Rakshabandhan Special: రక్షాబంధన్ పండుగ సోదర, సోదరీమణుల మధ్య ఉన్న బలమైన ప్రేమ, గౌరవం, రక్షణ వాగ్దానానికి ప్రతీక, ఇది ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ శనివారం, ఆగస్టు 9, 2025న వచ్చింది.
రక్షాబంధన్ రోజున సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కడుతుంది. దీనిని రక్షాసూత్రం అంటారు. సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి, సోదరి అతని దీర్ఘాయువు , విజయాన్ని కోరుకుంటుంది
పవిత్ర బంధానికి ప్రతీక 'రాఖీ'
రక్షాబంధన్ పవిత్రమైన రోజున సోదరి తన సోదరుడి మణికట్టుకు కట్టే రక్షాసూత్రం కేవలం ఒక దారం మాత్రమే కాదు, ఇది ప్రేమ, నమ్మకం మరియు గౌరవానికి ప్రతీక. రక్షాబంధన్ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు మరియు భక్తితో రాఖీ కట్టించుకుంటారు. కానీ రాఖీని తీసివేయడానికి వచ్చినప్పుడు దానిపై ఎక్కువ శ్రద్ధ చూపరు. కొంతమంది రాఖీని తీసేసి ఎక్కడోదగ్గర పడేస్తుంటారు. ఇది చాలా తప్పు. మణికట్టుకు కట్టిన రాఖీని ఎన్ని రోజులకు తీసివేయాలి? రాఖీని తీసిన తర్వాత ఏమి చేయాలో తెలుసుకోండి.
రాఖీని ఎన్ని రోజుల తర్వాత తీసివేయవచ్చు
మణికట్టుకు కట్టిన రాఖీని మీరు ఎన్ని రోజులకు తీసివేస్తారనేది గౌరవం, సౌలభ్యంపై ఆధారపడి ఉంటుంది. కానీ మతపరమైన , శాస్త్రీయ కోణం నుంచి కొన్ని నమ్మకాలు నియమాలు చెప్పారు. వీటిని కచ్చితంగా పాటించాలని చెబుతారు పండితులు. మతపరంగా చూస్తే రాఖీని తీసివేయడానికి ఖచ్చితమైన సమయం లేదా ప్రత్యేకమైన రోజు అంటూ ఏమీ లేదు. కానీ మీరు మణికట్టుకు కట్టిన రాఖీని శ్రావణ పూర్ణిమ నుంచి శ్రావణ అమావాస్య వరకు అంటే 15 రోజుల వరకు ఉంచుకోవచ్చు. కొంతమంది నమ్మకం ప్రకారం రాఖీని 3, 7 లేదా 11 రోజుల వరకు చేతిలో ఉంచుకుని ఆ తర్వాత తీసివేస్తారు. చాలా మంది జన్మాష్టమి లేదా గణేష్ చతుర్థి రోజున కూడా రాఖీని తీసివేస్తారు. కానీ కనీసం 24 గంటల పాటు చేతిలో రాఖీని ఉంచుకోండి. పితృ పక్షం ప్రారంభానికి ముందే రాఖీని తప్పనిసరిగా తీసివేయాలి.
శాస్త్రీయ కోణం నుంచి కూడా రాఖీని ఎక్కువ రోజులు చేతిలో ఉంచుకోవడం మంచిది కాదు. విజ్ఞానం ప్రకారం, రాఖీ లేదా రక్షాసూత్రం నూలు లేదా పట్టు దారంతో తయారు చేస్తారు. ఇది నీరు లేదా ధూళి పడినప్పుడు మురికిగా మారుతుంది మరియు దీనివల్ల బ్యాక్టీరియా ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, రాఖీని శుభ్రంగా ఉంచినన్ని రోజులు మణికట్టుకి ఉంచి ఆ తర్వాత తీసివేయాలి. చేతినుంచి తీసేసిన రాఖీని ఏం చేయాలి?
రాఖీ లేదా రక్షాసూత్రం ఒక పవిత్రమైన దారం. కాబట్టి, దానిని అక్కడక్కడ పడేయకూడదు. రాఖీని తీసివేసిన తర్వాత, మీరు దానిని నీటిలో నిమజ్జనం చేయవచ్చు, చెట్టుకు కట్టవచ్చు లేదా మొక్కల్లో మట్టిలో పెట్టొచ్చు.
రక్షాబంధన్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
ప్ర. రాఖీని ఎన్ని రోజులు ధరించాలి?
జ. కనీసం 24 గంటలు - గరిష్టంగా 15 రోజుల రాఖీని ధరించవచ్చు.
ప్ర. రాఖీని నీటిలో వేయవచ్చా?
జ. అవును, రాఖీని తీసిన తర్వాత దానిని నీటిలో వేయడం సముచితం.
ప్ర. రక్షాబంధన్ నాడు ఉపవాసం ఉండటం అవసరమా?
జ. లేదు, సాంప్రదాయకంగా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, కానీ మీరు భక్తితో ఉపవాసం ఉండవచ్చు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు, సమాచారం ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.