గురువారం కృష్ణాష్టకం: జాతకంలో ఉండే ఎలాంటి దోషం అయినా గురువు అనుగ్రహం ఉంటే తొలగిపోతుందని చెబుతారు ఆధ్యాత్మివేత్తలు. అందుకే జగద్గురువు అయిన కృష్ణుడిని స్మరించాలని సూచిస్తారు. గురువారం బృహస్పతికి అంకితం చేసిన రోజు.. ఈరోజు కృష్ణాష్టకం పఠించి...ఆయనకు ప్రీతిపాత్రమైన తులసి ఆకులను సమర్పిస్తే గురుగ్రహం అనుగ్రహం లభిస్తుందంటారు. జాతకంలో ఎన్ని బలహీనమైన గ్రహాలున్నా..గురువు బలంగా ఉంటే చదువు, ఉద్యోగంలో తిరుగుండదని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. 

Continues below advertisement

29-07-2026 గురు పౌర్ణమి బుధవారం మీ రాశిఫలాలు!

కృష్ణాష్టకం

దేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ‖ అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ |రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

Continues below advertisement

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ |విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ‖

మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ |అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ |శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ |శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ‖

Guru Purnima Wishes 2026: మహామహుల సందేశాలు, శ్లోకాలతో గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేయండి!

జాతకంలో గురుగ్రహం శుభ స్థానంలో ఉంటే... (5,7,9 స్థానాల్లో ఉంటే)

ఉన్నత విద్య, తెలివితేటలు, ఉద్యోగంలో వృద్ధి, ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది

ఆర్థిక స్థిరత్వం, సంపద వృద్ధి, ధనలాభం

సుఖవంతమైన జీవితం బాధ్యతగల సంతానం కలుగుతారు

సమాజంలో గౌరవం, నాయకత్వ లక్షణాలు ఉంటాయి

ఆరోగ్యం, మానసిక స్థిరత్వం లభిస్తుంది 

గురు పౌర్ణమి పూజా విధానం! ఈరోజు ఈ 7పనులు చేస్తే సంపద, విజయం, అదృష్టం మీ సొంతం!

గురుగ్రహం అనుగ్రహం లేకుంటే..

విద్య, కెరీర్ లో అడ్డంకులు...ఉన్నత విద్యలో ఆలస్యం, ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోవడం

ఆదాయం ఉన్నా చేతిలో డబ్బులు నిలవకపోవడం, సేవింగ్స్ లేకపోవడం, ఆర్థిక నష్టాలు

వివాహం ఆలల్యం, కుటుంబంలో సమస్యలు

అనారోగ్యం, జీర్ణ సంబంధిత సమస్యలు, జుట్టు రాలడం

నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకపోవడం, సమాజంలో గౌరవం తగ్గడం 

ఈ సూచనలు మీ జీవితంలో కనిపించాయంటే మీ జాతకంలో గురుగ్రహం శుభస్థానంలో లేనట్టే...అప్పుడు ఈ పరిహారం పాటిస్తే బృహస్పతి అనుగ్రహం మీపై ఉంటుందని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు

ఏం చేసినా కలసిరావడం లేదా? గురు పౌర్ణమి రోజు సులభమైన ఈ పరిహారం చేయండి!

చాతుర్మాస్యం ప్రారంభం.. నాలుగు నెలలు దీక్ష ఎవరైనా చేయొచ్చా , నియమాలేంటి, దీని వెనుకున్న ఆరోగ్యం రహస్యం తెలుసా?

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు