Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కానీ..వీటిలో కొన్ని ఆలయాలు మాత్రం మిస్టరీగానే ఉండిపోయాయి. శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా అవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అలాంటి కొన్ని దేవాలయాల గురించి చూద్దాం...


యాగంటి
ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాంగటి. ఇక్కడ కొలువైన నంది విగ్రహం మిస్టరీ ఇప్పటికీ అంతుచిక్కలేదు. మొదట్లో  చిన్నగాఉన్న నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతుంటారు. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..ఈ రాయికి పెరిగే స్వభావం ఉందని..అందుకే ప్రతి 20 ఏళ్ళకు  ఇంచి చొప్పున పెరుగుతోందని అన్నారు. అయితే భక్తులు మాత్రం అదంతా పరమేశ్వర లీల అంటారు. ఏదో ఒకరోజు ఈ నంది లేచి రంకెలేస్తుందని..అప్పడు యుగాంతమే అని నమ్మతుంటారు. 


Also Read: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!


లేపాక్షి
ఆంధ్రప్రదేశ్ లోని ఆనంతపురం జిల్లాలో ఉంది లేపాక్షి. ఇక్కడున్న స్తంభాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. 16వ శతాబ్ధంలో నిర్మించిన ఈ ఆలయంలో స్తంభాల కింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పెట్టేయవచ్చు. అంటే స్థంభానికి ఫ్లోర్ కి మధ్య గ్యాప్ ఉందని అర్థం. అయితే స్తంభం నేలకు తాకకుండా ఆలయాన్ని  ఎలా మోస్తోంది అన్నది మిస్టరీ. 


తంజావూరు
తంజావూరులో బృహదీశ్వరాలయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో అంతుచిక్కని రహస్యం ఏంటంటే నీడ పడదు. ఏకాలంలో చూసినా ఏ సమయంలో అయినా ఆలయం నీడ భూమిపై పడదు. 


పూరీజగన్నాథ్ 
పూరీజగన్నాథ్ ఆలయంలో ఎన్నో మిస్టరీలున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆలయం సింహద్వారం ముందు వరకూ వినిపించే సముద్ర ఘోష...ద్వారం దాటి అడుగు అటువైపు వేయగానే వినిపించదు. ఆ టెక్నాలజీ ఏంటో ఇప్పటికీ అంతుచిక్కలేదు


Also Read: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం - ఫిబ్రవరి రాశిఫలాలు


శని శింగనాపూర్ 
మహారాష్ట్రలో ఓ గ్రామం శని శింగనాపూర్. ఈ ఊరిలో ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. ఇప్పటి వరకూ ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘనటలు కూడా లేవంటారు స్థానికులు. ఒకవేళ దొంగతనం జరిగితే వారిని శనిదేవుడు శిక్షిస్తాడని నమ్ముతారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇళ్లకు మాత్రమే కాదు ఈ ఊర్లో బ్యాంకులకు కూడా తాళాలు వేయరట


షోలాపూర్
మహారాష్ట్ర షోలాపూర్ లో ఓ వింత గ్రామం ఉంది... పేరు షెత్పల్. ఈ గ్రామంలో పాములను పూజిస్తుంటారు. ప్రతి ఇంట్లో పాములకోసం ఓ ప్రత్యేక స్థలం కేటాయిస్తారట..ఇంట్లో మనుషులు  తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూఉంటాయి. కానీ ఇప్పటివరకూ ఆ గ్రామంలో ఎవరినీ పాము కరిచిన దాఖలాలు లేవు.


అమ్రోహా
ఉత్తరప్రదేశ్ లో ఉన్న అమ్రోహా అనే పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా తేళ్ళు ఉంటాయి. ఇక్కడ ఆలయంలోపల చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. అక్కడకు వచ్చే భక్తులను మాత్రం కుట్టవు. భక్తులు వాటిని పట్టుకుంటారు కూడా.


ఇంకా చెప్పుకుంటూ పోతే..భారతదేశంలో ఎన్నో ఆలయాల్లో అంతుచిక్కని మిస్టరీలెన్నో ఉన్నాయి. పరిశోధనల ద్వారా కారణాలు అన్వేషిద్దామని శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇదంతా దైవలీల అంటారు భక్తులు