Tirumala Arjitha Seva Tickets for July 2025:   తిరుమ‌ల  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్ర‌భాత సేవ, తోమాల‌ సేవ, అర్చ‌న‌ సేవ, అష్టదళ పాదపద్మారాధనసేవ  జూలై నెల‌ కోటాను ఏప్రిల్‌ 19 ఉదయం 10 గంట‌ల‌కు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేష‌న్‌ కోసం ఏప్రిల్ 19 ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 21 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

లక్కీడిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు  చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.

22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

శ్రీవారి సేవల్లో భాగమైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూలై నెల కోటాను ఏప్రిల్  22 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

22న వర్చువల్ సేవల కోటా విడుదల

శ్రీ వేంకటేశ్వరుడి వర్చువల్ సేవలు,  ఆ దర్శన స్లాట్లకు సంబంధించి  జూలై నెల కోటాను ఏప్రిల్  22 మధ్యాహ్నం 3 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

జూలై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటా  ఏప్రిల్ 23  ఉదయం 10 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. 

23న శ్రీ‌వాణి టికెట్ల ఆన్ లైన్ కోటా

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను ఏప్రిల్ 23   ఉదయం 11 గంటలకు TTD విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా

 వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులతో బాధపడేవారికి తిరుమల శ్రీ‌నివాసుడి దర్శనం కల్పించేందుకు వీలుగా జూలైలో ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23  మధ్యాహ్నం 3 గంట‌ల‌కు TTD ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

జూలై నెల‌కు సంబంధించి  ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24 ఉదయం 10 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిలో గదుల కోటా 

జూలైలో తిరుమల, తిరుపతిలో  రూమ్స్ కోటాను  ఏప్రిల్ 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. దేవస్థానం వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని సూచిస్తున్నారు టీటీడీ అధికారులు

వెంకటేశ్వర వజ్రకవచంనారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణంప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమసహస్ర శీర్షా పురుషో వెంకటేశ శ్శిరోవతుప్రాణేశ: ప్రాణనిలయః ప్రాణాన్ రాక్షతుమే హరి:ఆకాశరాట్ సురానాధ ఆత్మానం మే సదావతుదేవదేవోత్తమ పయాద్దేహం మే వెంకటేశ్వరఃసర్వత్ర సర్వకాలేషు మంగంబాజాని రీశ్వరఃపాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చుతుయ ఏతద్వజ్రకవచ మభేద్యం వెంకటేశితు:సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయఃఇతి మార్కండేయకృత వెంకటేశ్వర వజ్రకవచం

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి