Gopeshwar Mahadev:  మథుర  బన్‌ఖండిలో ఉన్న గోపేశ్వర్ మహాదేవ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో, శివుడు ఉదయం పురుషుడిగా.. సాయంత్రం స్త్రీ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. శివునికి చాలా రూపాలు ఉన్నాయి కాని గోపేశ్వర్ రూపానికి సంబంధించిన రహస్యం చాలా ప్రత్యేకమైనది. శివుడు ఈ రూపాన్ని ఎలా పొందాడో చెబుతూ పురాణకథలున్నాయి

Continues below advertisement

కృష్ణుని మహారాస్‌లో గోపిగా మారిన శివుడు

Continues below advertisement

ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి మహారాస్ చేస్తున్నాడని దేవతలు అందరకీ తెలుస్తుంది. ఈ రాసలీలలో కృష్ణుడు ఒక్కడే పురుషుడు, 16 వేల 108 మంది గోపికలు ఉన్నారు. శ్రీకృష్ణుడి ఈ మహారాస లీల శరద్ పూర్ణిమ రోజు రాత్రి జరిగింది. ఈ మహారాస్ దేవతల లెక్కల ప్రకారం ఒక రాత్రి జరిగిట్టు అనిపిస్తుంది కానీ ఏకంగా ఆరు నెలలు కొనసాగింది. శ్రీ కృష్ణుడు తన యోగమాయతో ఆరు నెలల పాటు రాత్రి ఉండేలా చేశాడు. అంటే శరద్ పూర్ణిమ నుంచి వచ్చే 6 నెలల వరకు సూర్యోదయం కాలేదన్నమాట. ఇప్పటికీ శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో నిధివనంలో గోపికలతో రాసలీలలు చేస్తాడు. ( నిధివన్ లో చీకటి పడిన తర్వాత ఏం జరుగుతుందో గతంలో వివరంగా కథనాలు అందించాం... తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి) అందుకే సూర్యాస్తమయం తర్వాత నిధివనంలోకి ఎవరినీ అనుమతించరు. ఈ మనోహరమైన దృశ్యానికి దేవతలందరూ సాక్ష్యంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలనుకున్నారు. శివుడు కూడా ఈ మహారాస్‌లో పాల్గొని ఆనందించాలనుకున్నాడు, కాని కృష్ణుడు తప్ప పురుషులు ఎవరూ ప్రవేశించేందుకు గోపికలు అనుమతించలేదు. అప్పుడు శివుడు యోగమాయ శక్తితో గోపి రూపంలోకి మారి మహారాస్‌లో చేరాడు.

గోపి రూపం ధరించి శివుడు కూడా కృష్ణునితో కలిసి రాసలీలలు చేయడం ప్రారంభించాడు. కాని కృష్ణుడు ...పరమేశ్వరుడిని గుర్తించి, "ఓ గోపేశ్వరా!" అని పిలిచాడు. అంతేకాకుండా.యయశ్రీకృష్ణుడు తన ఆరాధ్య దేవుడికి నమస్కరించి, ఇదే రూపంలో బృందావనంలో కొలువై  ఉండమని కోరాడు. అలా మథురలో  గోపేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడిని స్త్రీ రూపంలో అలంకరించి గోపేశ్వర్ రూపంలో పూజిస్తారు. 

గోపేశ్వర్ మహాదేవ్ ఆలయం భారతదేశంలోని ఉత్తర్ ప్రదేశ్‌లోని వృందావనంలో ఉన్న ప్రసిద్ధ శివాలయం. శివుడికి అంకితం చేసిన ప్రాచీన ఆలయాలలో ఒకటి .. బ్రజ్ ధామ్‌లోని నాలుగు రక్షక శివాలయాల్లో (భూతేశ్వర్, చక్రేశ్వర్, కామేశ్వర్, గోపేశ్వర్) ఒకటి. ఇక్కడ సాయంత్రాల్లో శివుడిని గోపి రూపంలో  ఆభరణాలతో, అందమైన దుస్తులతో అలంకరిస్తారు. మహా శివరాత్రి రోజు శివుడిని 16 అలంకారాలతో (గోపి రూపంలో) చూడటానికి భారీగా దంపతులు వస్తారు.శ్రావణమాసంలోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. 

 ప్రపంచవ్యాప్తంగా శివుడు గోపిక రూపంలో ఉన్న ఏకైక ఆలయం అని చెబుతారు. ఈ ఆలయాన్ని కృష్ణుని మహానతి వజ్రనాభుడు (శండిల్య మహర్షి సూచనల మేరకు) నిర్మించాడని చెబుతారు. 12వ శతాబ్దానికి చెందినదిగా అంచనా.

ఇక్కడ గోపేశ్వర్ మహాదేవ్ ని దర్శించుకునే భక్తులకు కర్మ శుద్ధి, మోక్షం, కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ధ్యానం చేసుకునేందుకు అనువుగా ఉంటుంది.  బంకే బిహారి ఆలయం లేదా రాధావల్లభ్ ఆలయం సమీపంలోనే ఉంటుంది గోపేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఢిల్లీ నుంచి 150 కిలోమీటర్లు, మధుర రైల్వే స్టేషన్ నుంచి 10 కిలమీటర్ల దూరంలో ఉంది