Spirituality: పూజలు, వ్రతాలు సహా నిత్యం ఇంట్లో పాటించే నియమాలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కోమాట చెబుతుంటారు. ఇలా చేయాలని కొందరు, అలా చేయాలని కొందరు ఎవరి నమ్మకాలు వారివి. అయితే పూజ పూర్తైన తర్వాత పూజా మందిరం తలుపులు తెరిచి ఉంచాలా? మూసి ఉంచాలా? ఏం చేస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీనికి ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన సమాధానమేంటి తెలుసుకోండి? 

Continues below advertisement

చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ తర్వాత..దీపం వెలుగుతున్నంతసేపూ తలుపులు తెరిచి ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. 

దీప జ్యోతి నుంచి వెలువడే సానుకూల శక్తి ఇల్లంతా వ్యాపించి శాంతి, సౌభాగ్యాలను కలిగిస్తుందని విశ్వాసం.

Continues below advertisement

సాయంత్రం సమయంలో కూడా వెలిగించే దీపం మహాలక్ష్మీ ప్రవేశానికి సంకేతంగా భావిస్తారు...తలుపులు తెరిచి ఉంచడం లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు భావిస్తారు దీపం వెలగడానికి ఆక్సిజన్ అవసరం. తలుపులు మూసివేస్తే గాలి ప్రసరణ తగ్గి దీపం ఘనమయ్యే అవకాశం ఉండొచ్చు..అందుకోసం కూడా తలుపులు తెరిచి ఉంచాలని చెబుతారు. దీపం పూర్తిగా ఘనమయ్యాక డోర్స్ మూసేయవచ్చు.

జూలై 2026లో కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ కోతల ముప్పు లేదా గొప్ప పదోన్నతి? మీ కెరీర్ ఎటువైపు?

పూజగది తలుపులు ఎప్పుడు మూయవచ్చు?

దేవుడి పవళింపు సేవ తర్వాత పూజగది తలుపులు మూయవచ్చు

ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూజ గది తలుపులు మూసి ఉంచాలి

గాలి ఎక్కువగా వీచి దీపం ఘనమవుతుంది అనిపిస్తే కొద్దిసేపు దీపానికి రక్షణగా పెట్టి ఆ తర్వాత తలుపులు మూసివేయాలి అవకాశం ఉన్నంతవరకూ దీపం వెలిగేటప్పుడు తలుపు తెరిచి ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.  

పూజ సమయంలో ఆహ్వానించిన దైవిక శక్తి, పాజిటివ్ ఎనర్జీని అక్కడే ఉంచడానికి వేసి ఉంచడం మంచిది

ధూపం, దీపం, పూల వాసనలు ఇంటి నుంచి బయటకు వ్యాపించకుండా డోర్స్ మూసివేస్తారు ధూళి, క్రిములు, ప్రతికూల శక్తులు లేదా..పిల్లలు, ఇతరులు ముట్టుకోకుండా కూడా డోర్స్ రక్షణ ఉదయం పూజ తర్వాత కాసేపు తెరిచి ఉంచి మిగిలిన సమయం మూసివేయాలి.   

మీ పూజా మందిరానికి తలుపులు లేకుంటే కర్టెన్లు ఉపయోగించవచ్చు

వక్రగతిలో బుధుడు! మిథునం, కన్య, ధనుస్సు , మీన రాశులపై కెరీర్‌పై ప్రభావం!

దీపంవెలిగించేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం

దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే 

దీపం జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగించి..దేవుడి కన్నా ముందు ఆ దివ్యమైన రూపానికి ప్రతిరూపం అయిన దీపాన్ని ఆరాధిస్తారు. షోడసోపచారాల్లో దీపం మొదటిది. ఉపచారాలు అన్నీ చేసినా లేకున్నా.. దీపం, ధూపం, నైవేద్యం తప్పనిసరిగా అనుసరించాల్సిన ఉపచారాలు.

మహిళలు చేతులకు గాజులు ధరించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? భారతీయ సంస్కృతిలో వాటి లోతైన చరిత్ర!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు