స్నానం..శరీరంపై అంటుకున్న దుమ్ము, ధూళి, చెమట, రజో తమో గుణాలను కడిగేస్తుంది. తద్వారా మనసు సాత్వికంగా మారి ధ్యానానికి సిద్ధమవుతుంది. నీటి స్పర్శ ద్వారా చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు, మానసకి కల్మషం తొలగిపోతాయి. ఆరా శుభ్రం అయి ప్రాణశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మూలాధార చక్రం నుంచి నీరు ప్రవహించడం వల్ల శక్తి కేంద్రాలు శుభ్రమవుతాయి. ఇది కుండలిని శక్తి జాగృతికి ముందస్తు సన్నాహపరుస్తుంది. బాహ్యంగా కడుక్కోవడం ద్వారా అంతర్గత శుద్ధిడిని అనే భావన కలుగుతుంది.
హిందూ సంప్రదాయంలో స్నానం ఆచరించకుండా పూజ చేయరు. శుద్ధ శరీరంతో భగవంతుడిని పూజిస్తే పూజా ఫలం రెట్టింపవుతుందని నమ్మకం. చల్లటి నీరు శరీరంపై పడితే మనసులో ఉన్న అలజడి, కోపం, ఆందోళన తగ్గుతాయి. స్నానం చేసిన తర్వాత మనసు స్వచ్ఛంగా మారుతుంది. గంగ, యమున, కృష్ణా, గోదావరి, నర్మద, కావేదీ, సింధి సహా పుణ్యనదుల్లో స్నానమాచరిస్తే సంచిత కర్మలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
స్నానం ఆచరించే సమయం కూడా ముఖ్యమే..బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే సాత్విక శక్తులు ఎక్కువ ఉంటాయి. ఆధ్యాత్మిక సాధనకు బలం లభిస్తుంది. స్నానం చేసేటప్పుడు గంగమ్మకు నమస్కరించాలి, అనంతరం ప్రత్యక్షనారాయణుడు అయిన సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
అయితే.. గ్రహ దోషాలు తొలగిపోవాలంటే ఏ రోజు స్నానం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకోవడం కూడా ముఖ్యమే..
ఆదివారం - సూర్య గ్రహ దోషం తొలగిపోయేందుకు ఆదివారం స్నానం చేసే నీటిలో కుంకుమపువ్వు కానీ ఎర్రటి పూలు కానీ నీటిలో కలిపి స్నానం ఆచరిస్తే సూర్య గ్రహ దోషం తగ్గిపోతుంది. సోమవారం - చంద్ర దోషం తొలగిపోయేందుకు
జాతకంలో చంద్ర గ్రహ దోషం ఉంటే స్నానం చేసి నీటిలో ఓ చుక్క పాలు లేదా పెరుగు వేసుకుని స్నానమాచరించాలి
మంగళవారం - కుజ గ్రహ దోషం తొలగిపోయేందుకు
మంగళవారం స్నానం ఆచరించే నీటిలో బిల్వ ఆకు పొడి వేసుకుని స్నానం చేయాలి
బుధవారం - బుధ గ్రహ దోషం తొలగిపోయేందుకు
స్నానమాచరించే నీటిలో సముద్రపు నీరు కానీ గంగానది నీరు కానీ రాళ్ల ఉప్పు కానీ వేసి స్నానమాచరిస్తే బుధగ్రహ దోషం తగ్గుతుంది గురువారం - గురుగ్రహ దోషం తొలగిపోయేందుకు
గురువారం రోజు నల్ల యాలకులను నీటిలో ఉడికించి వాటిని స్నానం చేసే నీటిలో కలిపి స్నానమాచరిస్తే గురు గ్రహ దోషం తొలగిపోతుంది శుక్రవారం - శుక్రగ్రహ దోషం తొలగిపోయేందుకు ఈ రోజు కూడా యాలకులను నీటిలో ఉడికించి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకుని చేస్తే శుక్ర గ్రహ దోషం తగ్గుతుంది శనివారం - శనిగ్రహ దోషం తొలగిపోయేందుకు
నీటిలో నల్లటి నువ్వులు వేసుకుని స్నానం చేయాలి రాహు గహ్ర దోషం తొలగిపోయేందుకు శనివారం మహి షాసిని పొడిచేసి నీటిలో మరిగించి స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి కేతు గ్రహ దోషనివారణ కోసం మంగళవారం గరికను నీటిలో ఉడకబెట్టి స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి ఈ నియమాలను అనుసరిస్తూ ఆయా రోజుల్లో స్నానం ఆచరించి భగవంతుడికి నమస్కరిస్తే గ్రహదోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని సనాతన హిందూ ధర్మం చెబుతోంది
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.
