది. కొన్నిసార్లు సిగ్నల్స్ రావు, కవర్ ఎక్కువ రోజులు ఉంచేస్తే క్రిములు పేరుకుపోతాయి...వీటితో పర్యావరణ పరంగానూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని హితవుపలుకుతున్నారు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. వీటిని పరిగణలోకి తీసుకునే ముందు మీకు నమ్మకమైన పండితులను సంప్రదించండి..
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!
'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?
'వారణాసి' సినిమా టీజర్లో కనిపించిన 'చినమస్తా దేవి' ఎవరు? రాజమౌళి ఆమె గురించి ఏం చెప్పబోతున్నారు?