TTD News :    తిరుమల శ్రీవారి  దర్శనం కోసం వచ్చే ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులు వృద్ధులు, శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారు  గంటలు గంటలు ఎదురుచూడాలంటే నేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వీరి  ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ దర్శనం విషయంలో ప్రాధాన్యం కల్పిస్తోంది. ఏడాదిలోపు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా.. అది కూడా ప్రత్యేక దర్శన భాగ్యం కల్పిస్తోంది టీటీడీ. దీంతో ఏడాది లోపు పిల్లలతో తల్లిదండ్రులు స్వామివారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండక్కర్లేదు. నేరుగా దర్శానానికి పంపిస్తారు. దర్శనం కోసం కొన్ని నియమ, నిబంధలు ఉన్నాయి. 


ఏడాదిలోపు చిన్నారి తల్లిదండ్రులు ఆధార్ కార్డులు చాలు                    


టీటీడీ ఏడాదిలోపు వయసున్న పిల్లలకు ఉచిత దర్శనానికి సంబంధించి.. కచ్చితంగా ఒరిజనల్ బర్త్ సర్టిఫికేట్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేని పక్షంలో ఆస్పత్రి నుంచి ఇచ్చే డిశ్చార్జ్ సమ్మరీ అయినా తీసుకెళ్లవచ్చు. అలాగే తల్లిదండ్రుల ఐడీ కార్డులు (ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ వంటివి) కచ్చితంగా ఉండాలి. ఉదయం 8.30 గంటల నుంచి 10.30 వరకు మరల మధ్యాహ్నం 12 గంటల నుంచి  సాయంత్రం 6 గంటల వరకు.. సుపథం నుంచి దర్శనానికి నేరుగా అనుమతిస్తారు. అక్కడ బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రులు ఐడీ ప్రూఫ్స్‌ను టీటీడీ సిబ్బంది పరిశీలించిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు.


ముందుగా ఎలాంటి బుకింగ్ చేసుకోవాల్సిన అవసరంలేదు !                                  


ఈ ప్రత్యేక దర్శనానికి ఏడాదిలోపు చిన్నారి తల్లిదండ్రులతో పాటు  12లోపు మరో పాప/బాబును అనుమతిస్తారు. మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరినీ అనుమతించరు. ఈ దర్శనం కోసం ముందుగా ఎలాంటి టికెట్ బుకింగ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం. ఈ దర్శనానికి వెళ్లే తల్లిదండ్రులు, పిల్లలు కూడా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలి.


పసిపిల్లలు ఉన్న వారికి వరం ఈ సౌకర్యం !                                                                                        


 వీఐపీ బ్రేక్ దర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం, శ్రీవాణి ట్రస్ట్‌ దర్శనాలు ఇలా భక్తులు స్వామివారి సేవలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది టీటీడీ. అలాగే ఏడాదిలోపు పిల్లలు, తల్లిదండ్రులకు కూడా ఉచితంగా, అది కూడా ప్రత్యేకంగా దర్శన భాగ్యం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా.. ఎక్కువ సమయం పట్టకుండా.. నేరుగా దర్శానానికి పంపిస్తారు.