Solar and Lunar eclipse 2026: ఫిబ్రవరిలో 15 రోజుల తేడాతో చంద్ర మరియు సూర్య గ్రహణాలు సంభవిస్తున్నాయి. ఒక నెలలో రెండు గ్రహణాలు శుభమా లేదా అశుభమా అని తెలుసుకోండి. అవి ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి.15 రోజుల్లో రెండు గ్రహణాలున్నాయి

Continues below advertisement

2026 ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం

2026 మార్చి 03న చంద్రగ్రహణం

Continues below advertisement

ఈ గ్రహణాల ప్రభావం భారతదేశంపై ఎలా ఉంటుంది? 

15 రోజుల్లో 2 గ్రహణాలు ఎంత ప్రమాదకరమైని? ఏం సాంకేతాన్నిస్తున్నాయ్?

సూర్యగ్రహణం , చంద్రగ్రహణం రెండూ అశుభకరమైనవిగా పరిగణిస్తారు. ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం సంభవిస్తోంది. మార్చి 3, 2026న హోలికా దహనం సమయంలో చంద్రగ్రహణం సంభవిస్తుంది. ముఖ్యమైన తేడా ఏంటంటే ఈ గ్రహణాలు 15 రోజుల్లోపు సంభవిస్తాయి, ఇది ఒక విపత్కర సంఘటన జరిగే అవకాశాన్ని పెంచుతుంది. అయితే, కొంతమంది జ్యోతిష్కులు దీనిని సాధారణ సంఘటన అని పిలుస్తున్నారు.

ఫిబ్రవరి 17న మాఘ మాస అమావాస్య నాడు సంభవించే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు, కానీ ఫాల్గుణ మాసం మార్చి 3న సంభవించే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. శాస్త్రాలలో గ్రహణాలను అశుభకరమైనవిగా భావిస్తారు. వాటి ప్రభావాలు ప్రతికూల శక్తిని పెంచుతాయి  ఒక వ్యక్తి జీవితంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతాయి. 

సిగ్నల్ ఏంటి?

ఈ 15 రోజుల్లో రెండు గ్రహణాలు స్టాక్ మార్కెట్‌లో గణనీయమైన తగ్గుదలకు కారణమవుతాయి. అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది.

భూకంపాలు,  వరదలు సంభవించవచ్చు..  చట్టానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం చెలరేగవచ్చు.

రెండు దేశాల మధ్య యుద్ధం లాంటి పరిస్థితులు తలెత్తవచ్చు, దీని ప్రభావం మొత్తం ప్రపంచంపై కనిపిస్తుంది.

యువతలో ఉద్రేకం పెరుగుతుంది..కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతాయి అధికార యంత్రాంగంలో మార్పులు ఉంటాయి. ప్రముఖ నాయకుల నుంచి విచారకరమైన వార్తలు అందే అవకాశం ఉంది.

గ్రహణ సమయంలో ఏం చేయాలి  ఏం చేయకూడదు?

దేవుని మంత్రాలను జపిస్తే, దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చు.

గ్రహణ సమయాన్ని ఆధ్యాత్మిక సాధనకు అనువైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో దేవుని విగ్రహాలు , చిత్రాలను తాకడం నిషేధం. సూతకాలం పూర్తైన తర్వాత స్నానమాచరించి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేయాలి. ఇంట్లో దేవుడి మందిరాన్ని కూడా శుభ్రం చేయాలి. చంద్రగ్రహణం సున్నితమైన సమయం కాబట్టి గర్భిణిలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు.

నమ్మకాల ప్రకారం, సూతక సమయంలో జపించే మంత్రాలు ప్రభావవంతంగా ఉంటాయని నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో దైవారాధనలో ఉండాలి

గ్రహణం సమయంలో బయటకు వెళ్లి నేరుగా సూర్యుడిని లేదా చంద్రుడిని చూడకూడదు..కళ్ళకు హాని కలిగిస్తుంది.

గ్రహణం సమయంలో నిద్రపోవడం , తినడం నిషేధం.. 

గ్రహణానికి ముందు ముందుగా తయారుచేసిన ఆహారాన్ని గ్రహణం తర్వాత తినకూడదు. సూతకాలం పూర్తైన తర్వాత స్నానమాచరించి మళ్లీ ఆహారాన్ని సిద్ధం చేసుకుని తీసుకోవాలి. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.