Tirumala Alert:  తిరుమల: శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టువద్ద నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ చేస్తారు. అయితే ఈ కౌంటర్లను తాత్కాలికంగా శ్రీవారి మెట్టు వద్ద నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని TTD నిర్ణయించింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు జూన్ 06 శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులోకి రానున్నాయి.

ఈ అంశానికి సంబంధించి TTD  ఈవో జె. శ్యామలరావు జూన్ 03 మంగళవారం సాయంత్రం వర్చువల్ సమావేశం ద్వారా TTD అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలు ఇవే.. శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల జారీ కోసం భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలికంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు

జూన్ 6 శుక్రవారం సాయంత్రం నుంచి భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లుజరీ ప్రక్రియ ప్రారంభం

ఆధార్ కార్డ్ చూపించి దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి శనివారం స్వామివారి దర్శనంకోసం దివ్యదర్శనం టోకెన్లు  శుక్రవారం సాయంత్రం  మంజూరు చేయనున్నారు, SSD  టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ఆయా కేంద్రాల్లో ఇస్తారు. 

భక్తుల రద్దీ వల్ల ఎలాంటి ట్రాపిక్ సమస్యలు తలెత్తకుండా టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ, జిల్లా పోలీసుల సమన్వయంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ సజావుగా సాగేలా నిరంతరం పర్యవేక్షించేందుకు అధికారుల బృందాన్ని నియమించి, టోకెన్ కౌంటర్ల దగ్గర ఇబ్బంది లేని వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

శ్రీవారి మెట్టు నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు టోకెన్ కౌంటర్ల తాత్కాలిక మార్పు అంశంపై విస్తృత ప్రచారం అవసరం అని ఆదేశించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుడా, తోపులాట జరగకుండా పటిష్టమైన క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు .

భక్తులకు అందించే అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా విబాగాల అధికారులకు సూచించారు

శ్రీ వేంకటేశ మంగళాశాసనం

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినామ్ ।శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 1 ॥

లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే ।చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ ॥ 2 ॥

శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే ।మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 3 ॥

సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసామ్ ।సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ॥ 4 ॥

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే ।సర్వాంతరాత్మనే శ్రీమద్-వేంకటేశాయ మంగళమ్ ॥ 5 ॥

స్వత స్సర్వవిదే సర్వ శక్తయే సర్వశేషిణే ।సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 6 ॥

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ।ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 7 ॥

ఆకాలతత్త్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్ ।అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 8 ॥

ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా ।కృపయాఽఽదిశతే శ్రీమద్-వేంకటేశాయ మంగళమ్ ॥ 9 ॥

దయాఽమృత తరంగిణ్యా స్తరంగైరివ శీతలైః ।అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్ ॥ 10 ॥

స్రగ్-భూషాంబర హేతీనాం సుషమాఽఽవహమూర్తయే ।సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ॥ 11 ॥

శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే ।రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 12 ॥

శ్రీమత్-సుందరజా మాతృముని మానసవాసినే ।సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 13 ॥

మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః ।సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ ॥ 14 ॥

శ్రీ పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః