ఈ సారి నవరాత్రికి వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలని అనుకుంటున్నారా? మరి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఈ యాత్రకు సిద్దమవుతున్నపుడు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. కొన్ని తప్పక గుర్తుంచుకోవాలి. కొన్ని బుకింగ్స్ ముందుగానే చేసుకోవాలి. ఎలాంటి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి? టైమింగ్స్ ఏమిటి? వంటి సమాచారం తెలుసుకుని పెట్టుకోవాలి. వీటన్నింటిని అనుసరించి ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవాలి.


నవరాత్రి తొమ్మిది రోజుల పాటు జరిగే పండుగ. నవరాత్రుల్లో వైష్ణోదేవి దర్శనం చేసుకోవాలని చాలా మంది ఆశపడతారు. అలాంటి ఆశ, ఉద్దేశం ఉన్నవారికి పనికొచ్చే ముఖ్య సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.


ముందుగా తెలుసుకోవాల్సిందేమిటంటే ఇక్కడికి వెళ్లాలంటే ముందు యాత్రికులుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక వేళ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా జమ్ములోని యాత్రా కార్డ్ కలెక్షన్ పాయింట్ దగ్గరకి వెళ్లి ఫోన్ నెంబర్, వయసు వంటి వివరాలను అందిస్తే మీకు అక్కడ మీ ఫోటో తీసుకుని ఐడి కార్డ్ ఒకటి అందిస్తారు. యాత్ర పూర్తయిన తర్వాత మీరు మీ కార్డును వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. యాత్రికులు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, సామాజిక దూరం పాటించడం వంటి కోవిడ్ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. IRCTC కూడా నవరాత్రి ప్రత్యేక రైలును నడుపుతుంది.



  • రిజిస్టర్డ్ యూజర్ తన యూజర్ ఐడీ పాస్వర్డ్ తో వెబ్ సైట్ లోకి ఎంటర్ కావచ్చు. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. వెబ్ సైట్ వివరాలు maavaishnodevi.org

  • యాత్ర రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి యాత్ర వివరాలను నమోదు చేసుకోవాలి. జనరేట్ యాత్రా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ప్రింటవుట్ తీసుకోవాలి.


వైష్ణోదేవి టైమింగ్స్


వేసవిలో లైవ్ ఆర్తి ఉదయం 6.20 గంటల నుంచి 8.00 గంటల వరకు, సాయంత్రం 7.20 గంటల నుంచి 8.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. శీతాకాలంలో లైవ్ అత్కాఆర్తి.. ఉదయం 6.20 గంటల నుంచి 8.00 గంటల వరకు సాయంత్రం 6.20 గంటల నుంచి 8.00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో భక్తులను సందర్శనకు అనుమతించరు.


అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రీపెయిడ్ సిమ్ కార్డు ఫోన్లను జమ్ములోకి అనుమతించరు. కనుక కనెక్టివిటి కోసం జమ్ముకు వెళ్లినపుడు తప్పనిసరిగా పోస్ట్ పెయిడ్ సిమ్ వెంట తీసుకువెళ్లాలి. ఒకవేళ మరిచిపోతే అక్కడి చిన్న దుకాణాల్లో సైతం యాత్రి సిమ్ 350/- కి అందుబాటులో ఉంటాయి. ఈ సిమ్ నెల పాటు పనిచేస్తుంది. రోజుకు 1.5 డెటా, ఒక నెల పాటు అపరిమిత కాల్స్ లభిస్తాయి.


వైష్ణోదేవి యాత్ర – హెలీకాప్టర్, ఎలక్ట్రిక్ వెహికిల్ బుకింగ్


వైష్ణోదేవి యాత్ర ప్రారంభమయ్యేది బాన్ గంగా నుంచి.. ఇక్కడికి చేరుకోవడానికి ఆటోలో కూడా వెళ్లవచ్చు. బాన్ గంగా చేరుకున్న తర్వాత అక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఘోడే(పోనీ) లేదా పాల్కీ కూడా మనం వినియోగించుకోవచ్చు. ఆడ్కువారి నుంచి ఆలయం వరకు మనం ప్రయాణం చెయ్యడానికి 4 రకాల సౌకర్యాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రిక్ వ్యాన్లు కూడా అందుబాటులో ఉంటాయి. దీని కోసం ముందుగా వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మరచిపోతే మాత్రం ఆఫ్ లైన్ బుకింగ్ అవకాశం లేదని గుర్తుంచుకోవాలి. 5-6 గంటల వెయిటింగ్ తప్పకుండా ఉంటుంది. అలాగే హెలీకాప్టర్ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.


బైరోబాబాను దర్శనం చేసుకోవడానికి రోప్ వే ద్వారా వెళ్ల వచ్చు. వైష్ణోదేవి రోప్ వే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. టికెట్లు ఆఫ్ లైన్ లో బుక్ చేసుకోవాలి. ఒకొక్కరికి రూ.100. ఇది చాలా మందికి సౌకర్యవంతంగా అనిపిస్తుంది.


www.maavaishnodevi.org లో మాత్రమే శ్రీమాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డ్ వారి అధికారిక వెబ్ సైట్. ఇదికాక మరే వెబ్ సైట్ అయినా నకిలీదే అని గుర్తుంచుకోవాలి. SMVDSB కత్రా తరపున ఆన్‌లైన్ టిక్కెట్‌ను బుక్ చేయడానికి  ఏ ట్రావెల్ ఏజెంట్‌కు అనుమతి లేదు. కనుక అలాంటి బుకింగులు చెల్లవు. ఇక్కడ చెప్పిన అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే బుకింగ్ వివరాలు ఉన్నాయి. ఇది కాకుండా "MATA VAISHNODEVI APP" అనే అధికారిక మొబైల్ ఆప్ కూడా అందుబాటులో ఉంది. దీనిలో కూడా బుకింగ్, ఇతర వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా సందేహ నివృత్తికి, ఇతర సమాచారం కోసం 01991-234804 నంబర్ తో 24x7 కాల్ సెంటర్‌ను, వాట్సప్ నెంబర్ 9906019494 లో సంప్రదించవచ్చు.


Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు!