Lakshmi Devi: శ్రీ మహాలక్ష్మిని సంపదకు అధిష్టాన దేవతగా పూజిస్తారు. మా ఇంట సిరులు కురిపించమ్మా అని పూజిస్తారు. లక్ష్మీపూజకు ప్రతి శుక్రవారాన్ని మరింత ప్రత్యేకంగా భావిస్తారు. అయితే లక్ష్మీదేవిని సిరుల తల్లి అని ఎందుకంటారు? ఆమె డబ్బుకి మాత్రమే అధిదేవత కాదు 8 రకాల సంపదకు అధిపతి అని మీకు తెలుసా?

Continues below advertisement

మీరు కోరుకున్నవన్నీ పొందాలంటే ఈ అష్టలక్ష్మి మంత్రాలను పఠించండి

దేవతలు  - రాక్షసులు కలసి క్షీర సాగర మథనం చేసినప్పుడు లక్ష్మీదేవి జన్మించింది. దేవతలకు బలం తగ్గి రాక్షసులు పైచేయి సాధిస్తున్న సమయంలో అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించమని విష్ణువు సలహా ఇచ్చారు. మంధర పర్వాతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకి సర్పాన్ని తాడుగా మార్చి మధించగా 14 రకాల రత్నాలు బయటకు వచ్చాయి. వాటిలో ఒకటిగా.. బంగారు కాంతితో పద్మంపై కూర్చని నాలుగు చేతులతో ఆవిర్భవించింది మహాలక్ష్మి. ఆమెతో పాటే సంపద, సిరి, సౌందర్యం, శుభం వచ్చాయ్. దేవతలు - రాక్షసులు అందరూ ఆమెను పొందాలని పోటీపడ్డారు కానీ.. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును వరించింది. విష్ణువు లోక రక్షకుడు అయితే..మహాలక్ష్మి లోక పోషణకి అధిపతిగా మారింది. పోషణ అంటే ఆహారం, వస్త్రం, ధనం, సౌఖ్యం అన్నీ వస్తాయి..అందుకే ఆమెను సిరుల తల్లి అంటారు.  శ్రీ అంటే శోభ, శుభం, కాంతి, సంపద  

లలితాదేవి చేతిలో పాశం గురుత్వాకర్షణ శక్తికి, ఇచ్ఛాశక్తికి ప్రతీక! ఆ 'పాశం' వెనుకున్న ఆధునిక విజ్ఞాన శాస్త్రం!

వేదాల ప్రకారం లక్ష్మీదేవి డబ్బుకి మాత్రమే కాదు...ఈ 8 రకాల సంపదలకు అధిష్టాన దేవత. ఈ 8 రకాల సంపదలనే అష్టలక్ష్ములుగా పూజిస్తున్నాం. 

Continues below advertisement

ఆది లక్ష్మి – మూల సంపద, ఆత్మజ్ఞానం  - జీవితంలో ప్రారంభాన్ని సూచిస్తుంది ఆదిలక్ష్మి

ధాన్య లక్ష్మి – ఆహార ధాన్య సంపద  - ఆర్థిక సంక్షోభం ఎదుర్కోకుండా రక్షించే అమ్మ

ధైర్య లక్ష్మి – మనోబలం, ధైర్యం  - భయం, పిరికితనం వీడి ధైర్యంగా లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరించేదే ధైర్యలక్ష్మి గజ లక్ష్మి – వాహన, రాజ్య సంపద   - అనారోగ్యం నుంచి ఉపశమనం కలిగించి ఆరోగ్యాన్నిచ్చే శక్తి గజ లక్ష్మి సంతాన లక్ష్మి – పిల్లలు, వంశాభివృద్ధి   - ఉత్తమ సంతానాన్ని ప్రసాదించే సంతాన లక్ష్మి

విజయ లక్ష్మి – విజయం, కీర్తి  - చేపట్టిన పనిలో విజయాన్నిందించి ఉన్నత స్థాయికి చేర్చేందుకు విజయ లక్ష్మి

విద్యా లక్ష్మి – జ్ఞానం, విద్య   - మీరు నేర్చుకునే చదువు, విజ్ఞానం నుంచి ప్రయోజనం కలగాలంటే విద్యాలక్ష్మిని పూజించాలి

ఐశ్వర్య లక్ష్మి – ధనం, బంగారం - ఇక్కడ ఐశ్వర్యం అంటే బంగారం మాత్రమే కాదు ఆనందం కూడా లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు కాదు జీవితానికి కావాల్సిన అన్ని సిరులు అందించే దేవత. అందుకే ఆమెను సిరుల తల్లి అంటారు భక్తులు.  

సంతాన భాగ్యం లేదా? ఈ 6 సులభమైన పరిహారాలు పాటిస్తే చాలు ఇంట్లో నవ్వుల్ విరబూస్తాయ్!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.