ఏప్రిల్ 23 శనివారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 23- 04 - 2022వారం: శనివారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం
తిథి : సప్తమి ఉదయం 09-55 వరకు తదుపరి అష్టమివారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం: ఉత్తరాషాఢ రాత్రి 10-09 వరకు తదుపరి శ్రవణంవర్జ్యం : ఉదయం 07:11 - 08:41, రాత్రి 01:55 - 03:26 వరకుఅమృతఘడియలు : సాయంత్రం 04:10 - 05:39 దుర్ముహూర్తం : ఉదయం 05:43- 07:23రాహుకాలం : ఉదయం 09:00 - 10:30యోగం: సిద్ధి ఉదయం 07-32 వరకుకరణం : బవ ఉదయం 09-55 వరకు సూర్యోదయం: 05:43 సూర్యాస్తమయం : 06:13
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటే ఏం జరుగుతుంది
శనిదోష నివారణకు పఠించాల్సిన శ్లోకాలు
శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు.కష్ట నష్టాల నుంచి బయపడేందుకు దేవాలయాల్లో శాంతులు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే శనివారం రోజు ప్రత్యేక పూజలు మాత్రమే కాదు శనిధ్యానం చేసినా ఆ ప్రభావం తగ్గుతుందని చెబుతారు. ఇవి కేవలం శనివారం మాత్రమే కాదు నిత్యం చదువుకోవచ్చు.
శనిధ్యానం శ్లోకాలు
స్నానం చేసిన తర్వాత…సూర్యపుత్రో దీర్ఘదేహఃవిశాలక్ష శ్శివప్రియ:మందచార: ప్రసన్నాత్మాపీడాం దహతు మే శని:
శన్యారిష్టే తు సంప్రాప్తేశనిపూజాంచ కారయేత్శనిధ్యానం ప్రవక్ష్యామిప్రాణి పీడోపశాంతయే
నీలాంజన సమాభాసంరవిపుత్రం యమాగ్రజంచాయా మార్తాండ సంభూతంతన్నమామి శనైశ్చరం!
నమస్తే రౌద్ర దేహాయనమస్తే చాంతకాయచనమస్తే యమ సంజ్ఞాయనమస్తే సౌరాయే విభో !!
నమస్తే మంద సంజ్ఞాయశనైశ్చర నమోస్తుప్రసాదం మమదేవేశదీనస్య ప్రణతస్యచ!!
నమస్తే కోణ సంస్థాయపింగళాయ నమోస్తుతేనమస్తే బభ్రు రూపాయకృష్ణాయచ నమోస్తుతే !!
నిత్యం ఈ శ్లోకాలు చదవడం వల్ల శనిదోష నివారణతో పాటూ అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు చెబుతారు.
Also Read: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు
Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు