Krishna Vastu Tips: శాస్త్రోక్తంగా ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి..? ఇంట్లో ఏ వస్తువుఈ విషయాన్ని శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. వాస్తుశాస్త్రం గురించి చెప్పే సర్వాంతర్యామి అయిన  శ్రీకృష్ణుడు ... మహాభారత యుద్ధంలో యుధిష్ఠిరునికి గృహ సంతోషం, రాజ్య శాంతి కోసం కొన్ని నియమాలను చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ వాస్తు నియమాలను మనం పాటిస్తే జీవితంలో సుఖం, శాంతి, ఆనందం, ప్రశాంతత లభిస్తాయి. ఇది ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పిన వాస్తు నియమాలు ఇప్ప‌డు తెలుసుకుందాం.


ధూపం


శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి ఇంట్లో ధూపం వేయమని చెప్పాడు. ఇంట్లో ధూపం వేయడం వల్ల ఆ ఇంటి వాస్తు దోషం పోతుంది. అందువ‌ల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. మీ ఇంట్లో రోజూ ధూపం వేయడం వల్ల ఎలాంటి  వాస్తు దోషం అయినా తొల‌గిపోతుంది.


Also Read : నాలుగు దిక్కుల‌కు ఉన్న ప్రాధాన్యం తెలుసా? ఏ దిక్కున ఏం చేస్తే ఏ ఫ‌లితం ఉంటుందో తెలుసుకోండి.!


దీపం


శ్రీకృష్ణుడు ధ‌ర్మ‌రాజుకు చెప్పిన రెండవ వాస్తు దోష నివారణ మార్గం ఇంట్లో దీపం వెలిగించడం. రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఇంట్లో దీపం వెలిగిస్తే వాస్తు దోషం పోతుంది. దీపం చీకటిని తొలగించి కాంతితో నింపినట్లే, ఇంట్లో వాస్తు దోషాన్ని కలిగించే ప్రతికూలతను తొలగించి సానుకూల ప్రకంపనలను సృష్టిస్తుంది.


నీరు


నీ ఇంటిలోనూ, నువ్వు పాలించే రాజ్యంలో నీటి కొరత ఉండకూడద‌ని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పాడు. నువ్వు నివసించే ప్రదేశంలో నీటి వ్యవస్థ బాగుండాలని సూచించాడు. మీ ఇంటి నీటి వ్యవస్థ ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచుకోవాలని సూచించాడు.  రోజువారీ కార్యకలాపాలకు ఈశాన్య దిశలో నీటిని ఉపయోగించాలి. ఈ దిక్కును భగవంతుని దిక్కుగా పరిగణిస్తారు.


Also Read: సెప్టెంబరు 09 రాశిఫలాలు, ఈ రాశులవారు తొందరపాటు తగ్గించుకుంటే సక్సెస్ అవుతారు!


పరిమళం


ఏదైనా పదార్ధం వాసనను తగ్గించవచ్చు కానీ గంధం సువాసన ఎప్పటికీ తగ్గదు. గంధంతో వేయి పూలు పేర్చినా గంధపు సువాసనే వస్తుంది. ఈ కారణంగా ఒక చందనం ముక్కను ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలి.


నెయ్యి


ఇంట్లో ఎప్పుడూ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంచండి. మీరు ఈ నెయ్యిని ఆహారంలో కాని ఆహార తయారీలో లేదా పూజలో ఉపయోగించవచ్చు. కానీ, ఈ నెయ్యి ఇంట్లో ఎప్పుడూ అయిపోకుండా చూసుకోండి. మీరు ఇంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్ర‌మే ఉంచుకోవాల‌ని గుర్తుంచుకోండి.


తేనె


ఇంట్లో వాస్తుదోషం పోగొట్టే శక్తి తేనెకి కూడా ఉందని శ్రీకృష్ణుడు చెప్పాడు. తేనె మీ ఇంటిని, మీ పరిసరాలను, మీ ఆత్మను శుభ్రంగా ఉంచుతుందని తెలిపాడు. అందుకే పూజలో నెయ్యితో పాటు తేనెను కూడా ఉపయోగిస్తారు.


Also Read : ఈ మొక్క ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది!


సరస్వతీ పూజ


సరస్వతీ దేవి విద్యా దేవత. ఆమెను పూజించడం వల్ల మనకు జ్ఞానం లభిస్తుంద‌ని శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి మీరు మీ ఇంటిలో సరస్వతీ దేవి లేదా ఆమె పాదరసం విగ్రహం లేదా ఫోటోను ఉంచండి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.