The Mystery of the Sweating Idol: ఎన్నో ఆలయాలు...ప్రతి ఆలయంలో ఓ ప్రత్యేకత...ఈ కోవకు చెందిన ఆలయమే తిరునాయూర్ లో ఉంది. శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడు కుంభకోణానికి దగ్గర్లో ఉన్న తిరునాయూర్ క్షేత్రంలో అదృశ్యరూపంలో విహరిస్తుంటాడని చెబుతారు. అందుకు నిదర్శంగా ఇక్కడ స్వామివారి ఊరేగింపు సమయంలో బరువు పెరుగుతూ ఉండడం, చెమట్లు పట్టడం జరుగుతుంటుంది. ఇదెలా జరుగుతోంది అన్నది ఇప్పటికీ మిస్టరీ...
అమ్మవారి కోసం వెనక్కుతగ్గిన స్వామివారి వాహనం
తమిళనాడు రాష్ట్రం తిరునాయూర్ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువుకి ఏడాదికి 2సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో అమ్మవారు హంసవాహనం మీద , అయ్యవారు గరుడవాహనంపై ఊరేగుతుంటారు. ఆ సమయంలో గరుడ వాహనం చకచకా వెళ్లిపోతుంటుంది. అమ్మవారున్న హంసవాహమం నెమ్మదిగా కదులుతుంటుంది. అది గమనించిన గరుడుడు..స్వామితో ఏమన్నాడంటే... అమ్మవారున్న హంసవాహనం కన్నా ముందుకి వెళ్లను..తగిన వేగంతో వెళుతూ హంసవాహనం వెనకాలే కదులుతుంటాను అని చెప్పాడు. స్వామివారి అంగీకారంతో నెమ్మదిగా కదలడం ప్రారంభించిన గరుత్మంతుడు...ఈ మేరకు బరువు పెరుగుతూ ఉంటాడు.
Also Read: ఈ అత్తా - కోడలు ఓ దగ్గరికి చేరితే యుగాంతమే - సైన్స్ కి అందని మిస్టరీ ఇది!
బరువుపెరిగే గరుత్మంతుడు
ఈ ఆలయంలో వాహనసేవ ప్రారంభమైనప్పుడు గరుడవాహనం తేలికంగా ఉంటుంది..కేవలం నలుగురు మోస్తే చాలు కదులుతుంది. అలా ముందుకు కదిలిన గరుడవాహనం ఆ తర్వాత 5 ప్రాకారాలు దాటి దేవాలయం సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి బరువు పెరుగుతుంది. రెండో ప్రాకారాన్ని దాటే సమయానికి 8 మంది.. మూడో ప్రకారం దాటేటప్పుడు 16 మంది...నాలుగో ప్రాకారం దాటేసరికి 32 మంది...ఐదో ప్రాకారం దాటేసరికి 64 మంది...ఐదో ప్రాకారం దాటేసరికి విపరీతమైన బరువు పెరిగి మొత్తం 120 మంది మోయాల్సి వస్తుందట. ప్రధాన వీధుల్లోకి వచ్చేసరికి వాహనాన్ని మోసేవారి సంఖ్య మరింత పెరుగుతుంటుంది.
చెమట్లు పట్టే విగ్రహం
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయంలో ఊరేగింపు జరుగుతున్న సమయంలో గరత్మంతుడి విగ్రహం బరువు పెరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా...ఈ బరువు పెరుగుతున్న సమయంలో ఆ భారానికి విగ్రహానికి చెమట్లు పడుతుంటాయి. ఈ క్షేత్రంలో ఉన్న గరుత్మంతుడిని కాలగారుడన్ అని పిలుస్తారు. మహాశక్తి వంతుడైన ఈ కాలగరుడన్ నవనాగుల్ని ఆభరణాలుగా ధరిస్తాడు...
Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!
గరుత్మంతుడి ఆభరణాలుగా నవనాగులు
- ఆదిశేషుడు - గరుత్మంతుడికి కంకణం
- కర్కోటకుడు - గరుత్మంతుడి పూలదండ
- పద్మనాభుడు - గరుత్మంతుడి కుడిచెవి ఆభరణం
- మహా పద్ముడు - గరుత్మంతుడి ఎడమచేతి ఆభరణం
- శంఖపాలుడు - గరుత్మంతుడి కిరీటానికి ఆభరణం
- గుళికుడు - గరుత్మంతుడి కుడి చేయి ఆభరణం
- తక్షకుడు - గరుత్మంతుడి వడ్డాణం
- వాసుకి - గరుత్మంతుడి జంధ్యం
- తొమ్మిదో సర్పం ఆయన కంఠానికి అలంకరణ
108 శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటిగా వెలుగుతోన్న తిరునాయూర్ కి నాచ్చియార్ కోయిల్ దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి వెళితే మార్గ మధ్యలో మహాబలిపురం కూడా దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అనంతపురం బెంగళూరు మీదుగా కూడా నాచ్చియార్ వెళ్లొచ్చు.
శ్రీ విష్ణు గాయత్రి
ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి
తన్నోవిష్ణుః ప్రచోదయాత్
శ్రీ గరుడ గాయత్రి
ఓం తత్పురుషాయ విద్మహే
సువర్ణ పక్షాయ ధీమహి
తన్నో గరుడః ప్రచోదయాత్