August Month Darshan Ticket Booking Opens in Tirumala: తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది భక్తులు దర్శించుకుని తరలిస్తారు. సంవత్సరానికి ఓసారి దర్శించుకోవాలి అనేది కొందరి సెంటిమెంట్ అయితే ఏడాదికి మూడు నాలుగుసార్లు దర్శించుకుంటే అంతకుమించిన అదృష్టం ఏముంటుందని భావిస్తారు భక్తులు. అందుకే స్వామివారి సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతుంది.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెలా దర్శనం, రూన్, సేవల టికెట్లు విడుదల చేస్తుంది. ఈ మేరకు ఆగష్టు 2025 నెలకోసం ఆర్జిత సేవా కోటాను రిలీజ్ చేసింది.
శ్రీ వేంకటేశుడి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ మే 22 వరకూ బుక్ చేసుకునే అవకాశం ఉంది. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మే 17నుంచి ఆన్ లైన్లో సొమ్ము చెల్లిస్తే సరిపోతుంది ఆగష్టు నెల ఆర్జిత సేవా టికెట్లు నమోదు చేసుకోవాలనుకుంటే మే 19 సోమవారం ఉదయం 10 గంటల నుంచి మే 21 బుధవారం ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం ఉంది.
ఆగష్టు నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటా మే 22 గురువారం ఉధయం 10 గంటలకు విడుదలవుతుంది మే 22 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలు, దర్శనం స్లాట్లకు సంబంధించి ఆగష్టు నెల కోటా విడుదలవుతుంది.
మే 22 గురువారం ఉదయం 10 గంటలకు ఆగష్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటా తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్లో రిలీజ్ చేయనుంది మే 22 గురువారం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగష్టు నెల ఆన్ లైన్ కోటా విడుదలవుతుంది మే 23 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు దివ్యాంగులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేలా ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా విడుదలకానుంది మే 24 శనివారం ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆగష్టు నెల కోటా ఆన్ లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల , తిరుపతికి వచ్చే భక్తులు గదులు బుక్ చేసుకునేందుకు వీలుగా ఆగష్టు నెల కోటాను TTD ఆన్ లైన్లో మే 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
కేవలం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దర్శనం, సేవలు, రూమ్స్ కి సంబంధించిన టికెట్ల బుకింగ్ ను బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
సాహసం సినిమాలో హింగ్ లాజ్ మాత ఆలయం గుర్తుందా? తాప్పీ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళితే గోపీచంద్ ఆమెను అనుసరిస్తాడు. ఇంతకీ ఎవరీ హింగ్ లాజ్ మాత? శక్తిపీఠాలలో ఆమె స్థానం ఏంటి? ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి