Saddula Bathukamma 2025 Date: సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలి? రోజుల లెక్కనా? తిథులను పరిగణలోకి తీసుకోవాలా? నిమజ్జనం సమయానికి అష్టమి తిథిని పరిగణలోకి తీసుకోవాలా? 

Continues below advertisement

రోజుల ప్రకారం అయితే

తొమ్మిది రోజు పూల పండుగలో భాగంగా రోజుకో బతుకమ్మను ఆరాధిస్తారు.. ఈలెక్కన సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్యతో బతుకమ్మ ప్రారంభమైంది. 

Continues below advertisement

సెప్టెంబర్ 21 ఎంగిలిపూల బతుకమ్మ, సెప్టెంబర్ 22 అటుకుల బతుకమ్మ, సెప్టెంబర్ 23 ముద్దపప్పు బతుకమ్మ, సెప్టెంబర్ 24 నానబియ్యం బతుకమ్మ, సెప్టెంబర్ 25 అట్ల బతుకమ్మ, సెప్టెంబర్ 26 అలిగిన బతుకమ్మ, సెప్టెంబర్ 27 వేపకాయల బతుకమ్మ, సెప్టెంబర్ 28 వెన్నముద్దల బతుకమ్మ, సెప్టెంబర్ 29న తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. రోజులను పరిగణలోకి తీసుకుంటే సద్దులబతుకమ్మ సెప్టెంబర్ 29 సోమవారం జరుపుకోవాలి

తిథుల ప్రకారం అయితే

మహాలయ అమావాస్య రోజు ప్రారంభమయ్యే బతుకమ్మ.. భాద్రపద అమావాస్య, ఆశ్వయుజ పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి....తొమ్మిది రోజులు సాగుతుంది. అంటే తిథుల ప్రకారం అమావాస్య తో ప్రారంభమై.. అష్టమితో ముగుస్తుంది. 

కన్ఫ్యూజన్ ఎందుకు మరి?

అష్టమి తిథి సోమవారం మధ్యాహ్నం 12 గంటల 06 నిముషాల నుంచి ప్రారంభమైంది

మంగళవారం మధ్యాహ్నం ఒంటింగట 16 నిముషాల వరకూ ఉంది.

సాధారణంగా పండుగలన్నీ సూర్యోదయానికి తిథి ఉన్నవే పరిగణలోకి తీసుకుంటారు (దీపావళి అమావాస్య, కార్తీక పౌర్ణమి మినహా). అందుకే అష్టమి తిథి   సెప్టెంబర్ 30 మంగళవారం ఉదయానికి ఉందికాబట్టి ఈ రోజే సద్దుల బతుకమ్మ అని కొందరు.. కాదు కాదు బతుకమ్మను నిమజ్జనం చేసేది  సంధ్యాసమయం తర్వాతే కాబట్టి..రాత్రికి తిథి ఉన్న సెప్టెంబర్ 29 సోమవారమే సద్దుల బతుకమ్మ అని మరికొందరు.  వరంగల్ భద్రకాళి ఆలయం అర్చకులు, తెలంగాణ విద్వత్ సభ.. సెప్టెంబర్ 30 మంగళవారం సద్దులబతుకమ్మ జరుపుకోవాలంటారు ( సూర్యోదయానికి ఉన్న తిథినే ప్రామాణికంగా తీసుకోవాలన్నది వీరి వాదన)

మహాలయ అమావాస్య రోజు ప్రారంభమైన పండుగ తొమ్మిది రోజుల లెక్కన సెప్టెంబర్ 29న సోమవారంతో ముగుస్తుందని వరంగల్ వేయిస్తంభాల ఆలయ అర్చకులు చెబుతున్నారు

ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ 30 మంగళవారం సద్దుల బతుకమ్మ నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది

మరి 9 రోజులు ప్రామాణికమా? 

సూర్యోదయానికి అష్టమి తిథి ప్రధానమా?

సద్దుల బతుకమ్మ ఎప్పుడు?

తెలంగాణ పురోహితులు చెప్పేమాటేంటంటే... శుభకార్యాలు, ప్రారంభోత్సవాలకు మాత్రమే సూర్యోదయానికి అష్టమితిథి లెక్క.. బతుకమ్మకు 9 రోజులే ప్రామాణికం అందుకే సెప్టెంబర్ 29 సోమవారమే సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవడం శ్రేష్ఠం అంటున్నారు. పైగా బతుకమ్మను నిమజ్జం చేసే సమయానికి అష్టమి తిథి ఉంటుంది.. అమావాస్య to అష్టమి.. 9 రోజులు పూర్తవుతుందంటున్నారు. 

పెద్దలు చెప్పే మాట..

సాధారణంగా మంగళవారం, శుక్రవారం రోజున గౌరమ్మను సాగనంపరు. ఈ లెక్కన తీసుకున్నా సద్దులబతుకమ్మ నిర్వహించుకోవాల్సింది సెప్టెంబర్ 29 సోమవారమే...

తెలంగాణ స్థానికుల మాట..

ఇంటి గౌరమ్మను మంగళవారంతో పంపించం కదా..అందుకే సోమవారమే సద్దుల బతుకమ్మ అంటున్నారు హైదరాబాద్ వాసులు.  పైగా బతుకమ్మను నిమజ్జనం చేసే సమయానికి అష్టమి తిథి ఉంటుంది. 

తెల్లారితే పండుగ పెట్టుకుని ఇలాంటి గందరగోళంలో పడొద్దు.  మీ ఇంటి పూజారి లేదంటే ఇంట్లో పెద్దలు చెప్పిన పద్ధతిని అనుసరించి గౌరమ్మను సంబురంగా సాగనంపండి.