ఏప్రిల్ 25 సోమవారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 25- 04 - 2022వారం: సోమవారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం

తిథి  :  దశమి సోమవారం రాత్రి తెల్లవారుజామున 3.52 వరకు తదుపరి ఏకాదశివారం : సోమవారం ( ఇందువాసరే) నక్షత్రం: ధనిష్ఠ రాత్రి 7.37 వరకు తదుపరి శతభిషంవర్జ్యం : రాత్రి 2.34 నుంచి 4.07వరకు దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.23 నుంచి 1.13 వరకు అమృతఘడియలు : ఉదయం 9.43 నుంచి 11.14 వరకుసూర్యోదయం: 05:42 సూర్యాస్తమయం : 06:13

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. బోళాశంకరుడిని తలుచుకుంటే చాలు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. సోమవారం రోజు శివస్త్రోత్రాలు ఏవి చదువుకున్నా మంచిదే. ఈ రోజు మీకోసం శివాష్టకం అందిస్తున్నాం. 

శివ అష్టకమ్

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానన్దభాజమ్ | భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శఙ్కరం శంభుమీశానమీడే || 

గలే రుణ్డమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలమ్ | జటాజూటగఙ్గోత్తరఙ్గైర్విశాలం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

ముదామాకరం మణ్డనం మణ్డయన్తం మహామణ్డలం భస్మభూషాధరం  తమ్ | అనాదిం హ్యపారం మహామోహమారం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

తటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశమ్ | గిరీశం గణేశం సురేశం మహేశం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

గిరీన్ద్రాత్మజాసఙ్గృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహమ్ | పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వన్ద్యమానం శివం శఙ్కరం శంభుమీశానమీడే || 

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దదానమ్ | బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శఙ్కరం శంభుమీశానమీడే |

శరచ్చన్ద్రగాత్రం గుణానన్దపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ | అపర్ణాకళత్రం చరిత్రం విచిత్రం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||౭|| 

హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారమ్ | శ్మశానే వసన్తం మనోజం దహన్తం శివం శఙ్కరం శంభుమీశానమీడే ||

స్తవం యః ప్రభాతే నరః శూలపాణేః పఠేత్సర్వదా భర్గభావానురక్తః | స పుత్రం ధనం ధాన్యమిత్రం కళత్రం విచిత్రైః సమారాద్య మోక్షం ప్రయాతి ||

ఇతి శ్రీశివాష్టకం సంపూర్ణమ్ ||