Spirituality:  స్త్రీ అందాన్ని ఆరాధించడంలో రానురాను మార్పులొచ్చినా ఆరాధన పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గలేదు. ఇప్పటికీ కొందర్ని చూసి అప్సరసలా ఉంది అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అందం గురించి హయ్యెస్ట్ పొగడ్త ఏంటంటే అప్సరస. మరి ఎవరైనా చూశారా అని అడిగితే..ఆ ఒక్కటీ అడగొద్దు. ఎందుకంటే స్వర్గం-నరకం ఉంటాయని చెప్పుకుంటాం కదా ఇది కూడా అంతే. వీటి గురించి పండితులు చెబితే వినడం, పురాణాల్లో చదవడమే. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అప్పరసలు కూడా స్వర్గంలో ఉంటారు. స్వర్గంలో దేవతలను తమ నాట్యగానాలతో అలరించేవారే అప్సరసలు. వీళ్లు సప్తగణాల్లో ఓ వర్గం. 
సప్తగణాలంటే
1. ఋషులు 
2. గంధర్వులు 
3. నాగులు 
4. అప్సరసలు 
5. యక్షులు 
6. రాక్షసులు 
7. దేవతలు


Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థికంగా అదిరింది, మార్చి 6 నుంచి 12 వారఫలాలు


వీరిలో అందరి నోట్లో నిత్యం నానే పదం అప్సరసలు. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు సముద్రం నుంచి వెలువడిన నురుగు నుంచి ఉద్భవించారట అప్సరసలు. దేవలోకంలో ఆటపాటలతో అలరించే అప్సరసలు అప్పుడప్పుడు తాపసులను వెంట తిప్పుకున్న సందర్భాల గురించీ పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఓ  సందర్భంలో విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి వెళ్లి సక్సెస్ అయిన మేనక కొన్నాళ్ల తర్వాత శకుంతలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కణ్వమహర్షి దగ్గర పెరిగిన శకుంతలను...వేటకు వచ్చిన దుష్యంతుడు చూసి వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత దూర్వాసుడి శాపం కారణంగా ఆమెను మరిచిపోవడం.. తనయుడు భరతుడితో సహా భర్త దుష్యంతుడి రాజ్యానికి వెళ్లి అవమానాల పాలవడం ఇదంతా వేరే కథ. అయితే మహర్షుల  తపో భంగం చేయడానికి అప్సరసలను ప్రయోగించేవారు. విశ్వామిత్రుడు దేవతలను ఎదిరించి మరో స్వర్గం సృష్టించడానికి ప్రయత్నించాడు. ఇంద్రుడు, తన శక్తులను చూసి భయపడి, మేనకను స్వర్గం నుంచి భూమికి పంపించి విశ్వామిత్రుడిపై ప్రయోగిస్తాడు. పుష్కర సరస్సులో స్నానం చేస్తున్న మేనకను చూసి మోహించిన విశ్వామిత్రుడు తన తపస్సు లక్ష్యాన్ని మరచి మేనకపై ప్రేమ పెంచుకుని కొన్నాళ్లపాటూ ఆమెతో కలసి ఉండిపోతాడు. అలా జన్మించిన శకుంతలను విశ్వామిత్రుడికి అప్పగించి తన పని పూర్తైందని చెప్పి మేనక తిరిగి ఇంద్రలోకానికి వెళ్లిపోతుంది. తన తపస్సుకి చిన్నారి అవరోధం కాకూడదని భావించి బాలికను పక్షులకు అప్పగించి వెళ్లిపోతాడు విశ్వామిత్రుడు. ఇలా వెళ్లివారిలో మహర్షుల మనసు మళ్లించడంలో కొంతమంది అప్సరసలు విజయాన్ని సాధిస్తే, మరికొంతమంది మహర్షుల ఆగ్రహావేశాలకి గురై శాపాలపాలయ్యారు. ఇంతకీ అప్సరసలంటే రంభ, ఊర్వశి,మేనక అని మాత్రమే తెలుసు కానీ బ్రహ్మ పురాణం ప్రకారం అప్సరసల సంఖ్య 31. వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని కూడా అంటారు. 


Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థికంగా అదిరింది, మార్చి 6 నుంచి 12 వారఫలాలు


బ్రహ్మ పురాణం ప్రకారం 31 మంది అప్సరసలు వీరే
రంభ,  మేనక, ఊర్వశి , తిలోత్తమ, ఘృతాచి
సహజన్య, నిమ్లోచ, వామన, మండోదరి, సుభోగ
విశ్వాచి, విపులానన, భద్రాంగి, చిత్రసేన, ప్రమోచన
ప్రమ్లోద, మనోహరి /మనో మోహిని, రామ, చిత్రమధ్య
శుభానన, సుకేశి, నీలకుంతల, మన్మదోద్ధపిని, అలంబుష
మిశ్రకేశి, పుంజికస్థల, క్రతుస్థల, వలాంగి, పరావతి, మహారూప, శశిరేఖ