News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ మూలలు పెరిగిన స్థలాలు అస్సలు కొనకూడదు

Vastu Tips: ఇంటి నిర్మాణం చేపట్టేముందు వాస్తు చూసుకునేవారి సంఖ్య ఎక్కువే. అయితే నిర్మాణం సమయంలో మాత్రమే కాదు..స్థలం కొనేటప్పుడు కూడా వాస్తు చూసుకోవాల్సి ఉంటుంది..అవే దిక్కులు, మూలలు...

FOLLOW US: 
Share:

Vastu Tips In Telugu: : వాస్తు కొందరికి సెంటిమెంట్ మరికొందరికి ట్రాష్. అస్సలు పట్టించుకోనివారికి సమస్యే లేదు కానీ వాస్తుని విశ్వశించేవారు మాత్రం ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలిస్తారు. వాస్తు ప్రకారం ఇది సరికాదని తెలిస్తే చాలు ఎలాంటి మార్పులు చేర్పులైనా చేసేస్తారు. అయితే  ఇంటి నిర్మాణం సమయంలో మాత్రమే కాదు... ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేసినప్పటి నుంచీ వాస్తు చూసుకోవాల్సి ఉంటుందంటారు వాస్తు శాస్త్ర నిపుణులు... ముఖ్యంగా స్థలం దిక్కులు, మూలల గురించి తప్పనిసరిగా చూసుకోవాలని చెబుతారు..

Also Read: శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది

నిర్మాణం కోసం కొనుగోలు చేసే స్థలంలో కొన్ని మూలలు పెరిగితే మంచిది..మరికొన్ని మూలలు సమంగా ఉంటేనే మంచిది. వాస్తుశాస్త్ర విరుద్ధంగా మూలలు పెరిగిన స్థలాలను కొనాల్సి వస్తే..వాటిని వాస్తు నియమాల రీత్యా సరిచేసుకుని అప్పుడు నిర్మాణం చేసుకుంటే అక్కడ శుఖ శాంతులుంటాయంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఏ మూలలు పెరిగితే మంచిది..ఏ మూలలు సమంగా ఉంటే మంచిదో ఇక్కడ తెలుసుకోండి..

తూర్పు ఆగ్నేయం

ఈ మూల పెరగడం ఏ మాత్రం క్షేమదాయకం కాదు. తూర్పు ఆగ్నేయం మూల ఎక్కువగా ఉన్న స్థలం కొనుగోలు చేస్తే...ఆ మూలను సరిచేసుకున్నాకనే గృహ నిర్మాణం చేపట్టాలి. పెరిగిన మూలలో వున్న స్థలాన్ని కట్‌చేసి... గృహ నిర్మాణ స్థలంలో కలపకుండా వేరుగా ఉంచాలి. ఈ స్థలాన్ని మొక్కలు పెంచుకునేందుకు ఉపయోగించాలి కానీ నిత్యం వాడుకునే విధంగా మాత్రం మలచుకోవద్దు. 

తూర్పు ఈశాన్యం

తూర్పు ఈశాన్యం స్థలం పెరిగితే... తొలగించాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థలం అదృష్టదాయకం. ఆయురారోగ్య ధనధాన్యాభివృద్ధికి నిలయం అవుతుందీ స్థలం. డబ్బు అదనంగా ఇచ్చైనా ఇలాంటి స్థలాన్ని నిశ్చింతగా కొనుక్కోవచ్చు

ఉత్తర ఈశాన్యం

ఉత్తర ఈశాన్యం పెరిగి వున్న స్థలాన్ని కూడా మరో ఆలోచన చేయకుండా కొనుక్కోవచ్చు. ఇలా ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కట్‌చేసి తొలగించాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉంచుకోవచ్చు. ఈ ప్రదేశంలో బరువైన నిర్మాణాలు చేయకూడదు. ఈ స్థలాన్ని ఖాళీగా వదిలేస్తేనే వాస్తురీత్యా శుభప్రదం.

ఉత్తర వాయువ్యం

మీరు కొనే స్థలం ఉత్తర వాయువ్యం పెరిగి ఉంటే...పెరిగిన మేర కట్‌చేసి దానిని నిర్మాణాలకు ఏమాత్రం వినియోగించకుండా... మిగిలిన స్థలంలో గృహ నిర్మాణం చేసుకోవాలి.

పశ్చిమ వాయువ్యం

పశ్చిమ వాయువ్యం పెరిగి ఉండడం కూడా వాస్తు శాస్త్ర రీత్యా శుభ సూచకంకాదు. కనుక పశ్చిమ వాయువ్యంలో పెరిగి వున్న స్థలాన్ని కట్‌ చేసి తొలగించి... మిగిలిన స్థలంలో గృహ నిర్మాణం చేయాలి.

Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!

పశ్చిమ నైఋతి

పశ్చిమ నైఋతి పెరిగి ఉండటం కూడా వాస్తురీత్యా ఆమోదనీయం కాదు. జాగ్రత్తగా పెరిగిన పశ్చిమ నైఋతీ భాగాన్ని కట్‌చేసి, స్థలాన్ని చతురస్ర లేదా దీర్ఘ చతురస్రాకారంగా తయారు చేసుకుని ఆ స్థలంలో గృహ నిర్మాణం చేయాలి.

దక్షిణ నైఋతి

ఇక్కడి చిత్రాన్ని గమనిస్తే దక్షిణ నైఋతి పెరిగినట్లు అర్ధం అవుతుంది. దక్షిణ నైఋతి పెరిగి ఉండకూడదు. పెరిగిన మేర కట్‌ చేయాల్సిందే. తూర్పు, పడమర భుజాలు సమంగా ఉండేలా చూసుకుని దక్షిణ నైఋతిని కట్‌ చేయాలి.

దక్షిణ ఆగ్నేయం

దక్షిణ ఆగ్నేయం పెరగడం కూడా వాస్తు శాస్త్ర రీత్యా సమ్మతమైన విషయం కాదు. పెరిగిన దక్షిణ ఆగ్నేయాన్ని తప్పకుండా కట్‌చేసి తొలగించాల్సిందే. దక్షిణ ఆగ్నేయం పెరగటం అంటే.. నైఋతి తగ్గటం అన్నమాట. నైఋతి పెరిగినా, తగ్గినా అది శుభప్రదం కాదు.

కొన్ని స్థలాలు.. ఒకమూలే కాకుండా... రెండు మూలలు కూడా పెరిగి ఉంటాయి. వాటిని సరిచేసుకున్నాకనే  నిర్మాణం చేపట్టాలి. ఇలా మూలలు పెరిగిన వాటిని సరి చేయకుండా నిర్మాణాలు చేపట్టినా, ఇలాంటి స్థలంలో ఉన్న నివాసాలు కొనుగోలు చేసినా మీకు అడుగడుగునా అశుభాలే ఎదురవుతాయంటున్నారు వాస్తు పండితులు. మీకు తెలియకుండా ఇలాంటి నివాసం గృహం కొనుగోలు చేసినట్టైతే...ఆ తర్వాత అయినా ఆ భాగాన్ని సరిచేసుకోవడం మంచిది. ఒకవేళ పెరిగిన మూలలు సరిచేసేందుకు వీలుగా గృహ నిర్మాణం లేకపోయినట్లయితే ఆ గృహాన్ని కొనకుండా వదిలేయడం మంచిది. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలాన్ని, అలాంటి స్థలంలో నిర్మించిన ఇళ్లను నిశ్చింతగా కొనుగోలు చేయవచ్చు.

Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.

Published at : 29 Apr 2023 08:08 AM (IST) Tags: vastu shastra vastu remedies vastu for home vastu tips in telugu vastu tips for wall painting Vastu Shastra Tips for Home Vastu Shastra Tips for master bed room

ఇవి కూడా చూడండి

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే -  ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

Vastu tips: లాకర్‌లో ఈ నాలుగు వస్తువులు ఉంటే దరిద్రం తప్పదు

Vastu tips: లాకర్‌లో ఈ నాలుగు వస్తువులు ఉంటే దరిద్రం తప్పదు

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

Gachibowli Laddu Price: భారీ ధర పలికిన నల్లగొండలోని పాతబస్తీ లడ్డు, ధర ఎంతంటే??

Gachibowli Laddu Price: భారీ ధర పలికిన నల్లగొండలోని పాతబస్తీ లడ్డు, ధర ఎంతంటే??

మీ బాత్రూమ్‌లో ఈ ఆరు వస్తువులు ఉన్నాయా? అయితే, ఈ సమస్యలు తప్పవు

మీ బాత్రూమ్‌లో ఈ ఆరు వస్తువులు ఉన్నాయా? అయితే, ఈ సమస్యలు తప్పవు

టాప్ స్టోరీస్

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Nara Bramhani Politics : టీడీపీలో మోస్ట్ వాంటెడ్ లీడర్‌గా నారా బ్రాహ్మణి - రాజకీయాల్ని ఇక సీరియస్‌గా తీసుకుంటారా ?

Nara Bramhani Politics :  టీడీపీలో మోస్ట్ వాంటెడ్ లీడర్‌గా నారా బ్రాహ్మణి - రాజకీయాల్ని ఇక సీరియస్‌గా తీసుకుంటారా ?

Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!

Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!